Avocado Health Benefits ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం పండ్లు. పండ్లు తినడం వలన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని అందరికీ తెలిసిన విషయమే. సీజన్ లో లభించే ప్రతి పండ్లను తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత రోజుల్లో అనేక రకాల విదేశీ పండ్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అటువంటి పండ్లలో అవకాడో ఒకటి.
అత్యంత ఆరోగ్యకరమైన పండ్లలో అవకాడో ఒకటి. ఈ పండును “బట్టర్ ఫ్రూట్’ అని కూడా పిలుస్తారు. ఈ పండులో ఎన్నో రకాల ఖనిజాలు మరియు విటమిన్లు ఉన్నాయి. దీనిలో విటమిన్ – బి పుష్కలంగా ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ఉండే అవకాడో ను తినడం వల్ల వివిధ రకాల వ్యాధులు కూడా దూరం అవుతాయి.
అవకాడో తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం:
అవకాడో బరువు మరియు రక్త పోటును తగ్గించడంతో పాటు, చర్మ ఆరోగ్యంతో పాటు గుండెను మెరుగుపరచడంలో దోహదపడుతుంది. దీనిని స్మూతీస్ మరియు సలాడ్ వంటి వివిధ రకాల వంటకాలలో ఉపయోగిస్తారు. దీనిలో పోషక విలువలు అధికంగా ఉండడంతో పాటు, రుచిగా కూడా ఉంటుంది.
జీర్ణ క్రియకు, బరువు నియంత్రణ కోసం
ఫైబర్ అధిక మొత్తంలో ఉండటం వల్ల జీర్ణక్రియ మరియు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీవక్రియను వేగవంతం చేసి, బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. దీనిలో కేలరీలు తక్కువగా ఉండటం వలన బరువు తగ్గాలి అనుకునే వారికి చాలా బాగా పనిచేస్తుంది. ఉదయం పూట అవకాడో తినడం వలన జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
గుండె ఆరోగ్యానికి అవకాడో
అవకాడో లో గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడే మోనో శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. న్యూట్రీషియన్స్ కూడా ఈ పండులో సమృద్ధిగా ఉంటాయి. అలాగే విటమిన్ – ఇ, కె, పొటాషియం, మినరల్స్ కూడా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
అవకాడో లో ఫైబర్ మరియు పోషకాలు ఎక్కువగా ఉండటం వలన ఇవి రక్తం లో ఉన్న చక్కెర మోతాదు ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
కంటి ఆరోగ్యానికి అవకాడో
అవకాడో లో లుటిన్ ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. కంటి శుక్లం ఇతర వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది వయసు సంబంధిత దృష్టి సమస్యల నుండి కూడా కాపాడుతుంది.
జుట్టుకి,చర్మానికి కలిగే మేలు
అవకాడో చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో చాలా బాగా పనిచేస్తుంది. దీనిలో ఫోలేట్ మరియు విటమిన్ – ఇ పుష్కలంగా ఉండడం వలన చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ పండును తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పండును తమ ఆహారంలో భాగంగా చేర్చుకొని ఆరోగ్య ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు.
గమనిక: ఈ కథనం వివిధ మాధ్యమాల ద్వారా మరియు ఇంటర్నెట్ నుండి సేకరించి వ్రాయబడినది. దీనిని అనుసరించే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించగలరు.
Avocado Health Benefits