Guppedantha manasu serial feb 10th episode : వసుని ఏదైనా చేస్తే వదిలిపెట్టను అంటున్న రాజీవ్, అయోమయంలో వసుధార

ప్రజాదరణ పొందిన సీరియల్స్ లో ఒకటైన గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.

Guppedantha manasu serial feb 9th episode : తెలుగు టీవీ సీరియల్స్ లో గుప్పెడంత మనస్సు సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లో ఉన్న సీరియల్స్ లో ఒకటి. ప్రజాదరణ పొందిన సీరియల్స్ లో ఒకటైన గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.

దిగులుగా కూర్చుకున్న వసుధార..

రాజీవ్ గొడవ చేసి వెళ్లిన తర్వాత, దిగులుగా కూర్చుంది. ఇంతలో, మహీంద్ర వచ్చి వసుధార దగ్గర కూర్చుంటాడు. వసుధార, రిషి పెళ్లిని తలచుకొని మహీంద్ర బాధపడతాడు. రిషి అంటే వసుకి ప్రాణం, రిషి లేడు అని చెప్తుంటే వినే పరిస్థితిలో లేదు అని మహీంద్రా మనసులో అనుకుంటాడు.

కింద పడిన దండ చూసి ఇంటికి మళ్ళీ శైలేంద్ర వచ్చి చికాకు ఏమైనా చేశాడా అని మహీంద్ర వసుధారాణి అడిగాడు. లేడు బాబు, ఒక రాక్షసుడు వచ్చాడు అని చెప్పాడు వసు నాన్న, రాక్షసుడు ఎవరు అని అనుపమ అడుగగా, ఆ రాజీవ్ వచ్చాడు అని అతను చెప్తాడు. రాజీవ్ ఎందుకు వచ్చాడు అని అడగగా, వసు కోసం వచ్చాడు అని జరిగింది మొత్తం చెబుతాడు.

guppedantha-manasu-serial-feb-10th-episode-rajeev-says-he-will-not-leave-vasu-if-he-does-anything-shailendra-says-nadi-is-responsible-for-handing-over-vasu

Also Read : Guppedantha Manasu serial feb 9th episode : వసుధారని దక్కించుకునే ప్రయత్నంలో రాజీవ్, వసుని కాపాడాలంటున్న అనుపమ

రాజీవ్,  శైలేంద్ర మాటలు..

రాజీవ్, శైలేంద్ర ఇద్దరూ మాట్లాడుకుంటారు. వసుధార, ఇంటికి ఎందుకు వెళ్ళావ్ అని శైలేంద్ర ప్రశ్నిస్తాడు. వసుధారని పలకరించడానికి వెళ్ళా అని చెబుతాడు. కుర్చీ నీది, ఆ కుర్చీలో ఉన్న మరదలు పిల్ల నాది అని రాజీవ్ శైలేంద్ర తో అంటాడు.

నువ్వు ఏమి చేసిన నేను ఏమి అనను కానీ వసుధారాణి మాత్రం ఏదైన చేస్తే నిన్ను వదిలిపెట్టను అని రాజీవ్ శైలేంద్రకి వార్నింగ్ ఇస్తాడు. సరే నేను ఏమి చేయను అని, నిన్ను వసుధారాణి కలిపే బాధ్యత నాది అని శైలేంద్ర రాజీవ్ కి మాట ఇస్తాడు.

అయోమయంలో వసుధార..

ఎవరో ఇద్దరు ఫైనాన్స్ కంపెనీ నుండి కాలేజీకి వస్తారు. వాళ్ళ దగ్గర రిషి 40 కోట్లు తీసుకున్నట్లు రుజువు చూపిస్తారు. వసుధరకి ఏమి చేయాలో తెలియక మహీంద్రకి ఫోన్ చేసి రమ్మని చెబుతుంది.

ఇంతలో బోర్డు మీటింగ్ సిద్ధం చేస్తుంది వసుధార, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయ్ అని వాళ్ళు వాదిస్తారు. ఇంతలో మహింద్ర, అనుపమ వచ్చి ఆ ఫైల్స్ ని చూస్తారు. ఇది ఫేక్, నేను నమ్మను అని మహీంద్ర అంటాడు. అయితే మేము కోర్ట్ కి వెళ్తాము అని చెబుతారు. కోర్ట్ కి వెళ్లిన వాళ్ళే గెలుస్తారు మహీంద్రా అని అనుపమ అంటుంది. ఏమి అర్ధం కాకా అయోమయం లో ఉంటుంది వసుధార.

Comments are closed.