Vaastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి అందంతో పాటు అదృష్టం, సంపదను తెచ్చే మొక్కలు ఇలా పెంచండి

కొన్ని రకాల మొక్కలు ఇంటికి అందాన్ని తీసుకురావడంతో పాటు, అదృష్టాన్ని మరియు సంపదను కూడా తెస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎటువంటి మొక్కలు పెంచుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

కొన్ని రకాల మొక్కలు (Plants) ఇంటికి అందాన్ని తీసుకురావడంతో పాటు, అదృష్టాన్ని మరియు సంపదను కూడా తెస్తాయి. కనుక చాలామంది ఇంటి ఆవరణలో మరియు ఇంటి లోపల కొన్ని రకాల మొక్కలను పెంచుకోవడం చాలా శుభ ప్రద్రంగా భావిస్తారు.

వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలు ఇంటికి హాని (harm) కలిగిస్తాయి. మరి కొన్ని రకాల మొక్కలు ఇంటికి సుఖసంతోషాలను మరియు అదృష్టాన్ని తీసుకురావడంతో పాటు ఇంట్లో సానుకూలత మరియు శ్రేయస్సును కూడా వచ్చేలా చేస్తాయి.

ఇటువంటి మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. డబ్బు ప్రవాహం (Money flow) పెరుగుతుంది. ఇటువంటి మొక్కలను లక్కీ ప్లాంట్స్ అని పిలుస్తారు.

ఈ రోజు కథనంలో వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎటువంటి మొక్కలు పెంచుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

మనీ ప్లాంట్ :

Vaastu Tips: According to Vaastu Shastra, grow plants that bring beauty, luck and wealth to the home
Image Credit : 99 acres.com

 

మనీ కి మరియు మనీ ప్లాంట్ కి మధ్య ఉన్న సంబంధం అందరికీ తెలిసిన విషయమే. చాలామంది ఇళ్లల్లో మనీ ప్లాంట్ లు ఉంటున్నాయి. అయితే ఈ మొక్కను సరైన స్థలంలో మరియు సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. మనీ ప్లాంట్ తీగలు ఎప్పుడూ కూడా కిందకు వ్రేలాడ కూడదు. మనీ ప్లాంట్ తీగలు ఎప్పుడూ పైకే ప్రాకుతూ ఉండాలి. మనీ ప్లాంట్ ను పెంచే ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. మనీ ప్లాంట్ మొక్కను ఆగ్నేయ దిశ (Southeast direction) లేదా వాయువ్య దిశ (Northwest direction) లో పెంచితే మంచిది.

లక్కీ బాంబు :

Vaastu Tips: According to Vaastu Shastra, grow plants that bring beauty, luck and wealth to the home
Image Credit : Ugaoo

వాస్తు శాస్త్రం ప్రకారం లక్కీ వెదురు చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఇంటి లోపల లేదా ఇంటి ముందు వెదురు మొక్కను ఉంచడం చాలా శుభప్రదంగా చెప్పబడుతుంది. ఇంటి ముందు వెదురు చెట్టు నాటడం వీలుకాకపోతే ఇంటి లోపల ఈశాన్యం (Northeast) లేదా ఉత్తరం (North) వైపు వెదురు మొక్కను ఉంచవచ్చు. ఈ మొక్కను ఈ దిశలో ఉంచడం వలన కొద్ది రోజుల్లోనే మార్పును గమనిస్తారు. అందుకే ఈ మొక్కను అదృష్టం తెచ్చే మొక్కగా పిలుస్తారు.

Also Read : VAASTU TIPS : లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఈ మూడు వస్తువులు ఇంట్లో ఇలా ఉండాలి!

జెడ్ ప్లాంట్ :

Vaastu Tips: According to Vaastu Shastra, grow plants that bring beauty, luck and wealth to the home
Image Credit : IndiaMART

జెడ్ ప్లాంట్ మొక్క సంపదను మరియు సానుకూల శక్తి (Positive energy) ని ఆకర్షిస్తుందని చాలామంది నమ్ముతారు. ఈ మొక్క ఆకులు  మందంగా మరియు గుండ్రటి ఆకారంలో ఉంటాయి. ఈ మొక్కని ఇంట్లో పెంచుకోవడం చాలా సులభం. ఈ మొక్క విజయానికి మరియు శ్రేయస్సుకు ప్రాతినిథ్యం గా మారుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

దానిమ్మ :

Vaastu Tips: According to Vaastu Shastra, grow plants that bring beauty, luck and wealth to the home
Image Credit : The spruce

దానిమ్మ పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఈ మొక్కను ఇంటి ఆవరణలో పెంచుకోవడం వల్ల ఆ ఇంటికి శ్రేయస్సు లభిస్తుంది. ఇంట్లో దానిమ్మ మొక్క ఉండడం వల్ల అప్పుల బాధలనుండి ఉపశమనం కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అలాగే ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అయితే దానిమ్మ మొక్కను ఎప్పుడూ కూడా నైరుతి దిశ (Southwest direction) లో మాత్రం పెంచ కూడదు.

Also Read : Vaastu Tips : అన్నపూర్ణా దేవి అనుగ్రహం పొందాలంటే, వంట గదిలో ఈ వస్తువులను ఉంచకండి

స్నేక్ ప్లాంట్ :

Vaastu Tips: According to Vaastu Shastra, grow plants that bring beauty, luck and wealth to the home
Image Credit : The Plant Society

స్నేక్ ప్లాంట్ మొక్క గాలిలో ఉన్న విషవాయువులను (Poisonous gases) గ్రహిస్తుంది. ఈ స్నేక్ ప్లాంట్ ను ఇంట్లో ఉంచడం వల్ల ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. గాలిని ప్యూరిఫైర్ చేస్తుంది. ఈ మొక్కను పెంచడం కోసం ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు.

Also Read : Vaastu Tips : మనీ పర్స్ ఇలా ఉంటే మహాలక్ష్మి మీ వెంటే

కాబట్టి వాస్తు శాస్త్రం మీద నమ్మకం ఉన్న వారు ఈ మొక్కలను ఇంటిలో పెంచుకోండి. తద్వారా అదృష్టాన్ని మరియు సిరిసంపదలను పొందండి.

Comments are closed.