వరుణ్-లావణ్య కొత్త జంట, మూడు ముళ్ళ బంధంతో ఒకటైన పెళ్లి జంట

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. వీరి పెళ్లి బుధవారం ఇటలీలో ఘనంగా జరిగింది.

Telugu Mirror : ప్రేమజంట పెళ్లితో ఒకటయ్యారు. వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripati) మిస్టర్ సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో వారు స్నేహితులుగా దగ్గరయ్యారు. సంవత్సరం తర్వాత వచ్చిన అంతరిక్షం (Anthariksham) మూవీతో మరింత దగ్గరయ్యారు. దాదాపు 6 ఏళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. వరుణ్ తేజ్ లావణ్యకి మొదట ప్రపోస్ చేసారని, వరుణ్ తేజ్ అలవాట్లు, అభిరుచులు అన్ని లావణ్యకి తెలుసని ఓ ఇంటర్వ్యూ లో వరుణ్ చెప్పాడు.

వారిద్దరి అలవాట్లు, మనసులు కలవడంతో ఇక పెళ్ళికి సిద్ధమయ్యారు.  వీళ్ళు పెళ్లి చేసుకునేందుకు ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో వాళ్ళ పెళ్లి ఇటలీ (Italy)లోని టాస్కాని వేడిలో నవంబర్ 1 బుధవారం రాత్రి 7.18 నిమిషాల వారి పెళ్లి ఘనంగా జరిగింది. మెగా ఫ్యామిలీ (Mega Family) మెంబెర్స్ అందరూ పెళ్లి పనుల్లో బిజీ అయి వరుణ్-లావణ్య పెళ్లిని ఘనంగా జరిపించారు. వీరి పెళ్లి తక్కువ మంది సమక్షంలోనే జరిగింది. అందరూ నూతన వధూవరులకి శుభాకాంక్షలు తెలియజేసారు.

ఎట్టకేలలు వచ్చేస్తున్న దూత వెబ్ సిరీస్, స్ట్రీమింగ్ డేట్ ఇదే

వీరిద్దరి పెళ్లి ఎన్నో స్పెషల్ థింగ్స్ ని కలిగి ఉంది. ఈ మెగా కుటుంబ కలయికతో తీసిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందరూ కలిసి ఉన్న ఈ రేర్ పిక్ చూడడానికి ఎంతో బాగుందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పవన్- కళ్యాణ్ భార్య అన్నా లెజెనోవా అచ్చం తెలుగింటి ఆడపడుచులా చీరలో సాంప్రదాయ పద్దతిలో కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

మెగా స్టార్ చిరంజీవి అతని భార్య సురేఖ, పవన్ కళ్యాణ్ అతని భార్య అన్నా లెజెనోవా, నాగబాబు అతని భార్య పద్మజా కొణిదెల, మెగా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ తమ భార్యలతో, అల్లు హీరోస్ అందరి సమక్షంలో వరుణ్-లావణ్య ల పెళ్లి ఘనంగా జరిగింది.  ఈ నెల 5న వరుణ్-లావణ్యల రిసెప్షన్ హైదరాబాద్ లో ఎన్. కన్వెన్షన్ లో గ్రాండ్ గా జరగనుంది.

గాయపడిన PV సింధు, డాక్టర్ల సలహా మేరకు కొన్ని వారాలు ఆటకి దూరం

పెళ్లి తర్వాత వరుణ్-లావణ్య ఫోటో షూట్ చేసారు. షూట్ చేస్తూ ఆనందంగా గడిపారు. వరుణ్ తేజ్ పెళ్లి వేడుకకు మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన క్రీమ్-గోల్డ్ షేర్వానీ ధరించాడు. రెడ్ కలర్ చీరలో ముద్దుగుమ్మ లావణ్య అందంగా ఉన్నారు. వరుడు తండ్రి నాగబాబు మరియు అతని సతీమణి పద్మజ ఇద్దరు ఫోటోకి మంచి పోజ్ ఇచ్చి చూడముచ్చటగా ఉన్నారు.

Comments are closed.