Brahmamudi serial feb 13th episode : ఒంటరిగా మిగిలిన కావ్య, ఇక తనకి పుట్టినిల్లే దిక్కా?

ప్రజాదారణ పొందిన బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.

Brahmamudi serial feb 13th episode : బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ లో రాజ్ కావ్యతో ఎవరిని అడిగి మీటింగ్ పెట్టారు అని అడుగుతాడు. ఎవరిని అడగాలి అని కావ్య అడుగుతుంది. నన్ను అడగాలి అని రాజ్ చెబుతాడు. నువ్వు నీ ఫియాన్సీ తో ఊరేగుతుంటే ఇక్కడ మీటింగ్ క్యాన్సిల్ చేయాలి అని కావ్య అంటుంది. అవును, నేను లేకపోతే మీటింగ్ పోస్ట్ పోన్ చేయాలి అని రాజ్ అంటాడు.

నేను నీకు ఫోన్ చేశాను కానీ లిఫ్ట్ చేయలేదు. కళ్యాణ్ ఫోన్ చేస్తే వస్తున్న అని చెప్పారు. రావడానికి ఎంతసేపు, ఇక్కడ మామయ్య టెన్షన్ పడుతున్నారు అందుకే మీటింగ్ కొనసాగించాల్సి వచ్చింది అని చెబుతుంది. మీటింగ్ సక్సెస్ చేసి మా ఇంట్లో వాళ్ళ అందరి ముందు నువ్వు గొప్పదానివని, నీకు నేను విడాకులు ఇస్తే ఇంట్లో వాళ్ళు అందరూ నీకు సపోర్ట్ చేయాలనీ చూస్తున్నావ్ కదా రాజ్ కావ్యతో కఠినంగా మాట్లాడుతాడు. శ్వేతని పెళ్లి చేసుకుంటున్న నువ్వు నా జీవితంలో నుండి వెళ్ళిపో అని రాజ్ అడుగుతాడు. కావ్య ఏడుస్తూ వెళ్ళిపోతుంది.

శ్వేత రాజ్ దగ్గరికి వచ్చి నిన్ను కొట్టాలన్నంత కోపం వస్తుంది అని అంటుంది. కావ్య మీద నాకు కోపం లేకపోయినా కోపాన్ని నటించాను. మనసు విరిచేస్తే అయిన నాకు దూరం అవుతుంది కదా అని రాజ్ అంటాడు. రాజ్ శ్వేతతో చెప్పిన మాటలు అన్ని కావ్య వింటుంది, మరింత కుమిలిపోతుంది.

Brahmamudi serial feb 13th episode

అపర్ణ ఇంటికి సుభాష్ ఒక అతన్ని 5 లక్షలు కావాలని ఆ డబ్బు తీసుకురమ్మని పంపిస్తాడు. అపర్ణ లాకర్ లో నుండి డబ్బు తీసుకుంటుంది. కానీ అందులో రూ.3 లక్షలే ఉండడంతో అనుమానం వస్తుంది. సంపత్ కి ఆ మూడు లక్షలు ఇచ్చి మిగతా రెండు లక్షలు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పమని చెబుతుంది అపర్ణ.

ఇక రుద్రాణి అడుగుతుంది. అదేంటి వదిన, అన్నయ్య 5 లక్షలు పంపమంటే నువ్వెంటీ 3 లక్షలే పంపించావ్ అని అడుగుతుంది. లాకర్ లో 5 లక్షలు ఉండాలి కానీ 3 లక్షలే ఉన్నాయి అని అంటుంది. ఇక ధాన్యలక్ష్మి కావ్య తీసింది అని ఎత్తిపొడుస్తుంది. కావ్య ఈ ఇంటికి పెద్ద కోడలు తీస్తే తప్పు లేదు అని అపర్ణ అంటుంది. తీస్తే తప్పు లేదు కానీ చెప్పకుండా తీస్తేనే తప్పు అని అంటుంది ధాన్యలక్ష్మి. కావ్య నే తీసింది అని ఎలా అంటున్నవ్ ధాన్యలక్ష్మి అని అపర్ణ అడుగుతుంది.

నీ కోడలికే కదా తాళాలు ఇచ్చింది అని ధాన్యలక్ష్మి అంటుంది. కానీ ఇందాక తాళాలు ఇచ్చింది నీ కోడలు కదా అని అపర్ణ రివర్స్ లో అడుగుతుంది. నా కోడలికి అంత అవసరం లేదు అని ధాన్యలక్ష్మి అడగగా నా కోడలికి కూడా అంత అవసరం లేదు అపర్ణ అంటుంది. కావ్య వచ్చాక నిజ నిజాలు అన్ని బయట పడతాయి అని అపర్ణ అంటుంది.

కట్ చేస్తే కావ్య ఇంటికి వస్తుండగా, కార్ ట్రబుల్ ఇస్తుంది. డ్రైవర్ ఏమైంది అని చెక్ చేస్తాడు. ఇంతలో రాజ్ వస్తాడు. ఏంటి ఏమైంది అని అడుగుతాడు. నా కార్ లో వెళ్దాం రా అని కావ్య ని అడుగుతాడు. నేను రాను అని కావ్య అంటుంది. రోడ్ మీద అల్లరి చేయకు రా అని రాజ్ అంటాడు. అయిన నేను వెళ్ళేది ఇంటికి కాదు మా పుట్టింటికి అని చెబుతుంది. దారి లేని వాళ్ళకి నా పుట్టినిల్లే దిక్కు. అందుకే నా పుట్టింటికి వెళ్తున్న అని కావ్య చెబుతుంది. సరే మీ ఇంటి దగ్గరే దింపుతా రా అని అడుగుతాడు రాజ్. కావ్య తన పుట్టింటికి వెళ్తుంది.

Comments are closed.