TG ECET and Polycet Counselling : టీజీ పాలిసెట్, ఈసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం, షెడ్యూల్ ఇదే!

తెలంగాణలో పాలిసెట్, ఈసెట్ పరీక్ష రాసిన వారికి కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలయింది. షెడ్యూల్ వివరాలు తెలుసుకుందాం.

TG ECET and Polycet Counselling : పదవ తరగతి పూర్తి చేసుకొని ఉన్నత చదువులు చదువుకోవడం కోసం వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందుతారు.దాంట్లో భాగమే పాలిటెక్నిక్ (Polytechnic) పరీక్ష. ఇటీవలే పాలిటెక్నిక్ పరీక్షలు ముగిశాయి. కాగా, 2024-25 విద్య సంవత్సరానికి పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం అయింది. దానికి సంబంధించిన షెడ్యుల్ విడుదల అయింది.10వ తరగతి పూర్తి అవగానే డిప్లొమా చేయాలనుకునే వారు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ద్వారా డిప్లొమా చేయడానికి అర్హత సాధిస్తారు.

ఇందుకోసం జూన్ 20న కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తాజా షెడ్యూల్ ప్రకారం, మొదటి బ్యాచ్ వెబ్ ఆప్షన్‌లను జూన్ 22న నమోదు చేస్తారు. వారికి జూన్ 30న సీట్లు కేటాయిస్తారు.

రెండవ రౌండ్ కౌన్సెలింగ్ జూలై 7న ప్రారంభమవుతుంది. జూలై 9న వెబ్ ఆప్షన్ లు (Web Options) నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. జూలై 13న సీట్లు కేటాయిస్తారు. జూలై 21 నుండి ఇంటర్నల్ స్లైడింగ్ (Internal sliding) అందుబాటులో ఉంది. అన్ని సీట్లు జూలై 24వ తేదీలోపు అందుతాయి. స్పాట్ అడ్మిషన్లు జూలై 23న విడుదల చేయనున్నారు.

TG ECET and Polycet Counselling

మరో వైపు తెలంగాణలో డిప్లమా (Diploma) పూర్తి చేసి, బీటెక్ లో ప్రవేశం పొందాలంటే ఈసెట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. బీటెక్ లో నేరుగా రెండవ సంవత్సరం నుండి చదువుతారు. డిప్లొమా మూడేళ్లు చదివి ఈసెట్ లో ప్రవేశ పరీక్ష రాసి బీటెక్ చదివేందుకు తెలంగాణ ఈసెట్ 2024 కౌన్సెలింగ్ ప్రారంభం అయింది. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల అయింది.

మొత్తం కౌన్సెలింగ్ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి విడత కౌన్సెలింగ్ జూన్ 8న ప్రారంభమవుతుంది. అభ్యర్థులు 11వ తేదీ వరకు స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చు. మొదటి రౌండ్‌లో స్లాట్‌లను బుక్ చేసుకున్న విద్యార్థులకు జూన్ 10 నుండి జూన్ 12 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. జూన్ 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ ల రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుంది. మొదటి దశ సీట్లను జూన్ 18న కేటాయిస్తారు.

ECET 2024 చివరి దశ కౌన్సెలింగ్ జూలై 15 నుండి 25 వరకు జరుగుతుంది. చివరి సెట్ టిక్కెట్లు జూలై 21న మంజూరు చేయబడతాయి. విద్యార్థులు జూలై 21 మరియు 23 మధ్య రిపోర్టు చేయాలి.
స్పాట్ అడ్మిషన్ల కు సంబంధించిన వివరాలు జూలై 24న వెల్లడిస్తారు. జూలై 30 నాటికి స్పాట్ అడ్మిషన్లు పూర్తవుతాయి.

TG ECET and Polycet Counselling

Comments are closed.