Salaar Movie Release Date: రికార్డ్ సృష్టించిన “సలార్”, కేవలం 24 గంటలలోపే 100 మిలియన్ మార్క్.

సలార్ సీజ్‍ఫైర్ మూవీ ట్రైలర్‌కు అన్ని భాషల్లో కలిపి ఇప్పటి వరకు 100 మిలియన్లకు పైగా వ్యూస్ దాటాయి. ఈ వంద మిలియన్ వ్యూస్ మార్కును 24 గంటలు గడవకముందే ట్రైలర్ దక్కించుకుంది.

Telugu Mirror : ప్రశాంత్ నీల్ (Prashant Neel) దర్శకత్వం వహించిన “సలార్” (Salaar Movie) చిత్రానికి సంబంధించిన ట్రైలర్ శుక్రవారం రాత్రి 7:19 గంటలకు రిలీజ్ అయింది. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం రెండేళ్లకు పైగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇది యాక్షన్‌తో కూడిన డ్రామా మూవీ. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ (prithviraj sukumaran) తెలుగులో కనిపించడం కూడా ఇదే తొలిసారి. ఈ చిత్రంలో జగపతి బాబు (jagapathi babu) , ఈశ్వరీ రావు (Eswari  Rao) , శ్రీయా రెడ్డి (Sriya Reddy) , శ్రుతి హాసన్ (shruti hassan) తదితరులు నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఇటీవల తన సినిమాను ప్రమోట్ చేస్తున్నప్పుడు తనకు సలార్ ఆలోచన ఎలా వచ్చిందనే దాని గురించి మాట్లాడాడు.

సలార్ సీజ్‍ఫైర్ మూవీ ట్రైలర్‌కు అన్ని భాషల్లో కలిపి ఇప్పటి వరకు 100 మిలియన్లకు పైగా వ్యూస్ దాటాయి. ఈ వంద మిలియన్ వ్యూస్ మార్కును 24 గంటలు గడవకముందే ట్రైలర్ దక్కించుకుంది. సలార్ ట్రైలర్ డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 7:19 గంటలకు రాగా ఒక రోజు కూడా పూర్తికాక ముందు అన్ని భాషల్లో కలిపి ఈ ట్రైలర్ 100 మిలియన్ మార్కును దాటింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించిన హొంబాలే ఫిల్మ్స్ (hombale films)  ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Hombale Films (@hombalefilms)

Also Read: ఢిల్లీలో 24 గంటల సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 375 వద్ద పేలవమైన కేటగిరీలోకి చేరుకుంది.

కేజీఎఫ్‌ తరహాలో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌, హీరో ఎలివేషన్‌, యాక్షన్ సీన్లు, విజువల్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తం మీద కేజీఎఫ్‌ తర్వాత వస్తున్న ఈ చిత్రం ప్రశాంత్‌నీల్‌ మార్క్‌కు తగ్గట్టుగా అదిరిపోయింది. 3.47 సెకన్ల నిడివి గల ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. కేజీఎఫ్‌లో హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసే దృశ్యాలు గ్లోబల్‌ బాక్సాఫీస్‌ ను ఏస్థాయిలో షేక్ చేశాయో తెలిసిందే. ప్రశాంత్‌ నీల్‌ ఈ సారి మాత్రం కేజీఎఫ్‌ ప్రాంఛైజీని తలదన్నేలా ట్రైలర్‌ను కట్‌ చేసి ప్రభాస్‌ లెవల్‌ మరో రేంజ్‌కు తీసుకెళ్లాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

15 ఏళ్ల క్రితమే ‘సలార్’ సినిమా చేయాలని అనుకున్నాను, అయితే నా మొదటి సినిమా ఉగ్రమ్ పూర్తి చేసిన తర్వాత దాదాపు 8 ఏళ్లు పట్టిన కేజీఎఫ్ సినిమాతో బిజీ అయిపోయాను. ఉదాహరణకు, మేము ఎనిమిదేళ్ల క్రితం KGF కోసం ప్రణాళికలు సిద్ధం చేయడం ప్రారంభించాము, కానీ దాని రెండవ భాగం ఇప్పటికి వచ్చింది. కాబట్టి, నా మైండ్ లో ఈ సినిమా గురించి ఇప్పటికే ఆలోచన ఉంది, మరియు కోవిడ్ సమయంలో, KGF 2 ఇంకా విడుదల కానప్పుడు, మేమంతా ఇంట్లో ఉన్నందున మా అందరికీ చాలా సమయం ఉంది కాబట్టి నేను దానిపై కొంత పని చేసాను అని ప్రశాంత్ నీల్ అన్నారు.

Comments are closed.