Lal Salaam OTT : ఓటీటీ లోకి వచ్చేస్తున్న ‘లాల్ సలామ్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

రజినీకాంత్ గెస్ట్ రోల్ లో నటించిన లాల్ సలామ్ మూవీ ఓటీటీ లో సందడి చేయనుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

Lal Salaam OTT : డిజిటల్ స్ట్రీమింగ్ (Digital Streaming) కోసం అనేక ఆసక్తికరమైన సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు (Web series) అందుబాటులో ఉంటాయి. ప్రతి వారం, ప్రతి నెల, కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు OTTలో రిలీజ్ అవుతూనే ఉన్నాయి. కొత్త కొత్త సిరీస్, మూవీస్ చూసేందుకు కూడా ప్రేక్షకులు ప్లాట్‌ఫారమ్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

తాజాగా ఓటీటీలోకి (OTT) మరో సినిమా వచ్చేస్తుంది. రజినీకాంత్ గెస్ట్ రోల్ (Rajinikanth guest role) లో నటించిన లాల్ సలామ్ మూవీ (Laal Salaam movie) ఓటీటీ లో సందడి చేయనుంది. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ కీలక పాత్రల్లో నటించారు. లాల్ సలామ్ చిత్రంలో సుప్రసిద్ధ భారతీయ క్రికెటర్ కపిల్ దేవ్ (Kapil Dev) మరియు జీవితా రాజశేఖర్ కూడా కనిపిస్తారు. లాల్ సలామ్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించగా.. సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు. ఏఆర్ రెహ్మన్ సంగీతాన్ని అందించారు.

Lal Salaam OTT

పాన్-ఇండియా (Pan India) ప్రొడక్షన్‌గా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న థియేటర్లలో విడుదలయింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదలైంది. రూ.80 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 36 కోట్లు వసూలు చేసింది.. ఈ చిత్రం థియేటర్లలో (Theatres) కి వచ్చిన రెండు నెలల తర్వాత OTTలోకి రాబోతుంది.

సుప్రసిద్ధ OTT ప్రొవైడర్ అయిన సన్ నెక్స్ట్ (Sun next) ఈ చిత్రాన్ని తన ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఏప్రిల్ 12 నుండి OTTలో అందుబాటులో ఉంటుందని ప్రకటించగా..ఆ రోజు ఈ చిత్రం సన్ నెక్స్ట్ లో కనిపించలేదు. దీనికి ఫోటో ఇష్యూ కారణం అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ సమస్యలు అన్ని క్లియర్ అవ్వడంతో ఇది త్వరలో OTTలో అందుబాటులో ఉంటుంది. మే రెండవ లేదా మూడవ వారంలో సన్ నెక్స్ట్‌ (Sun Next) లో ప్రసారం అయ్యే అవకాశం ఉంది. అన్ని భాషల్లోనూ ఈ సినిమా రానున్నట్లు తెలుస్తుంది.

Lal Salaam OTT

Comments are closed.