ఆవిరిపై ఉడికించిన కూరగాయలను తింటున్నారా, అయితే ఈ ప్రయోజనాల గురించి తెలుసుకోండి

ఉడికించిన కూరగాయలను అలాగే ఆకుపచ్చని ఆకు కూరలను తీసుకోవడం ద్వారా మన శరీరానికి తగినంత ఫైబర్, మినరల్స్, విటమిన్స్ తో పాటు మరికొన్ని అవసరమైన పోషకాలు అందుతాయి.

Telugu Mirror : మనం రోజు తీసుకునే వివిధ రకాల కూరగాయల్లో (vegetables) ఎన్నో పోషకవిలువలు ఉంటాయని మనకి తెలుసు. కానీ వాటిని సరైన పద్దతిలో వండినప్పుడు మాత్రమే ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది. కూరగాయలను ఆవిరితో (Steam) ఉడికించి తినడం వల్ల శరీరానికి సరైన పోషణ (Nutrition) అందుతుంది. ఇలా ఆవిరితో ఉడికించిన కూరగాయల్లో రంగు, రుచి,వాసనల పోషకాలు సురక్షితంగా ఉంటాయి. ఉడికించిన కూరగాయల్లో సహజంగా తక్కువ కేలరీలు ఉంటాయి కానీ అధిక ఫైబర్ కంటెంట్ మరియు వివిధ రకాల విటమిన్, ఖనిజాలు (Minerals) మరియు యాంటీఆక్సిడెంట్ లను కలిగి ఉంటాయి. కూరగాయలను ఆవిరి లో ఉడికించడం ద్వారా వాటి రంగు,ఆకారం మరియు రుచి అన్నింటిని నిలుపుకునే విధంగా ఉంటుంది. ఉడికించిన కూరగాయలను తినడం వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన  ప్రయోజనాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం .

1. బరువును నియంత్రించడం లో సహాయ పడుతుంది.

ఉడికించిన కూరగాయలలో (Boiled Vegetables) పచ్చి కూరగాయల కంటే తక్కువ కేలరీలు మరియు ఎక్కువ ఫైబర్ ఉంటుంది.ఈ రెండూ బరువును అదుపులో ఉంచేందుకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే అవి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి మరియు క్యాలరీలు తక్కువ ఉండడం వల్ల బరువు అధికంగా పెరగకుండా ఉండవచ్చు.

Also Read :కొబ్బరి నూనెతో తప్పక తెలుసుకోవాల్సిన 5 బ్యూటీ టిప్స్

2. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ.

ఉడికించిన కూరగాయలలో అధిక ఫైబర్ (Fiber) కంటెంట్ ఉండడం వలన జీర్ణక్రియను (Digestion) సులభతరం చేస్తుంది. ఇది మలబద్దకాన్ని నివారించేందుకు సహాయపడుతుంది ప్రేగుని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.

Health Benefits of Eating Steamed Vegetables
Image Credit : Life School

3. గుండె యొక్క స్థితిని మెరుగుపరుస్తుంది.

ఉడికించిన కూరగాయలలో  పొటాషియం (Potassium) అధిక స్థాయిలో  ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన గుండె (Heart) నిర్వహణలో మరియు రక్తపోటు నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఉడికించిన కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లతో పాటు చాలా రకాల పోషకాలు ఉంటాయి.

4. కంటి చూపు మెరుగుపడుతుంది.

క్యారెట్లు మరియు బచ్చలకూర వంటి కూరగాలను ఉడికించడం వలన అందులో ఉండే విటమిన్ ఎ మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు  శరీరానికి అద్భుతమైన ఎన్నో లాభాలను అందిస్తుంది. ఇవి ఆరోగ్యకరమైన దృష్టిని నిర్వహించడానికి మరియు వయస్సు-సంబంధిత మచ్చలను పోగొట్టేలా చేస్తుంది. దుంపలు మరియు చిలగడదుంపలు వంటి ఇతర కూరగాయలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.

Also Read : వంటగది వ్యర్ధాలతో ఇంట్లో గార్డెనింగ్ కి బోలెడు ప్రయోజనాలు

5. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఆవిరితో ఉడికించిన కూరగాయలు తక్కువ గ్లైసెమిక్ (Glycemic index) ను కలిగి ఉంటాయి, ఇది చక్కెరను రక్తంలోకి నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మరియు మధుమేహం అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

Comments are closed.