TS Inter Summer Holidays : తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు (Intermediate Board) సెలవులు ప్రకటించింది. ఈ నెల 30వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయి. జూన్ 1న కాలేజీలు మళ్లీ ఓపెన్ అవుతాయి. ఈ సెలవులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మరియు ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కళాశాలలకు వర్తిస్తాయి. ఇంటర్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా కళాశాలలను నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు..
రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ఇంటర్-బోర్డు సూచనలకు అనుగుణంగా చేయాలి మరియు ఆ తేదీలు తెలియపరచినప్పుడు మాత్రమే ప్రవేశ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా, AP రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ మరియు ఎయిడెడ్ కాంపోజిట్ కార్పొరేట్ (Aided Composite Corporate) జూనియర్ కళాశాలలకు పరిపాలన వేసవి సెలవులను షెడ్యూల్ చేసింది. ఇంటర్ విద్యామండలి చేసిన ప్రకటన ప్రకారం ఈ నెల 31 నుంచి మే 31 వరకు రెండు నెలల పాటు సెలవులు ఇవ్వనున్నారు.
Also Read : LIC Policy : ఎల్‌ఐసీ నుంచి అద్భుతమైన పాలసీ.. రిటర్న్స్ తో పాటు జీవిత బీమా.
ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా కళాశాలలు నడిపితే..
ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయి. జూన్ 1న ఇంటర్ కళాశాలలు పున:ప్రారంభమవుతాయని పేర్కొంది. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే, తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇంటర్ బోర్డు ప్రకటన తర్వాత యూనివర్సిటీల్లో అడ్మిషన్లు తీసుకోవాలని బోర్డు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఇంటర్ విద్యార్థులకు దాదాపు రెండు నెలల వేసవి సెలవులను అందించింది. దీంతో విద్యార్థులు ఇళ్లకు తిరిగి… సెలవులను ఎంజాయ్ చేయాలని కోరుతున్నారు.
ఇంటర్ పరీక్షలు ముగిశాయి..
ఈ ఏడాది వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 28న ప్రారంభం అయ్యాయి. ఈ పరీక్షలన్నీ మార్చి 19న ముగిశాయి. ఈ విద్యా సంవత్సరంలో 9 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,527 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు నాలుగు లక్షల మందికి పైగా ఉన్నారు. మొత్తం 9,22,520 మంది విద్యార్థులు ఈసారి పరీక్ష ఫీజు చెల్లించారు.
Also Read : Indian Budget Cars : మార్కెట్‌ను ఊపేస్తున్న బడ్జెట్ కార్స్.. తక్కువ ధరకే సూపర్ ఫీచర్లు..!
ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే.?
ఇక ఈసారి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ (Schedule) విడుదలైంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈ ఏర్పాటులో ఇంటర్ పరీక్షల మూల్యాంకనం త్వరలో ముగిసి ఫలితాలు వెల్లడి కానున్నాయని తెలుస్తోంది. ఈసారి ఏప్రిల్ చివరి వారంలో ఇంటర్ ఫలితాలు…! గత సంవత్సరం, ఇంటర్ బోర్డు మే 9న ఫలితాలను (TS ఇంటర్ ఫలితాలు 2024) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం, పరీక్షలు పూర్తయిన 30 రోజుల తర్వాత ఫలితాలు అందుబాటులో ఉంటాయి.