Guppedantha Manasu serial jan 30th Episode : వసుధారకు సాక్షాలు లేవు, శైలేంద్ర మళ్ళీ తప్పించుకున్నాడు

ప్రజాదరణ పొందిన సీరియల్స్ లో ఒకటైన గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.

Telugu Mirror : తెలుగు టీవీ సీరియల్స్ లో గుప్పెడంత మనస్సు సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లో ఉన్న సీరియల్స్ లో ఒకటి. ప్రజాదరణ పొందిన సీరియల్స్ లో ఒకటైన గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.

శైలేంద్రని అందరి ముందు వసుధారా నిలదీస్తుంది. రిషి సర్ ని ఎక్కడ దాచావో చెప్పమని గట్టిగా అడుగుతుంది. దీంతో ఫణింద్ర సాక్షాలు చూపించమని వసుధారని అడుగుతాడు. ఎండీ సీట్ కోసం జగతి మేడంని బెదిరించాడు, మేడంని భయపెట్టారు. చివరికి జగతి మేడంని పొట్టన పెట్టుకున్నాడు అని వసుధార ఫణింద్రకి చెబుతుంది. ఈ శైలేంద్రకి బయట చాలా మంది రౌడీలతో పరిచయం ఉందని, రౌడీలకు డబ్బులు ఇవ్వడం ధరణి మేడం కూడా చూసిందని వసుధారా చెబుతుంది.

Guppedantha Manasu serial jan 30th Episode : Vasudhara has no evidence, Shailendra escapes again

ఫణింద్ర ధరణిని అడుగుతాడు, శైలేంద్ర డబ్బులు ఇవ్వడం చూసావా అని? ధరణి అవును చూశాను అని చెబుతుంది. శైలేంద్ర ధరణి వద్దకు నేను ఇచ్చిన డబ్బులు ఏ ప్లంబర్ అయిన లేక వేరే పని వాళ్ళకి అయిన ఇచ్చి ఉండొచ్చు కదా, నన్ను ఎందుకు తప్పు పడుతున్నారు అని అంటాడు.

Also Read : Guppedantha Manasu Serial jan 29th Episode : ఫెస్ట్ కి రిషి సర్ రాలేదు.. శైలేంద్రని నిలదీసిన వసుధార.. అసలు ఏం జరిగింది?

నువ్వు అబద్దాలతో మాయ చేయగలవు శైలేంద్ర అని వసుధారా అంటుంది. ఫణింద్ర సాక్షాలు చూపించమని అడుగుతాడు. శైలేంద్ర వసుధారతో మాట్లాడిన వీడియో ఒకటి ఉంది. ఆ వీడియోలో రిషిని చంపేస్తాను, ఎండీ సీట్ నాకు ఇవ్వకపోతే అని వసుధారాణి బెదిరిస్తాడు.

ఆ వీడియో వసుధారా చూపించాలని అనుకుంటుంది కానీ ఆ వీడియో కనపడదు. ఇంతలో ముకుల్ వచ్చి ఈ కిడ్నాప్ కి శైలేంద్రకి ఎటువంటి సంబంధం లేదు అని చెబుతాడు. దీనితో శైలేంద్ర తప్పించుకున్నాడు.

రిషి ఎక్కడికి వెళ్లి ఉంటాడు..

Guppedantha Manasu serial jan 30th Episode : Vasudhara has no evidence, Shailendra escapes again

వసుధారా, మహీంద్ర, అనుపమ, ముకుల్ రిషిని ఎవరు కిడ్నాప్ చేశారో అని ఆలోచిస్తూ ఉన్నారు. మహీంద్ర, వసుధార ఈ పని శైలేంద్రదని తేల్చి చెబుతున్నారు. కానీ, కానీ ముకుల్ మాత్రం ఈ పనిలో శైలేంద్ర చేయి లేదని, అసలు సాక్షాలు కూడా లేవని చెప్పాడు.

వీడియో డిలీట్ చేసింది ఇతనా! 

Guppedantha Manasu serial jan 30th Episode : Vasudhara has no evidence, Shailendra escapes again

 

శైలేంద్ర మనిషి భద్ర ఆ వీడియో డిలీట్ చేసాడు. వసుధార, మహీంద్ర, అనుమప వీళ్ళు మహా ముదురులు అని, వీరిని అంచనా వేయడం చాలా కష్టం అని చెప్పాడు భద్ర. నా ప్లేస్ లో వేరే ఇంకెవరైనా ఉంటే ఈ పని చేయలేరని భద్ర శైలేంద్రతో చెబుతాడు. ఇప్పుడు అసలైన ఆట మొదలయిందని శైలేంద్ర అనుకుంటాడు.

Comments are closed.