దుమ్ము రేపిన మహేష్ బాబు దమ్ మసాలా సాంగ్, తెలుగు ఇండస్ట్రీలో నయా రికార్డ్

మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' మొదటి సాంగ్ ‘దమ్ మసాలా’ పాటని రిలీజ్ చేశారు.

Telugu Mirror : సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం'(Guntur Kaaram). శ్రీలీల కథానాయిక, హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతికి విడుదలవుతున్న భారీ అంచనాలున్న సినిమాల్లో ‘గుంటూరు కారం’ ఒక‌టి. మహేశ్‌ – త్రివిక్రమ్‌ శైలి మాస్‌ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్‌ సోషల్ మీడియాను ఊపేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో లీక్ అవ్వ‌డంతో మేక‌ర్స్ వేగం పెంచారు. తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ ఫస్ట్‌ సింగిల్ అనౌన్స్‌మెంట్ చేశారు.

Also Read : Vaastu Tips : దీపావళి రోజున ఇంట్లో ఈ మొక్కలను పెంచండి.. మీ ఇంటిని సిరిసంపదల నిలయంగా మార్చండి

ఎప్పుడెప్పుడా అంటూ మహేష్ ఫ్యాన్స్ క‌ళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న గుంటూరు కారం ఫస్ట్‌ సింగిల్‌ను న‌వంబ‌ర్ 07 న రిలీజ్ చేసారు మేక‌ర్స్. అయితే అంత‌కంటే ముందే ఫ్యాన్స్‌ను ఖుషి చేయ‌డం కోసం మ‌రో అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా ఈ ఫ‌స్ట్ సింగిల్ ‘ధ‌మ్ మసాలా’ (Dum Masala)కు సంబంధించి ప్రోమో విడుద‌ల చేశారు. మహేష్ బాబు యొక్క గుంటూరు కారం నుండి దమ్ మసాలా నిన్న విడుదలైంది మరియు సంగీత ఔత్సాహికుల నుండి, ముఖ్యంగా మహేష్ బాబు అభిమానుల నుండి అధిక స్పందనను అందుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు.

Mahesh Babu's Dum Masala Song, which created a stir, is a new record in the Telugu industry
Image Credit : Daily Andhra

లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే, ఈ పాట 24 గంటల్లోనే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధికంగా వీక్షించబడిన లిరికల్ సాంగ్‌గా నిలిచింది,  19.2 మిలియన్ వ్యూస్‌ను సాధించింది. అంతేకాకుండా ఈ ట్రాక్ యూట్యూబ్‌లో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుతో పాటు జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం థమన్ మరియు ఛాయాగ్రహణం మనోజ్ పరమహంస గా ఉన్నారు.ఈ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే సంవత్సరం  సంక్రాంతి పండుగ సందర్బంగా జనవరి  12 న విడుదల కానుంది.

Also Read : గ్లైన్ మాక్స్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్, ఆఫ్గాన్ పై ఆసీస్ గెలుపు

Comments are closed.