TS TET Hall Tickets 2024: తెలంగాణ టెట్‌ అభ్యర్థులకు అలర్ట్‌, ఆరోజు నుంచే రానున్న హాల్ టికెట్స్ .

TS TET మే 20 నుండి 3 జూన్ 2024 వరకు షెడ్యూల్ చేయబడిన రాత పరీక్ష కోసం ప్రభుత్వం మే 15 న అడ్మిట్ కార్డ్‌లు విడుదల చేస్తుంది.

TS TET Hall Tickets 2024: ఈ మధ్యనే తెలంగాణ టెట్ (TS TET) పరీక్ష షెడ్యూల్ వచ్చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ (Schedule) ప్రకారం పరీక్షలు మే 20న ప్రారంభమవుతాయి. అయితే, ఈ పరీక్షలు జూన్ 2న ముగుస్తాయి. మే 27న పరీక్షలు ఉండవు. అదే రోజు ఎమ్మెల్సీ ఉపఎన్నికకు పోలింగ్ జరుగుతుంది. ఇక టెట్‌ హాల్‌టికెట్లు (TET Hall Ticket) 2024 సైతం ఈ వారంలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ప్రతి సంవత్సరం, తెలంగాణ ప్రభుత్వం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (DSE) పరీక్షకు 10-12 రోజుల ముందు TSTET హాల్ టిక్కెట్‌ను విడుదల చేస్తుంది, కానీ ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ హాల్ టిక్కెట్‌ను 5 రోజుల ముందు అంటే మే 15న విడుదల చేస్తారు. పరీక్ష అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌ (Admit Card) ని విడుదల చేసిన తర్వాత అధికారిక వెబ్‌సైట్ https://tstet.cgg.gov.in/ నుండి డౌన్‌లోడ్ చేసుకోగలరు.

TS TET 2024

ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు?
ఈసారి జరగనున్న TS TET పరీక్షల 2024 కోసం మొత్తం 2,83,441 మంది వ్యక్తులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1కి 99,210 మంచి దరఖాస్తులు రాగా, పేపర్ 2కి 1,84,231 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు తెలంగాణ టెట్ పరీక్షకు సిద్ధం అవుతున్న విద్యార్థులకు ఉచితంగా నమూనా పరీక్షలు రాసేందుకు విద్యాశాఖ అనుమతించింది. ఈ మేరకు వెబ్‌సైట్‌ (Website) లో ఆప్షన్‌ను చేర్చారు. మీరు https://schooledu.telangana.gov.in/ISMS/కి వెళ్లి ఈ పరీక్షలను వ్రాయవచ్చు.

తెలంగాణ టెట్ మాక్ టెస్టులు – ప్రాసెస్ ఇదే

తెలంగాణ టెట్ మాక్ టెస్ట్‌లు తీసుకోవడానికి, దరఖాస్తుదారులు https://tstet2024.aptonline.in/tstet/ని సందర్శించాలి.
వెబ్‌పేజీ పైన కనిపించే TS TET మాక్ టెస్ట్-2024 ఎంపికను క్లిక్ చేయండి.
ఇక్కడ సైన్ ఇన్ (Sign in) చేయడం అవసరం. కింది ఆప్షన్‌లపై క్లిక్ చేయడం ద్వారా మీకు ప్రశ్నాపత్రం ఓపెన్ అవుతుంది.
ఇలా మీరు ఎన్నిసార్లు అయినా పరీక్షలను రాసుకోవచ్చు.
ఈ పరీక్షలు రాయడం వల్ల ఆన్‌లైన్‌లో రాసేటప్పుడు మీరు తీసుకోవలసిన జాగ్రత్తలను అర్థం చేసుకోవచ్చు.

TS TET Hall Tickets 2024

 

Comments are closed.