10th Exams : నేటి నుంచే టెన్త్ పరీక్షలు..ఈసారి 5 నిమిషాలు ఆలస్యం అయినా పర్లేదు..

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నేటి (మార్చి 18) నుంచి ప్రారంభం అయ్యాయి.

Telugu Mirror : తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలు మార్చి 18వ తేదీ సోమవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని 3,473 కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 6,23,092 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో గతంలో 10వ తరగతి ఫెయిల్ అయిన 1,02,528 మంది విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాస్తున్నారు.

అధికారులు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షను షెడ్యూల్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పరీక్ష కేంద్రాలలో (exam centers) సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అవకతవకలు జరగకుండా క్యూఆర్‌ కోడ్‌తో (QR Code) కూడిన ప్రశ్నా పత్రాలను (Question Papers) అందజేశారు. ప్రస్తుతం విద్యార్థులంతా పరీక్ష కేంద్రాల్లోనే పరీక్షలు రాస్తున్నారు.

Also Read : Karthikeya 3 : బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబో రిపీట్..కార్తికేయ 3 పై బిగ్ అప్డేట్..

తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ఈరోజు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యాయి.ఈ పరీక్షలు ఏప్రిల్ 2 వరకు కొనసాగుతాయి. ఈసారి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని అధికారులు తెలియజేయడంతో విద్యార్థులకు కొంచెం ఉపశమనం లభించింది. దీంతో 9.35 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించిన నిర్వాహకులు రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

the-10th-class-public-examinations-in-telugu-states-have-started-from-today

దాదాపు 5.05 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు.  విద్యాశాఖ ఈ సంవత్సరం మాల్‌ప్రాక్టీస్‌ (Malpractice) జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇన్విజిలేటర్లు, విద్యాశాఖ అధికారులు, పోలీసులు, నాన్ టీచింగ్ స్టాఫ్, ఏఎన్‌ఎంలు, చీఫ్ ఇన్విజిలేటర్లు, ఇతరులను ఇకపై స్మార్ట్‌ఫోన్‌లతో పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని విద్యా కమిషన ఆదేశాలు జారీ చేసింది.

Also Read : ADA Jobs 2024: రాతపరీక్ష లేకుండానే ప్రభుత్వ కొలువు.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..!

10వ తరగతి పరీక్ష పేపర్లలో ప్రతి ప్రశ్నకు గతేడాది మాదిరిగానే ‘క్యూఆర్’ కోడ్‌ను ముద్రించారు. మాల్‌ప్రాక్టీస్‌ జరిగినా, పేపర్‌ లీక్‌ అయినా ఏ సెంటర్‌లో ఏ విద్యార్థి పేపర్‌ లీక్‌ అయిందో వెంటనే తేలిపోతుంది. పది పరీక్షలు పూర్తయిన తర్వాత మార్చి 31 నుంచి ఏప్రిల్ 8 మధ్య మూల్యాంకనం జరుగుతుంది. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హాల్ టిక్కెట్లు చూపించిన విద్యార్థులకు ఆర్టీసీ (RTC) ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పిస్తోంది.

Comments are closed.