TS 10th Results 2024, useful news : పదవ పరీక్ష ఫలితాలు ఇంకో వారంలోనే, ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి

పదో తరగతి విద్యార్థులందరికీ పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్‌లను (PEN) ప్రవేశపెట్టాలని విద్యాశాఖ యోచిస్తోంది.

TS 10th Results 2024 : తెలంగాణలో 10వ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది.స్పాట్ వాల్యుయేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 19 స్థానాలను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

టెన్త్ స్పాట్ (SSC స్పాట్ వాల్యుయేషన్ 2024) ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. సిబ్బంది కొరత రాకుండా చర్యలు తీసుకున్నారు. స్పాట్ వాల్యుయేషన్ పూర్తి కావడంతో సాంకేతిక అంశాలను పరిశీలించడంతో పాటు మార్కులను నమోదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. పరీక్ష ఫలితాలు ఒకటికి రెండు సార్లు చెక్ చేసిన తర్వాతే ఫలితాలు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ 10వ తరగతి పరీక్షలు 

ఈ ఏడాది తెలంగాణ 10వ తరగతి పరీక్షలకు 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. ఇందులో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఈ పరీక్షలు మొత్తం 2,676 కేంద్రాల్లో జరుగుతాయి.

పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్‌

పదో తరగతి విద్యార్థులందరికీ పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్‌లను (PEN) ప్రవేశపెట్టాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఈ విద్యాసంవత్సరం నుంచి 10వ తరగతి మెమోలు, టీసీలపై ఈ సంఖ్యను తొలిసారిగా ముద్రించనున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థుల సర్టిఫికెట్లపై 11 అంకెల యూనిక్ ఐడీ (పెన్ నంబర్) ముద్రించే అధికారం ఇచ్చింది.

కొత్త విద్యా విధానంలో భాగంగా, పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (PEN) అనేది భారతదేశంలోని విద్యార్థులందరికీ కేటాయించిన ప్రత్యేక గుర్తింపు సంఖ్య. PEN అనేది ఒకటో తరగతి ప్రవేశ సమయంలో ప్రతి విద్యార్థికి కేటాయించే ప్రత్యేక సంఖ్య. వారు తమ కోర్సులను పూర్తి చేసే వరకు ఆ పెన్ నెంబర్ కొనసాగుతుంది.

Eudice Plus పోర్టల్ ద్వారా జనరేట్ అయిన ఈ నంబర్ ను మెమోలపై ముద్రిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, వారంలోనే ఫలితాలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటి వరకు 10వ తరగతి మెమోలపై కేవలం హాల్‌టికెట్‌ నంబర్‌ మాత్రమే ఉండేది. అయితే, ఈ ‘పెన్’ నంబర్ ఒరిజినల్ సర్టిఫికేట్లా లేక నకిలీ సర్టిఫికెట్ల అని సులభంగా గుర్తించవచ్చు .

పదో తరగతి ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?

  • తెలంగాణ 10వ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు http://bse.telangana.gov.inని సందర్శించండి.
  • హోమ్ పేజీలో ‘SSC Results 2024’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • మీ మార్కులను చూడడానికి మీ హాల్ టిక్కెట్ నంబర్‌ను నమోదు చేసి, సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి.
  • మీ ఫలితాలు కనిపిస్తాయి. మార్కుల మెమోను పొందడానికి, ప్రింట్ ఆప్షన్ ను క్లిక్ చేయండి.
TS 10th Results 2024

Comments are closed.