LIC Policy : ఎల్‌ఐసీ నుంచి అద్భుతమైన పాలసీ.. రిటర్న్స్‌ తో పాటు జీవిత బీమా.

భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ ఇటీవలే డబుల్ బెనిఫిట్స్ తో ఓ కొత్త పాలసీ తీసుకొచ్చింది.

LIC Policy : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) గత నెల మొదటి వారంలో కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో రెండు ప్రయోజనాలను అందిస్తుంది. జీవిత బీమాతో పాటు పెట్టుబడి అవకాశాలను కూడా అందిస్తుంది. అదే LIC ఇండెక్స్ ప్లస్ పాలసీ, ఈ పాలసీ రెట్టింపు ప్రయోజనాలను అందిస్తుంది. 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ పాలసీకి అర్హులు. ఈ పాలసీ తీసుకోవడం ద్వారా 10 రెట్ల వరకు ఇన్సూరెన్స్ కవరేజీతో పాటు సంపద వృద్ధి చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు LIC ఇండెక్స్ ప్లస్ పాలసీని కొనుగోలు చేశారని అనుకుందాం. వారు వారి వార్షిక రుసుము కోసం 7 నుండి 10 రేట్ల బీమా కవరేజీని అందుకుంటారు. అదే 51-60 సంవత్సరాల వయస్సు గల వారు ఈ పాలసీని ఎంచుకుంటే, వారికి ఏడు రెట్ల వరకు బీమా రక్షణ లభిస్తుంది. ప్రీమియం చెల్లింపును బట్టి 10 – 15 ఏళ్ల కనీస వ్యవధి ఎంచుకోవాలి.

Also Read : Gold Rates Today 28-03-2024 : వామ్మో.. మళ్ళీ పెరుగుతున్న బంగారం ధరలు, ధర ఎంతో తెలుసా..?

25 ఏళ్ల వరకూ పాలసీని కొనసాగించాల్సి ఉంటుంది. వార్షిక కనీస ప్రీమియం రూ. 30 వేలుగా ఉంటుంది. ఆరు నెలలు, మూడు నెలలు, నెల నెలా ప్రీమియం చెల్లించే వీలును కల్పిస్తున్నారు. నెలకోసారి కనీస ప్రీమియం రూ.2,500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. టర్మ్ కొనసాగినంత కాలం లైఫ్ కవరేజీ (Life coverage) ఉంటుంది.

 LIC Policy

పెట్టుబడికి అవకాశం.

మీరు LIC ఇండెక్స్ ప్లస్ పాలసీని (LIC Index Plus Policy) కొనుగోలు చేస్తే, మీరు Flexi గ్రోత్ ఫండ్ లేదా Flexi స్మార్ట్ గ్రోత్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు, ఇది NSE 100 ఇండెక్స్ మరియు NSE 50 ఇండెక్స్ యొక్క ఎంచుకున్న షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఐదేళ్ల తర్వాత నిబంధనల ప్రకారం పెట్టుబడిని పాక్షికంగా వెనక్కి తీసుకోవచ్చు. పాలసీదారు మెచ్యూరిటీ వరకు జీవించి ఉంటే, యూనిట్ నిధుల విలువకు సమానమైన నగదు చెల్లింపులు చేయబడతాయి. బీమా కవరేజీ ఉంటేనే హామీ జోడింపులు చెల్లించబడతాయి.

Also Read : Indian Budget Cars : మార్కెట్‌ను ఊపేస్తున్న బడ్జెట్‌ కార్స్‌.. త​క్కువ ధరకే సూపర్‌ ఫీచర్లు..!

పాలసీ (Policy) గడువు ముగిసినప్పుడు మరియు కవరేజీ కొనసాగినప్పుడు గ్యారంటీడ్ జోడింపులు ప్రీమియం యొక్క నిష్పత్తిలో చెల్లించబడతాయి. ఈ డబ్బు యూనిట్ ఫండ్స్‌కు (Unit Funds) వెళ్తుంది. అయితే, మీరు ఎంచుకునే ఫండ్స్ పని తీరు ఆధారంగా మీ రిటర్న్స్ అనేవి ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలి. నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఈ కవరేజీని కొనుగోలు చేయడం ఉత్తమం.

LIC Policy

Comments are closed.