Vaastu Tips : అన్నపూర్ణా దేవి అనుగ్రహం పొందాలంటే, వంట గదిలో ఈ వస్తువులను ఉంచకండి

వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే కాదు ఇంట్లో ఉండే వస్తువులకు మరియు వాటిని అమర్చే స్థలం కు కూడా వర్తిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ముఖ్యమైన గదుల్లో వంటగది ఒకటి. వంట గది ని వాస్తు ప్రకారంగా నిర్మించడం ఎంత ముఖ్యమో వంట గదిలో అమర్చే వస్తువుల విషయంలో అంతే జాగ్రత్తగా ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే కాదు ఇంట్లో ఉండే వస్తువులకు మరియు వాటిని అమర్చే స్థలం కు కూడా వర్తిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ముఖ్యమైన గదుల్లో వంటగది (kitchen) ఒకటి.

ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా జీవించాలి అంటే తినే ఆహారం తయారయ్యేది అక్కడే. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు.

ఇంటి వాస్తు అనేది ఆ ఇంట్లో నిరసించేవారి ఆరోగ్య పరిస్థితులను ప్రభావితం చేస్తుందని మనలో చాలామంది నమ్మేవారు ఉంటారు. ఇంట్లో వాస్తు సరిగా లేనట్లయితే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఆరోగ్యంపై చెడు ప్రభావం (bad influence) చూపిస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు.

అందుకే ఎంత ఖర్చుతో గృహాన్ని కట్టించిన దాని కన్నా ఎంత సరైన వాస్తు తో ఇంటిని నిర్మించాం అనే విషయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. దీనికోసం ఎంతోమంది వాస్తు నిపుణులు సలహాలు,సూచనలు తప్పకుండా పాటించాలి.

వంట గది ని వాస్తు ప్రకారంగా నిర్మించడం ఎంత ముఖ్యమో వంట గదిలో అమర్చే వస్తువుల విషయంలో అంతే జాగ్రత్తగా ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

వంట గదిలో ఏయే వస్తువులు ఉంటే మంచిదో, వాటి వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం.

వంటగదిని అన్నపూర్ణాదేవి పవిత్ర స్థలంగా భావిస్తారు. అందుకే వంటగది ఎల్లప్పుడూ పరిశుభ్రంగా (Cleanly) ఉండేలా చూసుకోవాలి.

Also Read : Vaastu Tips : ఏ దిక్కున ఏ రంగు డోర్ మ్యాట్ ఉంచితే లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుంది? తెలుసుకోండి!

కొంతమంది టాబ్లెట్స్ ని వంట గదిలో ఉండే డబ్బాల్లో పెడుతుంటారు. అటువంటి అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. ఎప్పుడూ వంటగదిలో టాబ్లెట్స్ ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది. ఈ విధంగా చేయడం వల్ల అన్నపూర్ణేశ్వరి దేవి ఆగ్రహానికి గురవుతారని నిపుణులు చెబుతున్నారు.

Vaastu Tips : Do not keep these things in the kitchen to get the blessings of Goddess Annapurna
Image credit : India.com

వంటగదిలో ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంతవరకు తగ్గించాలి. మెటల్ పాత్రలను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి.

ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులు వాడకం అధికమైతే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుంది.

వంట గదిలో అద్దం (Mirror)పెట్టుకునే అలవాటు ఈమధ్య బాగా పెరిగింది. మహిళలు తరచూ అద్దంలో చూసుకుంటూ వంట చేస్తుండడం అంత మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వంట చేసేటప్పుడు వంట మీద దృష్టి సారించలేక పోతారని ఒక సైంటిఫిక్ కారణం.

Also Read : VAASTU TIPS : లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఈ మూడు వస్తువులు ఇంట్లో ఇలా ఉండాలి!

వంటగదిలో చెత్తబుట్ట (Dust bin) ను ఉంచడం సాధారణ విషయం. వంటగదిలో చెత్తబుట్టను ఉంచే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. వంట గదిలో చెత్తా,చెదారం ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది అని అంటున్నారు.

వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ విరిగిన వస్తువులు, పాత్రలు ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. విరిగిన పాత్రలు వంట గదిలో ఉంటే దురదృష్టం, పేదరికం తెస్తాయని చెబుతున్నారు. విరిగిన పాత్రలు, వస్తువులు ఉంటే వెంటనే తీసేయాలి అని చెబుతున్నారు. ఎందుకంటే వీటి వల్ల ఆర్థిక ఇబ్బందులు (Financial difficulties)వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది.

Also Read : Vaastu Tips : ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలా చేయండి లక్ష్మీ కటాక్షం పొందండి

వంట గదిలో ఉండకూడని మరొక వస్తువు చీపురు. చీపురు (the broom) వంట గదిలో ఉంచడం వలన ఆ కుటుంబంలో అశాంతితో పాటు, అనారోగ్య సమస్యలు వస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు.

కాబట్టి వంట గదిలో ఇటువంటి పొరపాట్లు చేస్తుంటే వాటిని మానేయండి. వాస్తు శాస్త్రం మీద నమ్మకం (trust) ఉన్నవారు వీటిని పాటించండి. తద్వారా ఆరోగ్యంగా జీవించండి.

Comments are closed.