Hombale Films నుంచి భారీ అప్‌డేట్, కెజిఎఫ్ చాప్టర్-3 చిత్రం 2025 లో విడుదల కానుంది

హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) ప్రకటన ప్రకారం, రాకింగ్ స్టార్ యష్ నటించిన అత్యంత విజయవంతమైన కన్నడ చిత్రం KGF యొక్క మూడవ భాగం 2025లో విడుదల కానుంది.

Telugu Mirror : భారతదేశంలో సినీ పరిశ్రమలో పేరొందిన చిత్రాలలో కెజిఎఫ్ (KGF) కచ్చితంగా ఉంటుంది. కెజిఎఫ్-1 విడుదలయిన కొన్ని రోజులకే ఘన విజయాన్ని సాధించి కెజిఎఫ్-2 పై మరింత శ్రద్ధ చూపించి బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టారు. ఈ సినిమా యొక్క కథ ప్రజలను ఎంతగానో ఆకట్టుకోవడం వలన కెజిఎఫ్-3 పై ఇప్పుడు ప్రజలందరూ తమ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. కెజిఎఫ్- చాప్టర్ 1 మంచి హిట్ సాధించాక కెజిఎఫ్-2 పై అంచనాలు మరింత పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా RRR కి మించిన వసూళ్లను అందుకుంది. అయితే చాప్టర్-2 లో హీరో రాఖి మరణించినట్టుగా చూపించబడింది కానీ చాప్టర్-3 ఉంది అని తెలియగానే అభిమానుల్లో ఆతృత మరింత పెరిగింది. దర్శకుడు ప్రశాంత నీల్ కెజిఎఫ్ చాప్టర్-3 ఉంది అని వెల్లడించిన తర్వాత ప్రతి ఒక్కరు రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) ప్రకటన ప్రకారం, రాకింగ్ స్టార్ యష్ నటించిన అత్యంత విజయవంతమైన కన్నడ చిత్రం KGF యొక్క మూడవ భాగం 2025లో విడుదల కానుంది. డిసెంబర్ 2023 నాటికి, పాన్-ఇండియా ఫ్రాంచైజీ యొక్క మూడవ విడత ప్రొడక్షన్ గురించి పూర్తి వివరణ వస్తుంది.

Also Read : Vaastu Tips : ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలా చేయండి లక్ష్మీ కటాక్షం పొందండి

కేజీఎఫ్ ఐదో వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 21న  కేజీఎఫ్ 3  విడుదల షెడ్యూల్‌ను వెల్లడించనున్నారు. కేజీఎఫ్‌ 3కి సంబంధించి దర్శకుడు, నిర్మాత, నటుల మధ్య కథాంశం యొక్క తొలి రౌండ్‌ చర్చకు వచ్చింది. చిత్రీకరణ అక్టోబర్ 2024లో ప్రారంభమయి 2025లో విడుదల కానుంది. “KGF 3” విడుదలకు సంబంధించి ఈ ఏడాది డిసెంబర్‌లో అధికారిక ప్రకటన వెలువడుతుందని హోంబలే ఫిల్మ్స్ ప్రతినిధి PTIకి తెలిపారు.

Big update from Hombale Films, KGF Chapter-3 movie is going to release in 2025
Image Credit:Pinkvilla

2018 చలన చిత్రం KGF- చాప్టర్ 1 పీరియడ్ యాక్షన్ ఫ్రాంచైజీని ప్రారంభించింది మరియు 2022లో, KGF: చాప్టర్ 2 తదుపరి చర్యగా విడుదల చేయబడింది. హోంబలే ఫిల్మ్స్ వద్ద మరో మూడు ప్రాజెక్టులు అభివృద్ధిలో ఉన్నాయి.

ప్రస్తుతం హోంబలే ఫిల్మ్స్ దగ్గర   “పృథ్వీరాజ్ సుకుమారన్‌తో ‘టైసన్’, రిషబ్ శెట్టితో ‘కాంతారా 2’ మరియు ప్రభాస్‌తో ‘SALAAR ‘ మూవీస్ తో బిజీ గా ఉన్నారని” తెలిపారు. నెట్టింట వినిపిస్తున్న మాటల ప్రకారం, కెజిఎఫ్-3 సినిమా కోసం ఇప్పటికే 1000 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. ఈ చిత్రం కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందనే భావిస్తున్నారు.

Also Read : త‌క్కువ ధ‌ర‌లో టాప్ 5 ఉత్తమ బ్లూటూత్ స్పీకర్లు, అద్భుతమైన సౌండ్ అనుభూతిని ఆస్వాదించండి

కెజిఎఫ్-3 పై ఉండే అప్డేట్ ల కోసం ఎదురు చూడండి. నెట్టింట వచ్చే పుకార్లను నమ్మకండి. అధికారికంగా వచ్చిన సమాచారాన్ని మాత్రమే నమ్మండి.

Comments are closed.