డెలివరీ తర్వాత చల్లని నీళ్లు తాగితే ప్రమాదమా, వైద్యుల అభిప్రాయాలను తెలుసుకుందాం

ప్రసవం తర్వాత రోజూ 3-4 లీటర్ల నీరు తాగడం మంచిది. తల్లి పాలలో 80% లీటర్ నీరు ఉన్నందున, పాలిచ్చే తల్లులు రోజూ 3-4 లీటర్ల నీటిని కచ్చితంగా తీసుకోవాలి.

Telugu Mirror : సి-సెక్షన్ లేదా నార్మల్ డెలివరీ తర్వాత చల్లని నీరు త్రాగకూడదని పెద్దలు సలహా ఇస్తుంటారు. అపానవాయువు చల్లటి నీరు తాగడం వల్ల కాదు సరిగ్గా నీరు త్రాగకపోవడం వల్ల వస్తుంది. సి-సెక్షన్ లేదా సాధారణ ప్రసవం తర్వాత చల్లని నీరు త్రాగవద్దు అని మన ఇంటి పెద్దలు ఇలా పదే పదే చెప్పడం మీరు వినే ఉంటారు. చల్లటి నీరు తాగడం వల్ల కడుపులో ఉబ్బరం వస్తుందని, అందుకే ఈ సమయం లో వేడినీళ్లు తాగాలని కూడా చాలా మంది అంటుంటారు. సి-సెక్షన్ లేదా నార్మల్ డెలివరీ తర్వాత చల్లని నీరు తాగడం వల్ల కడుపు నొప్పి వస్తుందా? అనే విషయం గురించి వైద్యుల అభిప్రాయాలను తెలుసుకుందాం.

నీరు (Water)  సరిగ్గా తాగడం చాలా అవసరమని అనేక పరిశోధనలు నిరూపించాయి. కానీ చాల మంది దీన్ని పాటించరు. డెలివరీ తర్వాత వైద్యులు ఆరోగ్యకరమైన ఆహారం మరియు జీవనశైలిపై జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. దానితో పాటు నీరు సరిగ్గా తాగడం కూడా మంచిదంటున్నారు. అలా చేయడం వల్ల మీ పొట్ట పొడుచుకు రాకుండా ఫిట్‌గా మరియు చక్కగా కనిపిస్తారు.

Also Read : అత్తిపండుతో అధిక బరువు హాం ఫట్..అంజీర్ చేసే లాభాలు ఇంకా మరెన్నో

నీరు త్రాగడానికి సరైన పద్దతి :

మీ శరీరానికి మరియు చర్మానికి నీరు చాలా అవసరం. అయితే నీటిని ఒకేసారి తాగకుండా కొద్దీ కొద్దిగా తాగుతూ ఉండడం వల్ల శరీరానికి సరియైన మోతాదులో నీరు అందుతుంది. ప్రశాంతంగా కూర్చుని నీళ్లు తాగాలి.

డెలివరీ తర్వాత నీరు ఎంత తాగాలి?

ప్రసవం (Delivery)  తర్వాత రోజూ 3-4 లీటర్ల నీరు తాగడం మంచిది. తల్లి పాలలో 80/లీటర్ నీరు ఉన్నందున, పాలిచ్చే తల్లులు రోజూ 3-4 లీటర్ల నీటిని కచ్చితంగా తీసుకోవాలి.వెన్నెముక మరియు కీళ్ల నొప్పులను తగ్గించడానికి ప్రసవం తర్వాత ప్రతిరోజూ 3-4 లీటర్ల నీటిని తీసుకోవాలి. ఇది నడుము నొప్పి నుండి మరియు ఇతర శరీర నొప్పుల నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది. ప్రసవానంతరం నీరు తక్కువగా తాగాలని చెప్తారు కానీ అది అబద్దం. రోజూ 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

Let's find out doctors' opinions on whether drinking cold water after delivery is dangerous
Image Credit : Zee News

చల్లటి నీరు తాగాలా లేక వేడి నీరు తాగాలా?

ప్రసవం తర్వాత వేడి నీళ్లే తాగాలని పెద్దలు చెప్తారు. కానీ వైద్యులు ఏమి చెబుతున్నారంటే, డెలివరీ గది యొక్క ఉష్ణోగ్రత ఎలా ఉందొ దానికి తగ్గట్టుగా నీరు త్రాగాలని అంటున్నారు. చల్లటి లేదా వేడినీరు తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకని మీరు మీ గది-ఉష్ణోగ్రతని బట్టి నీటిని త్రాగండి.

Also Read : గరుడ పురాణం ప్రకారం ఈ విషయాలు పాటిస్తే మీరు ఆనందాన్ని పొందుతారు

డెలివరీ తర్వాత నీరు తాగడం గురించి వైద్యులు ఎం చెప్తున్నారు?

ప్రసవం తర్వాత శరీరంలో నీరు తగ్గిపోతుంది, అందుకే నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆ సమయంలో చర్మం కూడా పాలిపోతుంది. జుట్టు రాలిపోవడం, డీ-హైడ్రేషన్ లాంటి సమస్యలు కొంత మోతాదులో తగ్గే అవకాశం ఉంది. నీటిని సరిగ్గా మరియు సరైన మోతాదులో త్రాగడం మీ పరిస్థితిని చక్కదిద్దడంలో సహాయపడవచ్చు. సి-సెక్షన్ లేదా సాధారణ ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతారు.ఇంకా స్త్రీలు నొప్పి మరియు వాపుని కూడా భరిస్తారు. కాబట్టి నీటిని తాగడం వలన ఈ సమస్యలు దూరమవుతాయి.

Comments are closed.