దానిమ్మ పండు చేస్తుంది ఆరోగ్యానికి ఎంతో మేలు

దానిమ్మ పండు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన పరిశోధనలలో కూడా దాననిమ్మ పండ్లు ఆహారంలో చేర్చుకోవడం వలన గుండె జబ్బులు మరియు ప్రమాదకర క్యాన్సర్ నుండి కూడా కాపాడటంలో సహాయకారిగా పనిచేస్తుంది అని తేలింది.

రోజువారి ఆహారంలో భాగంగా సీజన్లో దొరికే పండ్లను (Fruits)  మరియు కూరగాయలను (Vegetables) చేర్చుకోవడం వలన ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలు అందుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు సీజన్లో లభ్యమయ్యే పండ్లను మరియు కూరగాయలను తప్పకుండా తీసుకోవాలి అని వైద్యులు చెబుతున్నారు. తాజా పండ్లు శరీరానికి అవసరమైన పోషకాలను ఇవ్వడంతో పాటు అనేక రకాల విటమిన్లు మరియు ఖనిజాలను సులభంగా అందించడంలో సహాయపడతాయి.

దానిమ్మ పండు ప్రతి సీజన్లో (Season) లభ్యమవుతుంది. దానిమ్మ పండును తినడం వల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. దానిమ్మ పండులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది ఫైబర్, విటమిన్లు అలాగే ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇది అనేక రకాల కఠినమైన వ్యాధుల ప్రమాదం నుండి మనల్ని రక్షించడానికి  కూడా చాలా బాగా దోహదపడుతుంది.

Also Read : నేడు ఈ రాశి వారికి వ్యాపారంలో కలసి వస్తుంది స్నేహితుల సహాయం లభిస్తుంది. మరి మిగతా రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

విట మిన్ లు కలిగిన ఆహారం , సరైన వ్యాయామం బలమైన రోగనిరోధక వ్యవస్థకు ఆధారం

ప్రతిరోజు, ప్రతి ఒక్కరు ఒక దానిమ్మ పండును తినాలని మరియు ఇది యాంటీ ఆక్సిడెంట్లకు మూలమని, క్యాన్సర్ (Cancer) వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాల నుండి కాపాడడంలో ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ పండును తినడం వల్ల రక్తహీనత (Anemia) నుండి కూడా బయటపడవచ్చు.
దానిమ్మ పండు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుందో తెలుసుకుందాం.

దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్ (Anti oxidants) లక్షణాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా బాగా మేలు చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ వచ్చే నష్టం నుండి శరీరంలోని కణాలను సంరక్షించడంలో యాంటీ ఆక్సిడెంట్ లు  సహాయపడతాయి. దానిమ్మ పండు నుండి యాంటీ ఆక్సిడెంట్లను శరీరం (Body) పొందడం వల్ల మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు వ్యాధులను నివారించడంలో చాలా బాగా సహాయపడుతుంది.

శరీరంలో వచ్చే మంటను తగ్గించడంలో కూడా మేలు చేస్తుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉన్నాయి. దీర్ఘకాలికంగా వచ్చే మంట సమస్య మరియు గుండె జబ్బులు, టైప్ -2 మధుమేహం (Type -2 Diabetes) అలాగే క్యాన్సర్ వీటితో పాటు ఇతర కఠిన వ్యాధుల సమస్యలను తగ్గించడంలో దానిమ్మ పండు ప్రయోజనకరంగా ఉంటుంది.

Pomegranate fruit is very good for health
Image credits : Swasthi’s Recipes 

దానిమ్మలో క్యాన్సర్ ను నిరోధించే లక్షణాలు ఉన్నాయి అని పరిశోధనలో తేలింది. జంతువులపై జరిపిన పరిశోధనలో కాలేయ క్యాన్సర్ (Liver cancer) ఆరంభ దశలో ఉన్న కణితి పెరుగుదలను నిలిపివేయడంలో దానిమ్మ దోహదపడుతుంది. మరొక పరిశోధన ప్రకారం ప్రోస్టేట్ క్యాన్సర్ కు దానిమ్మ రసం చాలా బాగా పనిచేస్తుంది. ఈ పండుని తినడం వల్ల అనేక రకాల ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాల నుండి మనల్ని రక్షిస్తుంది.

దానిమ్మలో పాలి ఫెనోలిక్ సమ్మేళనాలు ఎక్కువగా ఉండటం వల్ల గుండె (Heart) ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. గుండె వ్యాధులు ఉన్నవారిపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం దానిమ్మ రసం తాగటం వల్ల ఛాతి నొప్పి యొక్క ఫ్రీక్వెన్సీ మరియు తీవ్రత తగ్గింది. ఈ పండు శరీరంలో రక్తాన్ని (Blood) వృద్ధి చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.

కాబట్టి ఆరోగ్యానికి ఎన్నో రకాల మేలు చేసే ఈ పండును తినడం ద్వారా కడుపులో మంట, గుండె వ్యాధులు, రక్తహీనత ,క్యాన్సర్ వంటి ప్రమాదాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

Comments are closed.