దసరా పండుగ ఏ రోజున జరుపుకోవాలి? అక్టోబర్ 23న లేక అక్టోబర్ 24న ?

దేశ వ్యాప్తంగా నవరాత్రి పూజలు అంగరంగ వైభవంగా జరుపుతున్నాయి. విజయ దశమి పండుగ సమయం కూడా మొదలయింది. దాని విశిష్టనూ మరియు ఏ సమయంలో దసరా జరుపుకుంటారు అనే విషయాన్నీ తెలుసుకుందాం.

Telugu Mirror : తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే నవరాత్రి సంబరాలు ముగుస్తున్నాయి. ఆట పాటలతో సంతోషంగా ఈ పండుగను జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగలలో దసరా (Dasara) పండుగ ఒకటి. పది జన్మల పాపాలను మొత్తం పోగొడుతుందని ప్రజలు నమ్ముతారు. తెలంగాణలో ఈ సమయం లోనే బతుకమ్మ ఉత్సవాలను జరుపుతూ ఉంటారు. ఈ తొమ్మిది రోజుల పండుగని నవరాత్రి వ్రతం , శరన్నవరాత్రులు, దేవి నవరాత్రులు అని కొన్ని పేర్లతో పిలుస్తారు. తెలుగు వారికి ముఖ్యమైన ఈ పండుగలో విభిన్న సంస్కృతులను కలిగి ఉంటాయి .

పండుగ రోజున తెలంగాణ (Telangana) లో మాంసం ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపుతారు అదే ఆంధ్రలో అయితే పిండి వంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దసరా అంటే లంకా రాక్షస రాజు అయినా రావణాసురుడిని రాముడు చంపినందుకు సంతోషంగా జరుపుకునే పండుగ. దశ అంటే పది తలలు హర అంటే ఓటమి అని అర్ధం. దసరా అంటే చెడుని అంతం చేసి మంచిని గెలిచిన పండుగకు సూచికగా చెప్పుకుంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు దేవి నవరాత్రులు జరుపుకుంటూ పదవ రోజున విజయ దశమిని కలిపి దసరాను జరుపుకుంటారు.

ప్రతి నెల అకౌంట్‌లోకి 9250 రూపాయలు, పోస్టాఫీసులో అద్భుతమైన పథకం

జమ్మి చెట్టుని పూజిస్తారు :

Image Credit : Rtvlive.com

ఈ దసరా పండుగ రోజున ఖచ్చితంగా అందరూ జమ్మి చెట్టుని పూజిస్తూ ఉంటారు. అలా పూజించడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని ప్రజలు  నమ్ముతారు. పూజించాక జమ్మి ఆకులు పెద్దవారికి పంచి వారి వద్ద ఆశీస్సులు తీసుకుంటారు. దీని తర్వాత పాల పిట్టను చూస్తారు. జమ్మి చెట్టు పాలను చిలికేటప్పుడు పుట్టిందని ప్రజలు భావిస్తారు. దసరా పండుగ నాడు జమ్మి చెట్టుని పూజిస్తే విజయం లభిస్తుందని నమ్ముతారు. చెడుపై మంచి గెలిచిన సందర్బంగా ప్రజలు ఈ పండుగను ఎంతో గొప్పగా జరుపుకుంటారు.

ఈ రోజు శని గ్రహాన్ని శుక్రుడు వ్యతిరేకించడం వలన ఈ రాశి వారి మానసిక స్థితి సరిగా ఉండదు. మరి ఇతర రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

దసరా పండుగ జరుపుకుకోవడానికి సరైన సమయం :

ఈ సంవత్సరం దసరా పండుగను అక్టోబర్ 23 జరుపుకోవాలా లేక అక్టోబర్ 24న జరుపుకోవాలా అనే గందరగోళంలో ఉన్నారు. ఈ సంవత్సరం  దసరా దశమి తిథి నాడు అనగా అక్టోబర్ 23 సాయంత్రం సమయంలో 5:45 నిమిషాలకు మొదలయి అక్టోబర్ 24 మధ్యాహ్న వేళ 3: 14 నిమిషాలకు ముగుస్తుంది. ఇక శ్రావణ నక్షత్రం ప్రారంభ వేళా oct 22న 6:44PM. మరియు శ్రావణ నక్షత్రం అక్టోబర్ 23న 5:14 నిమిషాలకు ముగుస్తుంది. పూజ సమయం అక్టోబర్ 24న మధ్యాహ్నం 12:40 నిమిషాల నుండి 2 : 49 నిమిషాల వరకు ఉంటుంది. విజయ ముహూర్తం 1 :26 PM నుండి 2:12 నిమిషాల వరకు ఉంటుంది. పండుగ అక్టోబర్ 24న జరుపుకుంటారు.

Comments are closed.