Dates Benefits : పోషకాల గని ఖర్జూర పండు. రోజూ రాత్రి రెండు ఖర్జూర మిమ్మల్ని ఎప్పటికీ ధృఢంగా ఉంచుతుంది.

ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రెండు ఖర్జూరాలు తింటే చాలని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఖర్జూరాలు తిన్న తర్వాత ఒక గ్లాస్ పాలు తాగితే మరిన్ని ఆరోగ్య  ప్రయోజనాలను పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

ఖర్జూరాల (Dates) ను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఖర్జూరాల లో విటమిన్స్ మరియు ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్, క్యాల్షియం సోడియం, పొటాషియం ఇలా ఎన్నో రకాల పోషకాలు సమృద్ధిగా (Rich in nutrients) ఉన్నాయి. అందుకని ఇవి ఆరోగ్యాన్ని రక్షించడంలో చాలా బాగా తోడ్పడతాయి.

కాబట్టి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రెండు ఖర్జూరాలు తింటే చాలని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఖర్జూరాలు తిన్న తర్వాత ఒక గ్లాస్ పాలు (Milk) తాగితే మరిన్ని ఆరోగ్య  ప్రయోజనాలను పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

రాత్రి నిద్రించే ముందు ఖర్జూరాలు తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

ఖర్జూరా లలో పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి ఎముకలను దృఢంగా చేయడంలో సహాయ పడతాయి. అలాగే ఎముకల సాంద్రత (Bone density) ను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా బోలు ఎముకల సమస్య నుండి రక్షిస్తాయి. దంతాలను కూడా దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి.

Dates Benefits: Dates are a mine of nutrients. Two dates every night will keep you strong forever.
Image Credit : E- Fresco

ఖర్జూరాలను తినడం వలన కళ్ళకు చాలా మేలు జరుగుతుంది. వీటిలో విటమిన్- A అధికంగా ఉండటం వల్ల కంటి చూపును మెరుగు పరచడంలో చాలా బాగా తోడ్పడతాయి.

యాంటీ ఆక్సిడెంట్ మరియు విటమిన్- C లకు ఖర్జూరాలు మంచి మూలాలు. వీటి వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని (Immunity) బలోపేతం చేస్తాయి. తద్వారా జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల నుండి రక్షిస్తాయి.

Also Read : Benefits of Milk : పాలను ప్రతిరోజూ ఇలా తీసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Sex Ability : ఆరోగ్యానికే కాదు మగవారిలో లైంగిక శక్తిని పెంచే ఆకు కూర. తిన్నారంటే వదిలి పెట్టరు

ఖర్జూరాలలో ఫైబర్ మరియు ప్రోటీన్ అధికంగా ఉండడం వల్ల జీర్ణవ్యవస్థ (digestive system) పనితీరును మెరుగుపరుస్తాయి. తద్వారా కడుపు మంట, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గిపోతాయి. జీర్ణ క్రియ మెరుగ్గా ఉండటం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

ఖర్జూరాలలో విటమిన్స్, పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల గుండె (Heart) ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి శరీరంలో ఉన్నకొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండె సమస్యలు రాకుండా రక్షించడంలో సహాయపడతాయి.

Dates Benefits: Dates are a mine of nutrients. Two dates every night will keep you strong forever.
Image Credit : FashionLady

ప్రతిరోజు నిద్రించే ముందు రెండు ఖర్జూరాలు తినడం వలన చర్మాని (Skin) కి మరియు జుట్టు (Hair) కి కూడా చాలా మేలు కలుగు తుంది‌ వీటిలో విటమిన్ -C, విటమిన్ -A మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మాన్ని మరియు జుట్టును కూడా రక్షిస్తాయి. చుండ్రు సమస్యలు, జుట్టు రాలే సమస్య, పొడి బారిన జుట్టు, ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు ఇలా వివిధ రకాల సమస్యలను తగ్గించడంతో పాటు జుట్టును బలంగా చేసి, చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి.

Also Read : Foods That Reduce Sperm Count : పురుషులలో వీర్యశక్తిని తగ్గించే ఆహార పదార్ధాలు, వీటికి దూరంగా ఉండండి సంతానోత్పత్తిని పెంచుకోండి

కాబట్టి ఖర్జూరాలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి లభిస్తాయి. ప్రతి ఒక్కరూ రాత్రి (Night) నిద్రకు ఉపక్రమించే ముందు రెండు ఖర్జూరాలను తినడం అలవాటు చేసుకోవాలి. తద్వారా అనారోగ్య సమస్యలు, జట్టు, చర్మ సమస్యలు రాకుండా మనల్ని కాపాడతాయి.

Comments are closed.