Game Changer Movie Updates : రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, నవంబర్ 23 న ప్రారంభం కానున్న గేమ్ ఛేంజర్ మూవీ నయా షెడ్యూల్

ఈ చిత్రానికి సంబందించిన నెక్స్ట్ షెడ్యూల్ మైసూర్ ప్రాంతంలో ఈ నెల 23 నుండి స్టార్ట్ కానుందని సమాచారం. ఈ షెడ్యూల్ లో డైరెక్టర్ శంకర్ చాలా ముఖ్యమైన రాజకీయ సన్నివేశాలను చిత్రీకరించనున్నాడని సమాచారం.

Telugu Mirror : టాలీవుడ్‌లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer Movie) . రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ పొలిటికల్ డ్రామా చిత్రీకరణ చాలా కాలంగా జరుగుతోంది, అయితే లెజెండరీ డైరెక్టర్ శంకర్ ఇతర సినిమాల షూటింగ్ కారణంగా గేమ్ ఛేంజర్ షూటింగ్ ను కొన్ని రోజులు వాయిదా వేశారు. ఈ స్టార్ డైరెక్టర్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మరియు ‘ఇండియన్ 2’  (Indian 2) రెండింటికి ఒకేసారి వర్క్ చేస్తున్నందున అవుట్‌పుట్ గురించి మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దానికి తోడుగా చిత్ర యూనిట్ మూవీ గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Good news for Ram Charan fans, new schedule of Game Changer movie to start on November 23
image credit : The Times Of India

ఈ చిత్రం నుంచి దీపావళికి ‘జరగండి’ అనే సాంగ్ రావాల్సి ఉండగా, చివరి నిమిషంలో వాయిదా వేశారు .ఈ సినిమా మ్యూజిక్ హక్కుల్ని మంచి రేటుకు ప్రముఖ ఆడియో కంపెనీ సరేగమ (Saregama Audio Company) సొంతం చేసుకుంది. అందుకు రూ. 33 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఒక్క పాట కూడా విడుదల కాకుండా ఇంత అమౌంట్ రావడం అంటే పెద్ద విషయమే. నవంబర్ 23న ఈ మూవీ కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ ప్రారంభమవుతుందని మూవీ టీం తెలిపారు. ప్రస్తుతం మైసూర్‌లో చిత్రీకరణ జరగనుందని, ఈ షెడ్యూల్ లో డైరెక్టర్ శంకర్ చాలా ముఖ్యమైన రాజకీయ సన్నివేశాలను చిత్రీకరించనున్నాడని సమాచారం. ఈ అప్డేట్ తో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Thalaivar 170 : సూపర్‌స్టార్ రజనీకాంత్ “తలైవర్ 170” షూటింగ్‌ అప్‌డేట్, ఈరోజే ప్రారంభమైన నయా షెడ్యూల్.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ (Kiara Advani) కథానాయికగా నటిస్తున్నారు. ‘వినయ విధేయ రామ’ తర్వాత వాళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రమిది. తెలుగమ్మాయి అంజ‌లి మరో కథానాయిక. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశంలో చరణ్ భార్యగా ఆమె కనిపిస్తారని సమాచారం. సముద్ర‌ఖ‌ని, ఎస్‌.జె సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి ఎస్‌.యు. వెంక‌టేశ‌న్‌, ఫ‌ర్హ‌ద్ సామ్‌జీ & వివేక్‌ రచయితలగా పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్స్ దిల్ రాజు మరియు శిరీష్ కలిసి నిర్మిస్తున్నారు అలాగే ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ యొక్క మొదటి సింగిల్ త్వరలో విడుదల కానుంది. తేదీని త్వరలో వెల్లడిస్తాం అని మూవీ యూనిట్ తెలిపింది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జనవరి లేదా ఫిబ్రవరిలో “గేమ్ ఛేంజర్” పూర్తి కాగానే మార్చిలో బుచ్చిబాబుతో మెగా పవర్ స్టార్ కొత్త సినిమా ప్రారంభించే అవకాశం ఉంది.

Comments are closed.