Bone Deseases–జీవిత నాణ్యత పై ప్రభావం చూపే ఎముకల వ్యాధులు..

Telugu Mirror : దశాబ్దాల క్రితం వృద్ధాప్యంలో ఉన్న వారికి మాత్రమే ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చేవి అని తెలుసు. కానీ ఇప్పుడు ఈ సమస్య యువకుల్లో కూడా వేగంగా విస్తరిస్తుంది. 25 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారిలో చాలామంది ఎముకలు మరియు కీళ్ల సమస్యలతో బాధపడుతున్నారని మరియు ఎముకల యొక్క సాంద్రత తగ్గిపోతుందని తద్వారా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీనికి ముఖ్య కారణం జీవనశైలిలో మార్పులు రావడం. ముందు ముందు జీవన నాణ్యత క్షీణించే అవకాశం ఎక్కువగా ఉంది. గత పది,పదిహేను సంవత్సరాల నుండి యువతలో ఎముకల సమస్యలు అధికమయ్యాయని, కరోనా సమయంలో ప్రమాదం ఇంకా ఎక్కువ అయిందని పరిశోధకులు కనుగొన్నారు. దీనికి ఇంకొక ప్రధాన కారణం ఎక్కువసేపు కూర్చొని పని చేయడం అని కూడా పరిగణించబడింది.

chedodu Scheme–జగనన్న అందించే చెడోడు పథకం ..ఆన్‌లైన్ తనికీకై ఇలా చేయండి

స్థిరమైన జీవన విధానం శరీరం మొత్తం పై అనేక రకాల చెడు ప్రభావాలను చూపిస్తుంది. అందరూ సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో కరోనా సమయంలో ఇంటి నుండి పనిచేసే అవకాశం చాలా ఎక్కువ అయింది. వర్క్ ఫ్రం హోం టైంలో చాలామంది గంటల కొద్ది ఒకే చోట కూర్చోవడం వలన ఈ సమస్యలు అధికం అయ్యాయని వైద్యులు అంటున్నారు. పని సమయం పెరగడం వల్ల వ్యాయామం చేయడం తగ్గడం వలన ఇటువంటి సమస్యలకు దారితీస్తున్నాయి. దీనివలన అటువంటి వారిలో కండరాలు, ఎముకలు మరియు కీళ్ల సంబంధ సమస్యల ప్రమాదం గణనీయంగా అధికమైంది.

Image credit: Bone Health

ఎముకలు మరియు కండరాలు హెల్ధీ గా ఉండాలంటే శరీరం చలాకీగా ఉండాలి. వ్యాయామం లేనందున ఎముకల యొక్క సాంద్రత తగ్గుతుంది. ఎముకలు దృఢత్వాన్ని కోల్పోతున్నాయి. ఎప్పుడూ ఇంట్లోనే ఉండటం వల్ల శరీరానికి ఎండ తగిలే అవకాశం తక్కువ అవడం వల్ల విటమిన్- డి లోపం కూడా ఎక్కువ అయింది. దీని వల్ల శరీరంలో క్యాల్షియం కొరత ఏర్పడుతుంది. దీంతో ఎముకల ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది.

ద లాన్సెట్ జర్నల్ (The Lancet Journal) లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, గంటల వ్యవధి కూర్చోవడం కూడా, ధూమపానం చేస్తే కలిగే అనర్ధాల వలె ఆరోగ్యానికి ప్రమాదమని పరిశోధకులు కనుగొన్నారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బరువు పెరగడంతో పాటు వెన్ను, ఎముకలు మరియు కండరాలకు నష్టం వాటిల్లుతుంది. దీని వలన చాలామందిలో కాళ్లలో రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. దీనిని డీప్ వీనస్ త్రాంబోసిస్ (డివిటి)అని పిలుస్తారు. చాలా సేపు కూర్చోవడం వల్ల కూడా ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి అని పరిశోధనలో తేలింది.

Tollywood Actors Died In Small Age:చిన్న వయసులోనే మృత్యు ఒడిలో చేరిన తారలు వీరే.

కోవిడ్(Covid) తర్వాత యువతలో ఎముకల సమస్యలు బాగా ఎక్కువయ్యాయని వైద్యులు చెబుతున్నారు. అయితే వర్క్ ఫ్రం హోం పద్ధతి వల్ల, ప్రజల ఎముకలను బలహీన పరిచాయని ప్రత్యక్ష శాస్త్రీయ ఆధారాలు లేవు. అయినప్పటికీ ఎముకలకు పరోక్షంగా హాని కలిగించే కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎముకల వ్యాధులు జీవితం యొక్క నాణ్యత పై ప్రభావం పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఒకవేళ మీలో ఎవరైనా ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తుంటే దానివల్ల వచ్చే ప్రమాదాల గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Leave A Reply

Your email address will not be published.