After 10th : టెన్త్ తర్వాత ఏం చేయాలి..డిప్లొమా చేస్తే అవకాశాలు ఎలా ఉంటాయ్..?

టెన్త్ తరవాత ఇంటర్ మాత్రమే కాదు ఇంకా ఎన్నో కోర్స్‌లు అందుబాటులో ఉన్నాయి. మరి టెన్త్ తరవాత ఇంటర్ కాకుండా ఎలాంటి కోర్స్‌లున్నాయో ఒకసారి చూద్దాం.

Telugu Mirror : పదో తరగతి పూర్తి చేసాక ఇక నెక్స్ట్ ఏం చేయాలి అని చాలా మంది విద్యార్థులకు  ఉంటుంది. పదో తరగతి పూర్తి చేసాక ఇంటర్మీయట్‌ (Intermediate) చదవటమేగా అని అందరు అనుకుంటారు. టెన్త్ తరవాత ఇంటర్ మాత్రమే కాదు ఇంకా ఎన్నో కోర్స్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో వేటికవే ప్రత్యేకం, కాస్త ఆలోచించి, ఎటు వైపు వెళ్లాలో డిసైడ్ అవచ్చు.

మరి టెన్త్ (Tenth) తరవాత ఇంటర్ కాకుండా ఎలాంటి కోర్స్‌లున్నాయో ఒకసారి చూద్దాం. పదో తరగతి తర్వాత ఇంజినీరింగ్ (Engineering) చదువు అభ్యసించటానికి ఉన్న మార్గం పాలిటెక్నిక్. టెక్నికల్ విద్యలో నైపుణ్యం సంపాదించి, ఇంజినీరింగ్ లో చేరటానికి విద్యార్థులకు ఉన్న మంచి ఆప్షన్ ఇది.

10వ తరగతి తర్వాత డిప్లొమా మంచి ఎంపికేనా..?

చాల మంది విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసాక ఎటు వెళ్లాలో తెలియక ఇంటర్మీయట్‌ లో జాయిన్ అవుతారు ఆ తర్వాత డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేస్తారు. కానీ పదో తరగతి తర్వాతే ఇంజినీరింగ్ చదువు అభ్యసించటానికి ఉన్న మార్గం పాలిటెక్నిక్. టెక్నికల్ విద్యలో నైపుణ్యం సంపాదించి, ఇంజినీరింగ్ లో చేరటానికి విద్యార్థులకు ఉన్న మంచి ఆప్షన్ ఇది. పదో తరగతి తర్వాత డిప్లొమా (Diploma) చేయడం వల్ల మీకు టెక్నికల్ విద్యలో ముందే నైపుణ్యం వస్తుంది.

Also Read : Personal Loans : తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్లు..టాప్-5 బ్యాంకుల లిస్ట్ ఇదే..

డిప్లొమాలో ఎలా జాయిన్ కావాలి..?

డిప్లొమాలో అనేక కోర్స్ లు అందుబాటులో వున్నాయి అయితే వీటిలో ఇంజినీరింగ్‌లో డిప్లొమా మొదటి స్థానంలో ఉంటుంది . ఈ ఇంజినీరింగ్‌లో డిప్లొమా మూడు సంవత్సరాలు ఉంటుంది. పదో తరగతి పూర్తి చేసిన తర్వాత ఇంజనీరింగ్ డిప్లొమా చేయాలనుకునే విద్యార్థులను మొదటగా పాలీసెట్ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో 10వ తరగతి గణితం మరియు భౌతికశాస్త్రం నుండి ప్రశ్నలు ఉంటాయి.

ఈ మూడేళ్ల డిప్లొమా కోర్సును ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ (Polytechnic) కళాశాలలు అందిస్తున్నాయి. గణితం మరియు భౌతిక శాస్త్రంపై ముందస్తు అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ కోర్సు ఉపయోగపడుతుంది. త్వరగా స్థిరపడాలని కోరుకునే వారికి డిప్లొమా కోర్సు గొప్ప ఎంపిక అని నిపుణులు భావిస్తున్నారు.

what-to-do-after-10th-what-are-the-chances-of-doing-diploma

డిప్లొమాలో ఎన్ని కోర్సులు ఉన్నాయి..?

డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్‌తో పాటు వివిధ సప్లిమెంటరీ కోర్సులు ఉన్నాయి. వారి అభిరుచుల ఆధారంగా కోర్సును ఎంచుకోవచ్చు. పాలీసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి ర్యాంకింగ్‌లు కేటాయించబడతాయి. ఈ ర్యాంకింగ్‌ల ఆధారంగా, విద్యార్థులు ఇంజనీరింగ్ లేదా నాన్-ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశానికి అర్హులు, అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అందించే వివిధ వ్యవసాయ డిప్లొమా లో కూడా మీరు జాయిన్ కావొచ్చు.

హోటల్ మేనేజ్‌మెంట్ స్థానాలకు ప్రస్తుతం అధిక డిమాండ్ ఉంది. మీరు ఈ పరిశ్రమలో వృత్తిని కొనసాగించాలనుకుంటే, మీరు హోటల్ మేనేజ్‌మెంట్ లో డిప్లొమా చేయవచ్చు. అది కాకుండా, ఆటోమొబైల్, సివిల్, మెకానికల్, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కెమికల్ మరియు సిరామిక్ సహా అనేక బ్రాంచెస్ ఉన్నాయి. వీటిలో కొన్ని కోర్సులు మూడున్నరేళ్లు ఉంటాయి. అగ్రికల్చర్ ఏరియాలో డిప్లొమా కోర్సులకు కూడా ఎక్కువ డిమాండ్ ఉంది.

Also Read : 10th Exams : నేటి నుంచే టెన్త్ పరీక్షలు..ఈసారి 5 నిమిషాలు ఆలస్యం అయినా పర్లేదు..

ఉద్యోగ అవకాశాలు..

డిప్లొమా హోల్డర్లకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయడానికి ఇతర అవకాశాలు ఉన్నాయి. డిప్లొమా అర్హతలు ఉన్న చాలా మందిని రైల్వే పరిశ్రమలో జూనియర్ ఇంజనీర్లుగా నియమించుకుంటారు. కొన్ని ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలలో AE పోస్టులకు కూడా వీరిని అర్హులుగా పరిగణిస్తారు. ఈ పరీక్షకు అర్హత సాధించి ఎంపికైన వారికి వారి స్థాయిని బట్టి వేతనం చెల్లిస్తారు. ప్రారంభ వేతనం రూ. 34000 వరకు ఉంటుంది.

అలాగే డిప్లొమా పూర్తి చేసిన వారు ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి పొందవచ్చు. ఆటోమొబైల్, నిర్మాణ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు తమకు నచ్చిన ఉద్యోగంలో చేరవచ్చు. మీరు డిప్లొమా చేసిన తర్వాత ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకుంటే “ఈసెట్” ప్రవేశ పరీక్ష రాయడం ద్వారా మీరు BTech లో డైరెక్ట్ గ సెకండ్ ఇయర్ లో అడ్మిషన్ పొందవచ్చు.

Comments are closed.