Indira Gandhi : భారత దేశ ఉక్కు మహిళ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి నేడు. ఆమె స్మరణలో..

నేడు అక్టోబర్ 31 దివంగత భారత దేశ ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి. 1984లో అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో ఖలిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా, ఆపరేషన్ బ్లూ స్టార్‌లో భాగంగా గోల్డెన్ టెంపుల్ వద్ద ఐదు నెలల సైనిక చర్య తర్వాత, ఇందిరా గాంధీ తన ఇద్దరు అంగరక్షకుల చేతిలో 1984 అక్టోబర్ 31 న హత్య గావించ బడ్డారు.

నేడు అక్టోబర్ 31 దివంగత భారత దేశ ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి. 1984లో అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో ఖలిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా, ఆపరేషన్ బ్లూ స్టార్‌లో భాగంగా గోల్డెన్ టెంపుల్ వద్ద ఐదు నెలల సైనిక చర్య తర్వాత, ఇందిరా గాంధీ తన ఇద్దరు అంగరక్షకుల చేతిలో 1984 అక్టోబర్ 31 న హత్య గావించ బడ్డారు.

భారత దేశాన్ని ఇప్పటివరకు పరిపాలించిన ప్రధానులలో ఏకైక మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ. ఆమె జనవరి 1966 నుండి మార్చి 1977 వరకు మరియు మళ్లీ జనవరి 1980 నుండి అక్టోబర్ 1984 హత్యగావింపబడే వరకు భారతదేశ ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఇందిరను –“భారతదేశపు ఉక్కు మహిళ” అని పిలుస్తారు-బ్యాంకులను జాతీయం చేసింది మరియు రాయల్ ప్రైవీ పర్సస్‌లను రద్దు చేసింది. 1971 బంగ్లాదేశ్ యుద్ధం తరువాత, బిజెపి నాయకుడు మరియు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆమెను దుర్గా దేవిగా పిలిచారు అని అంటుంటారు. 1999లో BBC నిర్వహించిన పోల్ ఆమెను “ఉమెన్ ఆఫ్ ది మిలీనియం” గా పేర్కొంది.

ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా భారత దేశ ఐరన్ లేడీ కి సంభంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం : 

ఇందిర నవంబర్ 19, 1917న అలహాబాద్ లో జన్మించారు. ఆమె భారతదేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూకి ఏకైక సంతానం. ఆమె కుటుంబం మొత్తం స్వాతంత్ర్యం కోసం పోరాడింది. ఆమె తాత, మోతీలాల్ నెహ్రూ, ప్రముఖ భారత జాతీయ కాంగ్రెస్ న్యాయవాది, కార్యకర్త మరియు రాజకీయవేత్త. అతను 1919-1920 మరియు 1928-1929లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆమె తల్లి కమలా నెహ్రూ INC సభ్యురాలు మరియు స్వాతంత్ర పోరాట యోధురాలు.

Indira Gandhi: Today is the death anniversary of late Indira Gandhi, former Prime Minister of India. In her memory..
Image Credit : India To Day

ఢిల్లీలోని మోడరన్ స్కూల్‌తో పాటు, అలహాబాద్‌లోని సెయింట్ సిసిలియాస్ మరియు సెయింట్ మేరీస్ కాన్వెంట్‌లో అలాగే ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ జెనీవా, బెక్స్‌లోని ఎకోల్ నోవెల్లే మరియు పూనా అండ్ బాంబేస్ ప్యూపిల్స్ ఓన్ స్కూల్‌లో చదివారు.

ఇందిర విశ్వ భారతి, శాంతినికేతన్‌లో చదువుకున్నారు, అక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆమెకు ప్రియదర్శిని అని పేరు పెట్టారు.
ఆమె ఆనంద్ భవన్‌లో ఫిరోజ్ గాంధీని 1942లో వివాహం చేసుకుంది. ఆమెకు రాజీవ్ మరియు సంజయ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఆమె 1960లో భారత జాతీయ కాంగ్రెస్ (INC) అధ్యక్షురాలుగా నియమితులయ్యారు.

జనవరి 1966లో, ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్)లో ఆకస్మికంగా మరణించినప్పుడు ఆమె  మొరార్జీ దేశాయ్‌పై కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకత్వాన్ని గెలుచుకుంది. ఆమె దేశాయ్‌తో ఆర్థిక మరియు ఉప ప్రధాన మంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిపాలనను కొనసాగించారు.

Also Read : NOBEL PEACE PRIZE 2023 : నిర్భందాల నడుమ జైలు నుండే నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న ఇరాన్ మహిళ నర్గేశ్ మొహమ్మదీ

Mukesh Ambani Receives Death Threats : ముఖేష్ అంబానీ కి మూడవ హెచ్చరిక, రూ.400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామంటూ బెదిరింపు ఇమెయిల్

ఆమె జనవరి 1966 నుండి మార్చి 1977 వరకు ప్రధాన మంత్రిగా ఉన్నారు. జనవరి 1980లో, ఆమె మూడు సంవత్సరాల విరామం తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చింది మరియు ఆమె 1984 లో మరణించే వరకు ప్రధాన మంత్రిగా పనిచేసింది.

తూర్పు పాకిస్తాన్‌లో బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ విముక్తి ఉద్యమానికి ఆమె మద్దతు పలికారు. ఆమె పాకిస్థాన్‌తో యుద్ధం చేసి బంగ్లాదేశ్‌ను స్థాపించింది. బంగ్లాదేశ్ విముక్తి (emancipation) యుద్ధం తరువాత ఆమెను భారతరత్న పురస్కారం వరించింది.

ఆపరేషన్ బ్లూ స్టార్ గోల్డెన్ టెంపుల్ సైనికచర్య (military action) కోసం ఆమె 1984లో ఆదేశించింది. సైనిక చర్య అనంతరం కొద్ది నెలల తరువాత ఆమె ఇద్దరు అంగరక్షకులు ఇంటివద్దే ఆమెను హత్య (Assassition) చేశారు.

 

Comments are closed.