ఎట్టకేలలు వచ్చేస్తున్న దూత వెబ్ సిరీస్, స్ట్రీమింగ్ డేట్ ఇదే

దూత వెబ్ సిరీస్ పై క్లారిటీ వచ్చింది. డిసెంబర్ 1న అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సమాచారం.

Telugu Mirror : తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం గురించి తెలియవారు ఉండరు. అక్కినేని వారసుడు నాగచైతన్య (Naga Chaithanya) జోష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తనకుంటూ ఒక మంచి గుర్తింపుని తెచ్చి పెట్టుకున్నాడు. సినిమా రంగంలోకి అక్కినేని వారసుడిగా అడుగు పెట్టినప్పటికీ తన సినిమాలతో ప్రజలను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు సినిమా షూటింగ్స్ లో బిజీ అయిన చైతు డిజిటల్ ప్లాట్ ఫారంలోకి తన వెబ్ సిరీస్ దూత (Dootha)తో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ధూత వెబ్ సిరీస్ షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయింది. కానీ హీరోకి , డైరెక్టర్ కి కమిట్మెంట్స్ వేరే ఉండడంతో ఇది కాస్త వెనుకబడింది.

నాగ చైతన్యతో మనం, థాంక్యూ వంటి సినిమాలు డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ (Vikram K kumar) తీశారు. వీరిద్దరి కంబినేషన్లో వస్తున్న నాచురల్ హర్రర్ వెబ్ సిరీస్ దూత. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో విడుదల కానుంది. నాగ చైతన్యకి ఇది మొదటి వెబ్ సిరీస్ అలాగే అమెజాన్ ప్రైమ్ కి కూడా తెలుగు వెబ్ సిరీస్ రూపొందించడం ఇదే మొదటి సారి. ఈ వెబ్ సిరీస్ ని ఎప్పుడు విడుదల అవుతుందో అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటిస్తుంది.

Image Credit : Tollywood.Net

షూటింగ్ పూర్తయి చాలా కాలం అయింది కానీ ఇంకా విడుదల కాకపోవడంతో ప్రేక్షకులు అసలు ఈ వెబ్ సిరీస్ వస్తుందా రాదా అనే ఆలోచనల్లో ఉన్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 1న విడుదల కానున్నట్లు ప్రకటించారు.

దూత వెబ్ సిరీస్ లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 40 నిమిషాలు ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ వెబ్ సిరీస్ ని శరద్ మారర్ అమెజాన్ ప్రైమ్ తో కలిసి నిర్మించారు. దీని టీజర్ ని దీపావళి రోజున విడుదల చేయనున్నట్లు సమాచారం.

దూత వెబ్ సిరీస్ (Dootha Webseries) లో అక్కనేని చైతు తో పాటు ప్రియా భవాని శంకర్, పార్వతి తిరువోతు, తరుణ్ భాస్కర్, ప్రాచీ దేశాయి ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు భారీగానే ఉన్నాయ్ కానీ డిసెంబర్ 1 నుండి స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ప్రజలు ఎటువంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.

ప్రస్తుతం, నాగ చైతన్య చెందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో బిజీ అయ్యాడు. దీనికి సంబంధించిన ప్రీ – ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. సాయిపల్లవి కథానాయికగా నటించబోతుంది. ఈ రియలెస్టిక్ ఎమోషనల్ డ్రామా జీఏ2 సంస్థ నిర్మిస్తోంది.

 

Comments are closed.