Fighter Movie : ఓటీటీ లోకి వచ్చేసిన ఫైటర్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్, దీపికా పదుకునే నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఫైటర్ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Fighter Movie రిపబ్లిక్ డే కానుకగా ఈ ఏడాది జనవరి 25న ఫైటర్ (Fighter) థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించింది. ఇది బాక్సాఫీస్ వద్ద చాలా మంచి వసూళ్లు రాబట్టింది. మొత్తం మీద హృతిక్ రోషన్ ఫైటర్ సినిమా రూ. 350 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ ఫైటర్ OTTలోకి ఎప్పుడు వస్తుందో అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ప్రముఖ OTT ప్లాట్ ఫారం అయినా నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలియజెసింది.

Also Read : Google Pixel 8a : లీక్ అయిన Pixel 8a స్పెసిఫికేషన్లు.

ఫైటర్ చిత్రంలో బాలీవుడ్ గ్రీక్ హీరో హృతిక్ రోషన్, అందాల తార దీపికా పదుకొణె కలిసి నటించారు. అనిల్ కపూర్, బిపాసా జీవిత భాగస్వామి కరణ్ సింగ్ గ్రోవర్ మరియు ఇతరులు సిద్ధార్థ్ ఆనంద్ యొక్క ఎయిర్ ఫోర్స్ నేపథ్య కాన్సెప్ట్ చిత్రంలో ప్రముఖ పాత్రలు పోషించారు. అయితే, కొన్ని గంటల క్రితం, హృతిక్ సినిమా OTT విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది.

ప్రఖ్యాత OTT ప్లాట్ ఫారం సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఫైటర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో, ఫైటర్ సినిమా మార్చి 21 బుధవారం అర్ధరాత్రి OTTలో అందుబాటులో ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ విషయాన్ని ధృవీకరించింది. తెలుగు వెర్షన్ కూడా OTTలో లభించే అవకాశం ఉంది.

Also Read : Allu Arjun: ఆంధ్రాలో కూడా తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్..త్వరలోనే మల్టీప్లెక్స్‌ ప్రారంభం.

బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా యువ దర్శకుడు సిద్దార్ధ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఏరియల్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ ఫైటర్. దీనిని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మించగా విశాల్ శేఖర్ సంగీతం అందించారు.

తెలుగు అడియెన్స్ కు నిరాశ..
ఫైటర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో మార్చి 21 అంటే బుధవారం అర్ధరాత్రి నుంచే ఫైటర్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఒక్క హిందీలోనే స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో తెలుగు అడియెన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. మరి తెలుగుతో పాటు రీజినల్ భాషల్లో ఎప్పుడు రిలీజ్ కానుందో చూడాలి.

Fighter Movie

 

Comments are closed.