TS Schools Annual Exams 2024: తెలంగాణలో మారిన 1-9 తరగతుల వార్షిక పరీక్షల తేదీలు..వేసవి సెలవులు ఎప్పుడంటే..

TS Schools Annual Exams 2024: రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (SCERT) హైదరాబాద్ వారిచే గురువారం వెలువడిన ఉత్తర్వులలో తెలంగాణ రాష్ట్రం లోని 1వ తరగతి నుంచి 9వ తరగతి చదివే విద్యార్ధులకు నిర్వహించే వార్షిక పరీక్షల తేదీలను మారుస్తున్నట్లు పేర్కొంది. మొదట ప్రకటించిన విధంగా ఏప్రిల్ 8నుండి పరీక్షలు జరగవలసి ఉండగా ప్రస్తుతం ఏప్రిల్ 15 నుండి నిర్వహించనున్నారు.

TS Schools Annual Exams 2024: తెలంగాణలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు జరిగే వార్షిక పరీక్షలపై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఈ నెల 8వ తేదీ నుంచి జరగవలసిన ఎస్ఏ-2 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.

ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 8 నుంచి వార్షిక పరీక్షలు జరగవలసి ఉన్నాయి. అయితే వాయిదా వేసిన SA-2 పరీక్షలను ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్షలు ఏప్రిల్ 22 న ముగియనుండగా ఏప్రిల్ 23వ తేదీన ఫలితాలను వెల్లడిస్తామని విద్యాశాఖ అధికారులు అన్నారు. ఫలితాల ప్రకటన అనంతరం ఏప్రిల్ 24వ తారీఖు నుంచి రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల లకు వేసవి సెలవులను ఇవ్వనున్నారు. ఏప్రిల్ 24 వ తారీఖు నుండి జూన్ 12వ తేదీ వరకు బడులకు వేసవి సెలవులను ఇవ్వనున్నారు. ఈ ఏడాది దాదాపు 50 రోజులపాటు స్కూళ్ళకు వేసవి సెలవులు ఇస్తున్నారు.

పరీక్షా సమయాలు ఇవిగో 

TS Schools Annual Exams 2024: In Telangana
Image Credit : Telugu Mirror

15వ తేదీ నుంచి జరిగే ఎస్ఏ-2 పరీక్షలను 1నుంచి 7 తరగతులకు ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 11:30 గంటల వరకు నిర్వహిస్తారు. అలాగే 8వ తరగతి విద్యార్ధులకు ఉదయం 9 గంటల నుండి మధ్యహానం 11:45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఇక 9వ తరగతి విద్యార్ధులకు ఉదయం 9 గంటల నుండి మధ్యహానం 12 గంటల వరకు SA-2.పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ లో 1వ తరగతి నుండి 9వరకు జరిగే వార్షిక పరీక్షల తేదీలు.

ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 6వ తారీఖు నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం విధ్యాశాఖ అధికారులకు కీలక ఉత్తర్వులను జారీచేసింది. అదేవిధంగా ఈ వార్షిక పరీక్షలకు సంభంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పూర్తి చేసుకుని విద్యాసంవత్సరం చివరి రోజైన ఏప్రిల్ 23వ తేదీన విద్యార్ధులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ లను అందజేయాలని జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Also Read : TS EAPCET 2024 : తెలంగాణ ఎంసెట్ కు భారీగా దరఖాస్తులు, రేపే లాస్ట్ డేట్..అప్లై చేశారా మరి!

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి సెలవులను ఇస్తున్నట్లు ఏపీ విధ్యాశాఖ అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు బడులకు జూన్ 11వరకు సెలవులను ఇవ్వనున్నారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 12వ తేదీన పాఠశాలలు తిరిగి పున:ప్రారంభం అవుతాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయాలను ఏపీ స్కూళ్ళ విభాగం కార్యదర్శి సురేష్ కుమార్ చే జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 48 రోజులపాటు స్కూల్స్ కు సెలవులు రానున్నాయి. ఇదిలావుండగా పదవ తరగతి మరియు ఇంటర్ విద్యార్ధులకు ఇప్పటికే వేసవి సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే.

TS Schools Annual Exams 2024: Dates for Class 1-9 Annual Exams Changed in Telangana..When is Summer Vacation..

Comments are closed.