Endless Love: తీరా కాదల్. అనంతమైన ప్రేమ.

Telugu Mirror: ప్రతి ఒక్కరూ తమ యుక్త వయసులో ప్రేమిస్తారు ఆ ప్రేమ గుండె లోతుల్లో ఉంటాది.. ఆ ప్రేమ విఫలమైనప్పుడు ఆ ప్రేమికుల జంట మాత్రమే విడిపోతాది.. కానీ ఆ ప్రేమ అనేది శాశ్వతంగా గుండె లోతు పొరల్లో ఉంటది.. మనము ఆ జ్ఞాపకాల్లో జీవించాలి.. మనకు పెళ్లయిన తర్వాత చాలా ఏళ్ల తర్వాత వాళ్లు కనపడితే మరలా వాళ్ళని కలుసుకోవాలి వాళ్లతో కలిసి జీవించాలి అని అనుకోకూడదు..అలా అయితే ఇక్కడ జీవితంలో ఎవరూ మనశ్శాంతి గా ఉండలేరు.

Also Read:conjunctivitis: వానాకాలం లో కండ్ల ‘కలక’లం. Dr .చింతా ప్రభాకర్ గారు చెప్పే జాగ్రత్తలతో మటు మాయం.

ఎంత బాగుంది కదా ఈ కాన్సెప్ట్.. ఈ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమానే తీరా కాదల్.. తమిళ సినిమా(Tamil Movie) తెలుగులో డబ్బింగ్ చేయబడింది నెట్ఫ్లిక్స్(Netflix) లో ఉంది.. సినిమా నిదానంగా ఉంటుంది.. ఓ ఇద్దరు లవర్స్.. వాళ్లకు పెళ్లి జరిగి ఉండదు .. ఇద్దరూ వేరు వేరు వాళ్ళని పెళ్లి చేసుకుంటారు.. హీరోకేమో వందన అనే ఆమెతో మ్యారేజ్ అవుతుంది ఆర్తి అనే ఒక పాప కూడా ఉంటుంది.. హీరోయిన్ ఏమో ఇంకొక వ్యక్తితో మ్యారేజ్ అయితుంది కానీ ఎప్పుడు ఘర్షణ పడుతూ ఉంటారు..

అనూహ్యమైన పరిస్థితుల్లో హీరో హీరోయిన్ కలుసుకుంటారు.. తమ పాత ప్రేమ గుర్తుకొస్తుంది పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటారు.. హీరోయిన్ తన భర్త టార్చర్ ను భరించలేక అతని వదులుకొని హీరో దగ్గరికి రావాలి అని వస్తుంది.. కొంచెం వైలెంట్ లవ్ స్టోరీ(violent love story)గా కథ నడుస్తుంది.. కానీ చివరికి మనం పైన చెప్పిన కాన్సెప్ట్ తో ముగుస్తుంది…

Theer kadhal Movie review by chintha prabhakar
Image credit:cinema express

Also Read:Money Savings : డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సంపాదన మీ సొంతం అవుతుంది..!

నటించారు సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా బాగా నటించారు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.. ఎమోషన్స్ జాలి దయ ప్రేమ భయం అన్ని సమపాల్లలో ఉన్నాయి.. అల్లరి చిల్లరగా సినిమా లేదు.. పాత సినిమా చూసినట్లు కథలో లీనమవుతాం.. ఓసారి తప్పక చూడొచ్చు.. ఒక విభిన్నమైన లవ్ స్టోరీ…

Dr.Chintha Prabhakar Reddy

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి(Chintha Prabhakar Reddy)MS MCh

గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు

ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

Leave A Reply

Your email address will not be published.