World Vision Day : కంటి సమస్యలను 60% తగ్గించే ఆహార పదార్ధాలు.

ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో రెండవ గురువారం నాడు ప్రపంచ దృష్టి దినోత్సవం ను జరుపుకుంటారు. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మెరుగైన ఆహారాన్ని తీసుకోవాలని కంటి వైద్యులు చెబుతున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాలను తరచుగా తీసుకోవడం వల్ల కంటి వ్యాధుల ప్రమాదాన్ని 60% వరకు తగ్గించవచ్చు. ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కంటి సమస్యలు రాకుండా ఉంటాయో తెలుసుకుందాం.

పూర్వకాలంలో వృద్ధాప్యంలో ఉన్న వారికి మాత్రమే కంటి సమస్యలు వచ్చేవి. కానీ కొన్ని దశాబ్దాల నుండి వయసుతో సంబంధం లేకుండా అందరికీ కంటి సమస్యలు వస్తున్నాయి. ఈ కంటి సమస్యలు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో కూడా వస్తున్నాయి.

కాబట్టి ప్రతి ఒక్కరూ తమ కళ్ళ (eyes) పట్ల ఎల్లప్పుడూ శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. దీనికోసం సక్రమమైన జీవన విధానం మరియు పోషకాహారాన్ని తీసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కంటి సమస్యలు పెరగడం ఆందోళన కలిగించే విషయం. అంధత్వం (blindness) క్రమంగా పెరుగుతుంది. మరియు చూపు కోల్పోయే ప్రమాదాల గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేయడానికి మరియు నివారణ చర్యల గురించి ప్రజలలో అవగాహన పెంపొందించడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండవ గురువారం నాడు ప్రపంచ దృష్టి దినోత్సవం ను జరుపుకుంటారు.

కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మెరుగైన ఆహారాన్ని తీసుకోవాలని కంటి వైద్యులు చెబుతున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాలను తరచుగా తీసుకోవడం వల్ల కంటి వ్యాధుల ప్రమాదాన్ని 60% వరకు తగ్గించవచ్చు.

Also Read : Eye Glasses : మీ కళ్ళద్దాలను సురక్షితంగా మరియు పరిశుభ్రంగా ఎలా శుభ్రం చేయాలో తెలుసుకోండి

ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కంటి సమస్యలు రాకుండా ఉంటాయో తెలుసుకుందాం.

World Vision Day: Foods that can reduce eye problems by 60%.
Image Credit : Global Observances

చేపలు 

చేపలు తినడం వల్ల కళ్ళ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చేపలలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. కొవ్వు కలిగిన చేపలలో ఒమేగా -3 ఫాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో శరీరానికి ఒమేగా- 3 ఫాటీ యాసిడ్స్ అందించవచ్చు. ఇది కళ్ళకు మాత్రమే కాకుండా మెదడు మరియు గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్ వయసు సంబంధిత మచ్చలను కూడా తగ్గిస్తుంది. ఈ కొవ్వు ఆమ్లం లోపం వల్ల కళ్ళు పొడిబారడం (Dry eyes) వంటి సమస్యలు అధికంగా వస్తాయి.

Also Read : Dazzler Eyes : చిన్న కళ్ళ కోసం పెద్ద టిప్స్ .. ఇక అందరి చూపు ఇప్పుడు మీ వైపు..

గింజలు మరియు విత్తనాలు 

శరీరం ఆరోగ్యం గా ఉండాలంటే ప్రతి ఒక్కరు తమ రోజువారి ఆహారంలో గింజలను భాగంగా చేర్చుకోవాలి. నట్స్ లో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. విటమిన్- ఇ కూడా నట్స్ లో అధిక స్థాయిలో ఉంటాయి. ఇది వయసు సంబంధిత ప్రమాదాల నుండి కళ్ళ ను రక్షించడంలో తోడ్పడుతుంది. గింజలతో పాటు చియా విత్తనాలు మరియు అవిసె గింజలు (Flaxseeds) మొదలైన కొన్ని రకాల విత్తనాలు తీసుకోవడం వల్ల కళ్ళ ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉన్నట్లు కనుగొనబడింది.

పుల్లని పండ్లు

సిట్రస్ పండ్లు పుల్లగా ఉంటాయి. వీటిల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ సి కూడా ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది వయసు సంబంధిత కంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని భావిస్తారు. నిమ్మ, నారింజ మొదలైన వాటిల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆహారంలో సిట్రస్ పండ్లను భాగంగా చేర్చుకోవాలి. విటమిన్ సి ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి (Immunity) బలంగా ఉంటుంది. దీని వలన కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

Also Read : Amla Juice : ఉసిరి రసం ఇలా తీసుకోండి ఆరోగ్య ప్రయోజనాలు పొందండి

క్యారెట్ 

క్యారెట్లలో విటమిన్ ఎ మరియు బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉన్నాయి. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా బాగా ప్రయోజనకరంగా పనిచేస్తాయి. విటమిన్ ఎ అనేది ప్రోటీన్ లలో ఒక భాగం. ఇది రెటీనా కాంతిని గ్రహించడంలో సహాయపడుతుంది. క్యారెట్ తో పాటు ఆహారంలో విటమిన్ లు మరియు సూక్ష్మ పోషకాలు (Micronutrients) అధికంగా ఉండే ఇతర ఆహార పదార్థాల్ని ఆహారంలో చేర్చుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడతాయి.

కాబట్టి కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో క్రమం తప్పకుండా ఈ నాలుగు రకాల ఆహార పదార్థాలను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.

Comments are closed.