CBSE Exam Results: CBSE 10, 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల, మళ్లీ అమ్మాయిలే టాప్​, డైరెక్ట్ లింక్ ఇదే.

సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 10వ తరగతి ఫలితాలు మే 13న విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ http://cbse.gov.in లో ఫలితాలను తెలుసుకోవచ్చు.

CBSE Exam Results: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) 10, 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. ఈ ఉదయం పన్నెండో తరగతి ఫలితాలను ప్రకటించిన బోర్డు. తాజాగా పదో తరగతి రిజల్ట్స్‌ను ప్రకటించింది.

విద్యార్థులు తాము సాధించిన స్కోరును cbse.gov.in మరియు https://cbseresults.nic.in/ వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. రోల్‌ నంబర్‌ (Roll Number) , పుట్టిన తేదీ (D.O.B) , స్కూల్‌ నంబర్‌ (School Number) , అడ్మిట్‌ కార్డు నంబర్‌ (Admit Card Number) లను ఎంటర్‌ చేయడం ద్వారా ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. అలాగే, డిజీలాకర్‌ (Digi Locker) , ఉమాంగ్‌ మొబైల్‌ యాప్‌ (umang mobile app) ల ద్వారా కూడా రిజల్ట్స్‌ పొందొచ్చు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10 మరియు 12 తరగతుల ఫలితాలను విడుదల చేసింది. CBSE పదో తరగతిలో 93.60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 47,983 మంది విద్యార్థులు కనీసం 95 శాతం గ్రేడ్‌లు పొందారు. తిరువనంతపురంలో అత్యధికంగా 99.75 శాతం ఉత్తీర్ణత సాధించింది. 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 మధ్య జరిగాయి. ఇదిలా ఉండగా, 12వ తరగతి పరీక్షల్లో 87.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

cbse-class-12th-exams-cbse-class-12th-exams-will-start-soon-important-details-for-you
Image Credit : DNA India

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఫలితాలలో బాలికలే పై చేయి సాధించారు. ఉత్తీర్ణులైన వారిలో 91.52 శాతం మంది అమ్మాయిలు, 85.12 శాతం మంది బాలురు ఉన్నారు. తిరువనంతపురం (Thiruvananthapuram) లో అత్యధికంగా 99.91 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 12వ తరగతి పరీక్షలను ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు.

ఏడాదిలో రెండుసార్లు టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలను నిర్వహించే అంశంపై పాఠశాలల ప్రిన్సిపాల్ (Principal) తో వచ్చే నెలలోనే సంప్రదింపులు జరపనున్నారు. అండర్‌ గ్రాడ్యుయేషన్‌ అడ్మిషన్ల (Under Graduation Admissions) షెడ్యూల్‌పై ఎలాంటి ప్రభావం లేకుండా రెండోసారి బోర్డు పరీక్షలు నిర్వహించేలా అకడమిక్‌ క్యాలెండర్‌ను సిద్ధం చేసేందుకు విధివిధానాలు రూపొందించే పనిలో సీబీఎస్‌ఈ అధికారులు నిమగ్నమైనట్లు సమాచారం.

Comments are closed.