TS EAPCET Results 2024 : తెలంగాణలో ఈఏపీసెట్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి  

తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

TS EAPCET Results 2024 : ఎంసెట్ పరీక్షకు హాజరైన తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను వెల్లడించారు. తెలంగాణ EAPSET 2024 ప్రవేశ పరీక్షలు మే 7 నుండి 11 వరకు రాష్ట్రంలోని పరీక్షా కేంద్రాలలో జరిగిన విషయం తెలిసిందే.

అగ్రికల్చర్, ఫార్మా విభాగాల్లో 91633 మంది టీఎస్ ఈప్సెట్ పరీక్షకు హాజరయ్యారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 91.24 శాతం మంది పరీక్ష పూర్తి చేశారు. కాగా, ఇంజనీరింగ్ పరీక్షకు 2, 40, 618 మంది హాజరయ్యారు. ఈసారి ఈఏపీ సెట్ కోసం 3 లక్షల 32 వేల 251 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

అయితే, TS EAMCET 2024 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ మరియు రెస్పాన్స్ షీట్స్ ఇప్పటికే విడుదల అయ్యాయి. వీటిపై అభ్యంతరాల స్వీకరణ కూడా ముగిసింది. దీని ఆధారంగా, ఫైనల్ ఆన్సర్ కీని సిద్ధం చేసి, ఫలితాలు ప్రకటించారు. అయితే, ఈ సంవత్సరం TS EAMCET 2024 పరీక్షకు 3.54 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

 

TS EAPCET Results 2024

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి.

  • ముందుగా, అధికారిక వెబ్‌సైట్‌ https://eapcet.tsche.ac.in/ ను సందర్శించండి.
  • ఆ తర్వాత, TS EAPCET 2024 ఫలితాల ఆప్షన్ ను ఎంచుకోండి.
  • ఆపై, మీ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి.
  • TS EAPCET 2024 ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. భవిష్యత్తు సూచన కోసం PDFని డౌన్‌లోడ్ చేయండి.

90.61 శాతం మంది AP EAPSET 2024 బైపీసీ స్ట్రీమ్ పరీక్షకు హాజరయ్యారు.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో ఈప్‌సెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మే 16న జరిగిన బైపీసీ స్ట్రీమ్ అడ్మిషన్ పరీక్షకు 90.61 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు జేఎన్‌టీయూ కాకినాడ వీసీ ప్రసాదరాజు తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో కలిపి 44,017 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 39,886 మంది హాజరయ్యారని తెలిపారు. ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షలు మే 18 నుంచి మే 23 వరకు తొమ్మిది భాగాలుగా జరగనున్నాయి.

TS EAPCET Results 2024

Comments are closed.