Guppedantha manasu serial jan 31st episode : రిషి కోసం తీవ్ర చర్చలు, కాలేజీలో గొడవలు, వసుధార ఎండీ కావడం వల్లే..!

ప్రజాదరణ పొందిన సీరియల్స్ లో ఒకటైన గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.

Telugu Mirror : తెలుగు టీవీ సీరియల్స్ లో గుప్పెడంత మనస్సు సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లో ఉన్న సీరియల్స్ లో ఒకటి. ప్రజాదరణ పొందిన సీరియల్స్ లో ఒకటైన గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.

రిషి కోసం తీవ్రమైన చర్చలు..

వసుధార తన గదిలో రిషి సర్ గురించి తీవ్రంగా ఆలోచిస్తుంది. రిషి ఏమయ్యాడనే బాధ, కోపంతో పక్కన ఉన్న ఫ్లవర్ వెసిల్స్ ని కింద పడేస్తుంది. ఆ శబ్దంతో అనుపమ, మహింద్రలు వస్తారు. ఏంటి అమ్మ? ఏమైంది? అని వసుధారని అడుగుతారు. నాకు రిషి సర్ కావాలి మామయ్య? రిషి సర్ అసలు ఎక్కడ ఉన్నారు మామయ్య? అని ఏడుస్తుంది. రిషి ఏం అయ్యాడు. ఎక్కడ ఉంటాడో ఇంతవరకు ఆచూకీ తెలీదు అని మహీంద్రా అన్నాడు. రిషి పరిస్థితి ఎలా ఉందొ మీ కూడా తెలుసు కదా మామయ్య, 2 నిమిషాలు కూడా నిలలాడలేని పరిస్థితిలో ఉన్నారు? సరిగ్గా తిని, వైద్యం అందిస్తేనే కోలుకుంటారు. ఇప్పుడే ఎలా ఉన్నారో ఏంటో తెలియడం లేదు అని వసుధార బాధపడుతూ చెబుతుంది.

guppedantha-manasu-serial-jan-31st-episode-intense-discussions-for-rishi-fights-in-college-vasudhara-being-md

ముకుల్ ఎవరో మూడో వ్యక్తి ఉన్నాడని చెబుతాడు. మహీంద్రా ఎవరి మీద అయిన అనుమానం ఉందా? అని వసుధారని అడుగుతాడు. వాళ్ళే ఆ వీడియోని కూడా డిలీట్ చేసి ఉంటారు అని చెబుతాడు. వసుధార భద్ర పేరు చెబుతుంది.

మొదటి నుండి భద్ర ప్రవర్తన అంత మంచిగా అనిపించడం లేదు, ఏది అడిగిన సంబంధం లేకుండా సమాదానాలు చెబుతాడు అని, ఆ మూడో వ్యక్తి భద్ర కావొచ్చు అని వసుధారా చెబుతుంది. భద్రపై అనుమానం వచ్చిన విషయం, భద్ర చాటుగా వింటాడు.

Also Read : Guppedantha Manasu serial jan 30th Episode : వసుధారకు సాక్షాలు లేవు, శైలేంద్ర మళ్ళీ తప్పించుకున్నాడు

భద్ర శైలేంద్రకి ఫోన్ చేసి వీళ్ళకి నా మీద అనుమానం వచ్చింది అని చెబుతాడు. శైలేంద్ర చెప్పిన పని సరిగ్గా చేయవా అని నాలుగు మాటలు గట్టిగా తిడతాడు. వసుధారాని చంపేయమని చెబుతాడు శైలేంద్ర.

కాలేజీలో గొడవలు..

guppedantha-manasu-serial-jan-31st-episode-intense-discussions-for-rishi-fights-in-college-vasudhara-being-md

స్టూడెంట్స్ అందరూ రిషి సర్ కావాలని కాలేజీలో గొడవ చేస్తూ ఉంటారు. ఆగమని చెప్పిన స్టూడెంట్స్ వినడం లేదు. ఇక కాలేజీలో ఒక మేడం మహీంద్రకి కాల్ చేసి కాలేజీలో గొడవ జరుగుతుంది సర్ తొందరగా రండి అని చెబుతుంది. వసుదారా, మహీంద్రా కాలేజీకి వస్తారు. గొడవ ఆపి క్లాస్ కి వెళ్ళండి అని చెబుతుంది. కానీ స్టూడెంట్స్ మాత్రం రిషి సర్ కావాలి అని అంటారు.

ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, ఇంకా సిలబస్ అవ్వలేదు, లాబ్స్ కూడా సరిగ్గా పెట్టడం, ప్రాక్టికల్స్ ఎలా రాయాలి అని స్టూడెంట్స్ అడుగుతున్నారు. రిషి సర్ వస్తేనే మా సమస్యలు పోతాయి అని స్టూడెంట్స్ చెప్పుకొస్తారు. ఇంత మినిస్టర్ గారు వచ్చి రిషి ఫోన్ చేయి ఎక్కడ ఉన్నాడో కనుక్కో, నేను మాట్లాడతాను అని అంటాడు. రిష్ సర్ టచ్ లో లేరు అని వసుధర చెబుతుంది. ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంటే నువ్వు అంత లైట్ గా ఎలా తీసుకుంటున్నావ్ అమ్మ? రిషికి ఫోన్ చేయమని చెబుతాడు మినిస్టర్. నువ్వు ఎండీ గా ఉండడం వల్లే మొన్న ఫెస్ట్ ఫెయిల్ అయింది ఈరోజు ఈ గొడవ జరుగుతుంది అని మినిస్టర్ అంటాడు.

Comments are closed.