New Conditions On Education Coaching Center: కోచింగ్ సెంటర్లపై కొత్త నియమ నిబంధనలు, 16 ఏళ్ల లోపు ఉన్న విద్యార్థులకు అనుమతి లేదు

భారత ప్రభుత్వం ప్రకటించిన కొత్త నిబంధనల వల్ల ఏ కోచింగ్ సెంటర్ కూడా 16 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వకూడదు అని ప్రకటించింది.

Telugu Mirror : దేశంలో చదువు ఒత్తిడి వల్ల జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భారత్ ప్రభుత్వం ఈనెల 18న దేశంలో ఉన్న అన్ని ఎడ్యుకేషన్ కోచింగ్ సెంటర్ల (Education Coaching Center) పై కొత్త కండిషన్లను జారీ చేసింది. భారత ప్రభుత్వం ప్రకటించిన కొత్త నిబంధనల వల్ల ఏ కోచింగ్ సెంటర్ కూడా 16 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వకూడదు అని ప్రకటించింది. నిబంధనలు తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విద్యార్థి ఆత్మహత్య (Students suicide) అరికట్టడంతో పాటు కళాశాల యాజమాన్యాలు చేసే దోపిడీని అరికట్టడానికి ఈ నిబంధనలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తుంది.

ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ నిబంధనలు పాటించకుండా 16 ఏళ్ల లోపు విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చినట్లయితే ఆ ఇన్స్టిట్యూట్ మీద జరిమానా విధించబడుతుంది, అంతే కాకుండా విద్యార్థులను మభ్యపెట్టే వివిధ రకాలమైన ప్రసారాలు సోషల్ మీడియాలో ప్రచురించటం లేదా విద్యార్థులను టాప్ ర్యాంకులు, మంచి మార్కులు తెచ్చుకోమని అధిక ఒత్తిడి చేయడం కూడా నేరం అని, అలా చేసిన వాళ్ల మీద కూడా కఠినమైన చర్యలతో పాటు లక్ష రూపాయలు వరకు జరిమానా విధించబోతుందని ప్రభుత్వం వెల్లడించింది.

New rules on coaching centers will not allow students below 16 years of age
image credit : Edu Guide

Also Read: JEE Mains 2024 : జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల, డౌన్లోడ్ చేసుకోండి ఇలా

కోచింగ్ సెంటర్ల కోసం కొత్త నియమాల జాబితా :

రాష్ట్రంలోని ప్రైవేట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల ఆగడాలను మరియు విద్యార్థుల ఆత్మహతలను అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త నియమనిబంధనలు (New Rules) ఇప్పుడు చూద్దాం.

• గ్రాడ్యుయేషన్ అర్హత లేని వాళ్ళని టీచింగ్ కోసం ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లు నియమించుకోకూడదు.
• ఇన్స్టిట్యూట్ లో చేర్పించడం కోసం ఎక్కువ మార్కులు తెప్పిస్తాం, మంచి ర్యాంకులు తెప్పిస్తాం అని తల్లిదండ్రులకు గాని, విద్యార్థులకు గాని ఎటువంటి హామీలు ఇవ్వకూడదు.
•16 ఏళ్లలోపు విద్యార్థులకు కోచింగ్ సెంటర్స్ (Coaching Center) కి అనుమతి ఉండదు.

• కోచింగ్ సెంటర్‌లో ట్యూటర్‌ల అర్హతపై తాజా సమాచారంతో వెబ్‌సైట్ ఉండాలి. వారి వెబ్‌సైట్‌లో కోర్సులు/పాఠ్యాంశాలు, హాస్టల్ సౌకర్యాలు (ఏదైనా ఉంటే) (Hostel Details) , ఫీజులకు సంబంధించిన పూర్తి వివరాలను మరియు అవసరమైన ఇతర సమాచారాన్ని ఇవ్వాలి.
• ఇన్స్టిట్యూట్ కోచింగ్ తరగతులు విద్యార్థుల పాఠశాల సమయంలో నిర్వహించకూడదు.

Comments are closed.