Dhanteras 2023 Date and Shubha Muhurtam : నవంబర్ 10 ధన త్రయోదశి నాడు కొత్త వాహనం కొనుగోలుకు శుభసమయం.. కొన్న తరువాత ఇలా చేయండి

ధన త్రయోదశి, ఈ పండుగ దీపావళికి రెండు రోజుల ముందు ఆశ్వయుజ మాసం త్రయోదశి రోజున వస్తుంది. ధన త్రయోదశి రోజున కొంతమంది బంగారం లేదా వెండి కొంటే, కొత్త కారు కొనాలని చాలా మందికి ఉంటుంది. ధన త్రయోదశి నాడు వాహనం కొనే సమయంలో గుర్తించు కోవలసిన అంశాలు:

ధన త్రయోదశి, ఈ పండుగ దీపావళికి రెండు రోజుల ముందు ఆశ్వయుజ మాసం త్రయోదశి రోజున వస్తుంది.

ధన త్రయోదశి రోజున బంగారం లేదా వెండి వస్తువులు, కొత్త కార్లు, స్కూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు మొదలైనవి కొనుగోలు (purchase) చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఆరోజు మొత్తం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

కొంతమంది బంగారం లేదా వెండి కొంటే, మరి కొందరు కార్లు వంటివి కొంటూ ఉంటారు. కొత్త కారు కొనాలని కోరిక చాలా మందికి ఉంటుంది.

వాహనం (vehicle) ఇంటికి రెండవ ఆస్తి కనుక అటువంటి సందర్భం లో ఈ సంవత్సరం ధన త్రయోదశి రోజున కొత్త కారు కొనాలి అనుకునేవారు, ధన త్రయోదశి రోజున కొనడం మంచిదని నమ్ముతారు.

కొత్త కారు కొనే ప్లాన్ లో ఉన్నట్లయితే శుభ సమయం (good time) గురించి తెలుసుకుందాం. అలాగే కొత్త వాహనం కొనే ముందు కొన్ని విషయాలను కూడా గుర్తుంచుకోవాలి.

ఈ సంవత్సరం ధన త్రయోదశి నవంబర్ 10 న జరుపుకోనున్నారు. ఈరోజున షాపింగ్ చేస్తే సంపదలు (Wealth) చేకూరుతాయని కొందరి విశ్వాసం. కుబేరుడు తల్లి లక్ష్మీదేవి ఆశీస్సుల కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.

Dhanteras 2023 Date and Shubha Muhurtam : November 10 is an auspicious time to buy a new vehicle.. Do this after buying
Image Credit : Jar App

ధన త్రయోదశి నాడు చర లగ్నంలో వాహనం కొనడం చాలా శుభప్రదం (auspicious) గా భావించవచ్చు. చాలామంది ఈ సమయంలోనే బంగారం, వెండి వస్తువులను లేదా వాహనాలను కొంటారు.

ధన త్రయోదశి రోజున ఎవరైనా కొత్త వాహనాలు కొనాలని  అనుకున్నట్లయితే పగటిపూట (during the day) చర లగ్నంలో అనగా మధ్యాహ్నం గం 2:57 నిమిషాల నుండి సాయంత్రం గం 4:35 నిమిషాల వరకు చర లగ్నం (Chara Lagna) ఉంది. ఆ సమయంలో కొత్త వాహనాన్ని కొనుగోలు చేయవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Also Read : Vaastu Tips : ప్రశాంత జీవితం కొనసాగాలంటే ఇంటిలో ఈ నియమాలను పాటించండి.

ఉదయం 10:00 నుండి 11:58 నిమిషాల సమయంలో కూడా వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు అని కూడా చెప్పారు. ఈ రెండు సమయాలు వాహనం కొనడానికి అనుకూలమైన సమయమని జ్యోతిష్యులు (Astrologers) చెబుతున్నారు.

Also Read : Vaastu Tips : మనీ పర్స్ ఇలా ఉంటే మహాలక్ష్మి మీ వెంటే

ధన త్రయోదశి నాడు వాహనం కొనే సమయంలో గుర్తించు కోవలసిన అంశాలు:

ధన త్రయోదశి రోజున శుభ ఫలితాలు పొందాలంటే, శుభ సమయంలో మాత్రమే వాహనాన్ని కొనుగోలు చేయాలి.

ధన త్రయోదశి రోజున కారు కొన్నాక పూజ చేసిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి. ధన త్రయోదశి రోజున కారు కొన్న తర్వాత అందులో పసుపు వస్త్రాన్ని కట్టాలి.

ధన త్రయోదశి రోజున రాహుకాలంలో కొత్త వాహనం కొనుగోలు చేయకూడదని గుర్తించుకోవాలి.

ధన త్రయోదశి రోజున వాహనాన్ని కొన్న తర్వాత ఆ వాహనానికి పూజారి తో లేదా ఆ ఇంటి ఇల్లాలి తో పూజ చేయించాలి.

ధన త్రయోదశి రోజున వాహనం కొన్న తర్వాత వాహనంపై స్వస్తిక్ గుర్తు ని వేయాలి.

కాబట్టి ధన త్రయోదశి రోజున కొత్త వాహనం కొనాలనుకునే వారు శుభ సమయంలో కొనండి. తద్వారా శుభ ఫలితాలను పొందండి.

Comments are closed.