తెర పైకి ఎక్కిన ‘గుంటూరు కారం’, మరి గురూజీ మ్యాజిక్ చేశాడా? మూవీ ఫుల్ రివ్యూ ఇప్పుడు మీ కోసం

అతడు, ఖలేజా సినిమాల్లో ఉన్న మ్యాజిక్ గుంటూరు కారంలో ఉందా? మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబో లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Mirror : సంక్రాంతి పండుగ సందర్బంగా జనవరి 12న విడుదలయిన సినిమా “గుంటూరు కారం”. పన్నెండేళ్ల తర్వాత మహేష్ బాబు మరియు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబో లో వచ్చిన ఈ మూవీ పై అభిమానులు భారీ అంచనాలు వేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రంలో మహేష్ బాబు హీరో గా, శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. గతంలో వీరిద్దరి కాంబో లో అతడు, ఖలేజా మూవీలు వచ్చాయి. గతంలో వచ్చిన ఆ సినిమాల్లో మ్యాజిక్ జరిగింది. మరి ఆ మ్యాజిక్ గుంటూరు కారం లో కూడా జరిగిందా? సినిమా రివ్యూస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సినిమా స్టోరీ : 

రమణ (మహేష్ బాబు) చిన్నతనం లోనే తన తల్లిదండ్రులు విడిపోతారు. అప్పటి నుండి రమణ తన మేనత్త ఇంట్లో పెరుగుతాడు. రమణ తల్లి (రమ్య కృష్ణ) మరో పెళ్లి చేసుకుని ఆ ప్రాంతానికి న్యాయ శాఖగా పనిచేస్తుంది. వసుంధర తండ్రి వైరా వెంకట స్వామి (ప్రకాష్ రాజ్). కూతురు వసుంధర పార్టీలోనే తన వ్యతిరేకంగా ఉన్నారని, వసుంధర వ్యక్తి గత విషయాలు బయట పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తారు. దీంతో వెంకట స్వామి రమణ వసుంధర కొడుకు కాదని సంతకాలు పెట్టించడానికి ప్రయత్నిస్తారు. రమణ సంతకాలు పెట్టడానికి ఒప్పుకోడు.

రమణ తల్లి దండ్రులు ఎందుకు విడిపోయారు? వసుంధర కొడుకుని వదిలి ఎందుకు వెళ్ళిపోయింది? చివరకు తల్లి కొడుకులు కలుస్తారా? వెంకట స్వామి రాయకీయ పరిస్థితి మరియి అతని భవిష్యత్తు ఏమైంది? అనే విషయాలు తెర పై చూడాల్సిందే.

Did 'Guntur Karam' hit the screen, and did Guruji do magic? Movie full review is now for you
Image Credit : Newsorbit.com

Also Read : Slash TDS Deductions : TDS మినహాయింపులను మీ జీతం నుండి తగ్గించడానికి క్రింది 8 టిప్స్ ను పాటించండి

సినిమా పూర్తి  రివ్యూ :  

గుంటూరు కారం ఫ్యామిలీ మూవీ అని చెప్పవచ్చు. సినిమా మొత్తంలో మహేష్ వన్ మ్యాన్ షో ని చూపించాడు. ఫ్యామిలీ డ్రామా ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా చూస్తున్న సమయంలో అత్తారింటికి దారేది మరియు అలా వైకుంఠపురంలో జరిగిన కొన్ని సీన్స్ గుర్తొస్తాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం మహేష్ ఫైట్స్ , శ్రీలీల లవ్, వెన్నెల కిశోర కామెడీతో నడిచింది. ఇక రెండవ హాఫ్ లో ప్రకాష్ రాజ్ రాజకీయం తో అభిమానులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించినట్టే ఉంటుంది. ఇంతక ముందు మహేష్ బాబు మరియు ప్రకాష్ రాజ్ మధ్య జరిగిన ఫైట్స్ , నువ్వా నేనా అనుకునేట్టుగా ఉండేవి కానీ ఈ సినిమాలో అలాంటి  సీన్స్ ఏమి లేవు.

గుంటూరు కారం సినిమా స్క్రిప్ట్ రాయడానికి త్రివిక్రమ్ దాదాపు రెండున్నర సంవత్సరాల సమయం తీసుకున్నాడు. తన మాటలతో మ్యాజిక్ చేసే త్రివిక్రమ్ ఈ సారి ఆ మ్యాజిక్ ని మిస్ చేశాడు. గుంటూరు కారం లో ఎలాంటి మ్యాజిక్ కనిపించలేదు. ఈ సినిమాలో మహేష్ బాబు కి మరదలుగా నటించిన మీనాక్షి చౌదరి పాత్రకి పెద్దగా స్కోప్ లేదు. సింపుల్ ఫ్యామిలీ ఎమోషన్ కథను తీసుకొచ్చి త్రివిక్రమ్ తన మాటలతో మ్యాజిక్ చూపించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునే త్రివిక్రమ్ ఈ సినిమాలో అది మిస్ చేసాడు.

మొత్తంగా ఈ సీనిమాలో మహేష్ బాబు డాన్స్ హై లైట్ అని చెప్పవచ్చు. మాస్ లుక్ తో కుర్చీని మడతపెట్టి సాంగ్ లో శ్రీలీలతో పాటు బాబు అదరగొట్టేసాడు. ఇక ఈ సినిమాకి 3.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

Comments are closed.