TS- EAPCET 2024 Exam Time Table : తెలంగాణలో విడుదల అయిన TS- EAPCET (ఈఎపిసెట్) – 2024 షెడ్యూల్..దరఖాస్తు కు చివరి తేదీ ఎప్పుడంటే..

తెలంగాణ రాష్ట్రం ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ అండ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ EAPCET -2024 షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల EAMCET (ఎంసెట్) పరీక్ష పేరును తెలంగాణ ప్రభుత్వం EAPCET గా మార్చిన విషయం తెలిసిందే. ఈఏపీసెట్- 2024 కన్వీనర్, జేఎన్టియూ (JNTU) ప్రొఫెసర్, సివిల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ బి. దీన్ కుమార్ మంగళవారం నాడు షెడ్యూల్ రిలీజ్ చేశారు.

తెలంగాణలో TS- EAPCET (ఈఎపిసెట్) – 2024 షెడ్యూల్ విడుదల అయింది.ఇటీవల EAMCET (ఎంసెట్) పరీక్ష పేరును తెలంగాణ ప్రభుత్వం EAPCET గా మార్చిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ అండ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ EAPCET -2024 షెడ్యూల్ విడుదల చేసింది.

ఈఏపీసెట్- 2024 కన్వీనర్, జేఎన్టియూ (JNTU) ప్రొఫెసర్, సివిల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ బి. దీన్ కుమార్ మంగళవారం నాడు షెడ్యూల్ రిలీజ్ చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి – 21 వ తేదీన EAPCET -2024 నోటిఫికేషన్ విడుదల అవ్వనుంది. ఫిబ్రవరి – 26 వ తారీకు నుండి దరఖాస్తుల స్వీకరణ మొదలు కానుంది.

TS- EAPCET 2024 Exam Time Table : TS- EAPCET (EAPCET) - 2024 schedule released in Telangana.. When is the last date for application..
Image Credit : Sakshi Education

ఏప్రిల్ – 6 వ తేదీ వరకు ఎటువంటి ఆలస్య ఫీజు చెల్లించ కుండానే ఆన్ లైన్ లోనే దరఖాస్తులను స్వీకరిస్తారని తెలియజేసింది. తెలంగాణ – EAPCET పరీక్షలు మే – నెల 9 తేదీ నుండి 12 వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్ష ఆన్ లైన్ పద్ధతిలోనే కొనసాగుతుంది. ఈ పరీక్షలు (Exams) మొత్తం నాలుగు రోజులపాటు జరగనున్నాయి.

జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్  ఎడ్యుకేషన్ ( TSCH ) లకు సంబంధించిన సీనియర్ అధికారులు ఫిబ్రవరి – 6 మంగళవారం రోజున తెలంగాణ EAPCET – 2024 మొదటి CET కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.

Also Read : TSPSC Group-1 : తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం, గ్రూప్-1 పోస్టులు పంపు, త్వరలో నోటిఫికేషన్ విడుదల

ఈ సమావేశంలో టీఎస్(ఈఏపీసెట్) EAPCET షెడ్యూల్ ఖరారు చేశారు. అలాగే తెలంగాణ EAPCET -2024 సిలబస్ (Syllabus) పై కూడా స్పష్టత (Clarity) ను తెలియజేశారు.

ఇంటర్మీడియట్ మొదటి (First) మరియురెండవ (Second) సంవత్సరం సిలబస్  వంద శాతం టియస్- ఈఏపీసెట్ (TS – EAPCET) లో ఉంటుందని షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది.

Comments are closed.