Sex Ability : ఆరోగ్యానికే కాదు మగవారిలో లైంగిక శక్తిని పెంచే ఆకు కూర. తిన్నారంటే వదిలి పెట్టరు

పొన్నగంటి కూర, పురుషులు ఈ ఆకుకూర ఒకటి తింటే చాలు. ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పొన్నగంటి ఆకుకూరను తినడం వల్ల ఎటువంటి సమస్యలకు ఉపయోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం.

ఆకుకూరలు తినడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం అందరికి తెలిసిందే. కనీసం వారంలో ఒకసారైనా ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

చలికాలంలో ఆకుకూరలు తింటే చర్మానికి మరియు ఆరోగ్యానికి కూడా మంచిది. కానీ ఈ ఆకుకూర తింటే మాత్రం మగవారికి చాలా బాగా సహాయపడుతుంది. అదే పొన్నగంటి కూర. దీనిలో శరీరానికి అవసరమైన పోషకాలు (Nutrients) ఉన్నాయి. పురుషులు ఈ ఆకుకూర ఒకటి తింటే చాలు. ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

పొన్నగంటి ఆకుకూరను తినడం వల్ల ఎటువంటి సమస్యలకు ఉపయోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం.

Sex Ability: Not only for health, this vegetable increases sexual power in men. If you eat it, you will not leave it
Image Credit : Web Duniya Telugu News

పొన్నగంటి కూరలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి 6, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్, రైబోఫ్లోవిన్ పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ ఆకు కూరను తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలోపేతం అవుతుంది. పురుషులలో శక్తి, సామర్థ్యాలను కూడా పెంచేలా చేస్తుంది.

పొన్నగంటి కూరను పురుషులు తినడం వల్ల వారికి కావలసిన శక్తి అందుతుంది. ముఖ్యంగా ఈ ఆకుకూరలు లైంగికశక్తి  (sexual potency) సామర్ధ్యాలను పెంచే పోషకాలు అధికంగా ఉన్నాయి. అంతే కాకుండా ఈ ఆకుకూర ను తింటే బరువును కూడా అదుపులో ఉంచుతుంది. అలాగే క్యాన్సర్ ను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.

ఒక టేబుల్ స్పూన్ పొన్నగంటి కూర రసాన్ని వెల్లుల్లి తో కలిపి తీసుకుంటే దగ్గు మరియు ఆస్తమా వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

Also Read : Marital sex life : మీ దాంపత్య లైంగిక జీవితానికి బూస్టింగ్ ఇచ్చే పండ్లు ..

పొన్నగంటి కూర వెన్నునొప్పి (back pain), నరాలలో నొప్పి ఉన్నవారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.

బరువు తగ్గాలి (weight Lose) అనుకునే వారు పొన్నగంటి ఆకును ఉడికించి దీనిలో ఉప్పు మరియు మిరియాల పొడి వేసి కలిపి తిన్నట్లయితే బరువు తగ్గుతారు.

ఈ ఆకును శుభ్రంగా కడిగి, తుడిచి కళ్ళ మీద పెట్టుకుంటే కళ్ళకు చక్కటి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా కండ్ల కలక మరియు కంటి కురుపు లకి కూడా ఈ ఆకు చాలా బాగా పనిచేస్తుంది.

Also Read : Benefits Of Cardamoms : ప్రతి రోజూ రెండు యాలుకలు తీసుకోండి “లైంగిక సామర్ధ్యం” తోపాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను పొందండి

కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ ఆకు కూరను ప్రతి ఒక్కరు తినడం అలవాటు చేసుకోవాలి. మరి ముఖ్యంగా పురుషులు దీనిని అధికంగా తీసుకున్నట్లయితే వారికి లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.

గమనిక : ఈ కథనం వివిధ మాధ్యమాల ద్వారా సేకరించి వ్రాయబడినది. పాఠకులకు జ్ఞానం మరియు అవగాహన పెంపొందించడం కోసం తయారు చేయబడింది. దీనిని పాటించే ముందు వైద్యుడిని సంప్రదించగలరు.

Comments are closed.