Vaastu Tips : లక్ష్మీ దేవిని ఆహ్వానించాలంటే మీ ఇంటి సింహ ద్వారం ముందు ఇవి ఉంచకండి

ఇంటి ప్రధాన ద్వారం అనేది లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది. సింహద్వారానికి ఎదురుగా ఉండే స్థలాన్ని శుభ్రంగా మరియు అందంగా అలంకరించి ఉంచాలి. అయితే చాలామంది తెలియక ప్రవేశ ద్వారం ఎదురుగా ఉంచ కూడని కొన్ని రకాల వస్తువులను ఉంచు తుంటారు. ఇంటి ముందు ప్రవేశ ద్వారం ఎదురుగా పెట్ట కూడని వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.

ఇంటి ప్రధాన ద్వారం (main door) అనేది లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది.కాబట్టి సింహద్వారానికి ఎదురుగా ఉండే స్థలాన్ని శుభ్రంగా మరియు అందంగా అలంకరించి ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరియు ఆ ఇంట్లో నివసించే వారికి శుభం కలుగుతుంది.

అయితే చాలామంది తెలియక ప్రవేశ ద్వారం ఎదురుగా ఉంచ కూడని కొన్ని రకాల వస్తువులను ఉంచు తుంటారు. ఇలాంటి పనులు అసలు చేయకూడదు. గుమ్మానికి ఎదురుగా ఉండకూడని వస్తువులు (accessories) ఉంచినట్లయితే ఆ ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. తద్వారా ఆ ఇంట్లో నివసించే వారికి రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి.

కాబట్టి ఇంటి ముందు ప్రవేశ ద్వారం ఎదురుగా పెట్ట కూడని వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.

గాజు వస్తువులు మరియు అద్దాలు : 

కొంతమంది ఇంటి ముందు భాగంలో అద్దాలను పెడుతుంటారు. ఈ విధంగా చేయడం వల్ల ఆ ఇంట్లోకి నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు. కనుక అద్దాలు (glasses) మరియు గాజు వస్తువులను ఇంటి ముందు భాగంలో ఉంచరాదు.

Also Read : Vaastu Tips : మనీ పర్స్ ఇలా ఉంటే మహాలక్ష్మి మీ వెంటే

విరిగిన వస్తువులు : 

విరిగిపోయిన మరియు పాడైపోయిన (damaged) వస్తువులను ఇంటి ముందు భాగంలో ఉంచకూడదు. అలాగే ఇంటి లోపల కూడా ఉంచకూడదు. తక్షణమే వాటిని తీసి బయట పడేయాలి.

Vaastu Tips : Do not place these in front of the lion door of your house to invite Goddess Lakshmi
Image Credit : Telugu Mirror

చెప్పులు : 

చాలామంది చెప్పులు స్టాండ్ మరియు చెప్పులను గుమ్మానికి ఎదురుగా ఉంచుతారు. ఈ విధంగా అసలు చేయకూడదు. గుమ్మం పక్కన పెట్టుకోవచ్చు కానీ గుమ్మం ఎదురుగా మాత్రం పెట్టకూడదు. ఈ విధంగా చేస్తే ఆ ఇంట్లో నివసించే వారిని దరిద్రం (poor) వెంటాడుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

మారణాయుధాలు : 

గుమ్మానికి ఎదురుగా మారణాయుధాలు అనగా కొడవలి, గొడ్డలి, కత్తులు, గడ్డ పారలు వంటి వాటిని ఉంచకూడదు. వీటిని ఎవరు నడవని ప్రదేశంలో ఉంచాలి. లేదంటే ప్రమాదాలు ఎదురవుతాయని నిపుణులు (Experts) చెబుతున్నారు.

ముళ్ళ మొక్కలు : 

ఇంటి ముందు భాగంలో సింహ ద్వారానికి ఎదురుగా ఎటువంటి ముళ్ల మొక్కలు ఉండకూడదు. అనగా గులాబీ, నాగ జెముడు, బ్రహ్మ జెముడు ఇటువంటి మొక్కలు అంటే ముళ్ల జాతికి చెందిన మొక్కలు ఉండకూడదు. ఈ విధంగా ఉంటే ఆ ఇంట్లో గొడవలు అధికంగా జరుగుతుంటాయి. అలాగే ఎండిపోయిన (dried up) మరియు వాడిపోయిన మొక్కలు కూడా ఇంటి ముందు భాగంలో మరియు ఇంటి ఆవరణలో ఉండకూడదు.

Also Read : Vaastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి అందంతో పాటు అదృష్టం, సంపదను తెచ్చే మొక్కలు ఇలా పెంచండి

Vaastu Tips : ప్రతిరోజూ కర్పూరం తో ఇంట్లో ఇలా చేయండి, శుభ ఫలితాలను పొందండి

చెత్త బుట్ట : 

కొంతమంది తెలియక చెత్త బుట్టను ఇంటి ముందు ఉంచుతారు. ఈ విధంగా కూడా చేయకూడదు. ఇలా చేస్తే ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. కనుక చెత్త బుట్ట (dustbin) ను గుమ్మానికి వీలైనంత దూరంగా ఉంచాలి.

కాబట్టి సింహద్వారం ముందు భాగం అనగా గుమ్మానికి ఎదురుగా ఇటువంటి పొరపాట్లు అస్సలు చేయకూడదు. గుమ్మం ఎదురుగా శుభ్రంగా మరియు అందంగా అలంకరించుకోవడం వలన ఆ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం (grace) కలుగుతుంది.

వాస్తు శాస్త్రం మీద నమ్మకం ఉన్నవారు పాటించండి. సుఖసంతోషాలను మరియు సిరిసంపదలను పొందండి.

Comments are closed.