Tea Effect on children : మీ పిల్లలు ‘టీ’ తాగుతున్నారా? అయితే ఈ సంఘటన గురించి మీకు తెలియాల్సిందే..

Telugu Mirror : మన దైనందిన జీవితంలో టీ(Tea) ఒక అంతర్భాగం అయినది. టీ త్రాగడం వల్ల శరీరానికి ప్రయోజనకరమా? లేదా హానికరమా? అనేది చాలా కాలం నుంచి చర్చనీయాంశంగా మారింది. అయితే టీ తాగడం అనేది ప్రాణాంతకంగా మారుతుందా? మధ్యప్రదేశ్(Madya Pradesh) లో జరిగిన ఒక సంఘటన ఈ సందేహాన్ని కలిగించింది.ఒక ఇంగ్లీష్ దినపత్రికలో ప్రచురించిన కథనం ప్రకారం వివరాలు, 18 నెలల చిన్నారి టీ తాగి మృతి చెందింది. నివేదిక ప్రకారం టీ తాగిన కొద్దిసేపటికి చిన్నారి శ్వాస తీసుకోవడం ఆగిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. మృతికి గల కారణాలు ఏమిటి అన్నది ఇప్పుడే చెప్పలేమని ఆసుపత్రి సూపరిండెంట్ ప్రకటించారు.

Long hair growth: పొడవాటి శిరోజాల కోసం ఈ సహజ పద్దతులు పాటించండి

మరొక నివేదిక ప్రకారం టీ తాగడం పిల్లలకు ఖచ్చితంగా ప్రమాదకరమా? అని ప్రశ్నలను తలెత్తేలా చేసింది. టీ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో స్పష్టంగా తెలియదు. ముఖ్యంగా టీ మరియు బ్లాక్ టీ(Black Tea) లలో కెఫెన్ ఉంటుందని పరిశోధనలు అంటున్నాయి. కెఫిన్ అనేది ఒక ఉద్దీపన. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఎటువంటి పరిస్థితులలో టీ ఇవ్వకూడదు. ఎందుకంటే పిల్లలు టీ తాగడం వలన నిద్రకు ప్రాబ్లం అవుతుంది.

Image Credit : Asianet News Telugu

మరియు భయం ద్వారా మూత్ర విసర్జన అధికమవ్వడం మరియు శరీరంలో సోడియం(Sodium) లేదా పొటాషియం పరిమాణం తగ్గటం వంటి సమస్యలు వచ్చేలా చేస్తుంది. అందువల్ల పిల్లలకి టీ వల్ల ఇటువంటి సమస్యలు వచ్చి తద్వారా ఆరోగ్యం పై చెడు ప్రభావాలను కూడా కలిగించే అవకాశం ఉంది.హెర్బల్ టీ(Herbal tea) ని మొక్కలు యొక్క ఆకులు ,వేర్లు మరియు విత్తనాలు నుండి తయారు చేస్తారని పరిశోధకులు బృందం అంటున్నారు. వీటిలో సాధారణంగా కెఫిన్ ఉండదు. హెర్బల్ టీ లో కొన్ని రకాలకు చెందినవి పిల్లలకు సురక్షితంగా ఉంటుంది. కొంతమంది పిల్లలతో పాటు మరికొంతమందికి టీ లోని మూలికలు అలర్జీలు కలిగిస్తాయని, గమనించాల్సిన విషయం.

Reliance Jio: త్వరలో జియో నుంచి అద్భుతమైన ఫీచర్స్ తో రెండూ 5G స్మార్ట్ ఫోన్స్ విడుదల

ఎలర్జీ(Allergy) ప్రతి చర్య యొక్క లక్షణాలు ఏమనగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగిస్తుంది. అలాగే పెదవులు, గొంతు, నాలుక వీటితో పాటు ముఖం కూడా వాపును కలిగి ఉండే అవకాశం ఉంది.పరిశోధకుల ప్రకారం వారి మాటలలో, మూలికలు లేదా టీలు చిన్న పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయంలో పరిశోధనలు జరగలేదని అంటున్నారు. అయినప్పటికీ పిల్లలకు టీ ఇచ్చే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించి వారి యొక్క సలహాలు పాటించడం మంచిది .ఆయుర్వేదం యొక్క కొన్ని నివేదికల ప్రకారం కషాయాలను తీసుకోవడం వలన దగ్గు (Cough) మరియు సాధారణ ఫ్లూ(Flew) వంటి వాటికీ ఉపయోగపడుతుందని చెబుతున్నారు .అయితే వీటిని నిర్ధారించడానికి తగిన అధ్యయనాలు లేవు.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in