Bal Jeevan Bhima Yojana: ఈ ప్రభుత్వ పధకం లో చేరడం ద్వారా మీ పిల్లలని లక్షాధికారులను చేయండి. కేవలం రోజుకి రూ.6 పెట్టుబడితో లక్షల ప్రయోజనాలు

Bal Jeevan Bhima Yojana: ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్ బాగుండాలని కోరుకుంటారు. అయితే అందరూ ఆర్ధికంగా బలంగా ఉండరు. అయితే సామాన్యులు కూడా తమ పిల్లలకు దేదీప్యమైన భవిష్యత్ ని ఇవ్వడానికి వారియొక్క విద్య,వివాహం తదితర అవసరాల కోసం ఉపయోగపడే బీమా బాల్ జీవన్ బీమా యోజన.

Bal Jeevan Bhima Yojana: భారతదేశంలోని పిల్లల యొక్క భవిష్యత్తును సురక్షితంగా, దేదీప్యమానంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం బాలల కోసం జీవిత భీమా పధకాన్ని ప్రారంభించింది. అయితే ఈ పధకంలో సాధారణ పౌరులు ఎవరైనా రోజుకు రూ.6 రూపాయలు పెట్టుబడిగా పెట్టవచ్చు. మీరు పెట్టే 6 రూపాయల పెట్టుబడి భవిష్యత్ లో లక్షల రూపాయల ప్రయోజనాలను చేకూరుస్తుంది. పెట్టుబడి పెట్టిన డబ్బును పిల్లల చదువులకు, వివాహానికి లేదా ఇతర అవసరాలకోసం వినియోగించవచ్చు. ఈ పధకానికి కావలసిన అర్హతలు, ప్రయోజనాలను పొందేందుకు కావలసిన పత్రాలతోపాటు ఇంకా మరింత సమాచారాన్ని తెలుసుకుందాం.

బాల్ జీవన్ భీమా యోజన 2024:

ఇది వాస్తవంగా చైల్డ్ లైఫ్ ఇన్స్యూరెన్సు స్కీమ్ దీనిని పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్సు క్రింద పోస్ట్ ఆఫీస్ లు నిర్వహిస్తాయి. పిల్లల ఉజ్వల భవిష్యత్తు, వారి ఎదుగుదల మరియు మంచి జీవితం కోసం ఈ భీమా చాలా అవసరమైనది.

ఈ పధకం క్రింద 5 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారికి భీమా చేస్తారు. భీమా చేసే పిల్లల తల్లిదండ్రుల వయస్సు 45 సంవత్సరాలు దాటినచో ఈ పధకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. ఈ పధకం కేవలం పిల్లల పేరు మీదే తెరుస్తారు, నామినీగా తల్లిదండ్రులను ఉంచుతారు.

భీమాను తీసుకున్న తరువాత పిల్లల తల్లిదండ్రులు చనిపోతే భీమా ఇక చెల్లించే అవసరం లేదు. భీమా గడువు ముగిసిన అనంతరం పిల్లలకు భీమా సొమ్ము మొత్తం అందించబడుతుంది. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ లో PPF, NSC, FD ఖాతాలను తెరవడం ద్వారా ఇంకా మంచి వడ్డీ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ భీమాలో చేరేందుకు దరఖాస్తు ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ లో అందుబాటులోఉంటుంది.

Bal Jeevan Bhima Yojana: This scheme of Govt
Image Credit : Telugu Mirror

బాల్ జీవన్ భీమా ప్రయోజనాలు:

ఈ భీమా తీసుకున్న తరువాత మీరు ప్రతి రోజూ, నెల వారీ లేదా సంవత్సరానికి కలిపి ఒకే సారి పెట్టుబడి పెట్టవచ్చు. భీమా తీసుకున్న తరువాత తల్లిదండ్రులు చనిపోతే భీమా మొత్తాన్ని పిల్లలకు ఇస్తారు. స్కీం లో చేరాక బిడ్డ చనిపోతే ఆ బీమా తాలూకు మొత్తం సొమ్ము నామినీకి లేదా తల్లిదండ్రులకు ఇస్తారు. పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం ఈ పధకం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పధకం క్రింద ఇంకా ప్రయోజనాన్ని పొందటానికి రోజుకి రూ.50 డిపాజిట్ చేస్తే మీరు దాదాపు 35 లక్షల రూపాయలను పొందుతారు.

బాల్ జీవన్ భీమా యోజన కు కావలసిన పత్రాలు:

పిల్లల ఆధార్ కార్డ్
తల్లిదండ్రుల ఆధార్ కార్డ్
పిల్లల జనన ధృవీకరణ పత్రం
చిరునామా రుజువు
మొబైల్ నంబర్
పిల్లల పాస్ పోర్ట్ సైజ్ ఫోటో

బాల్ జీవన్ భీమా పధకంలో ఎలా చేరాలి:

ఈ పధకంలో భీమా పొందాలనుకునే పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలిసి సమీపంలోని పోస్ట్ ఆఫీస్ కు వెళ్ళాలి. ఈ పధకం యొక్క కాల పరిమితి మరియు ప్రయోజనాలను వివరంగా అడిగి తెలుసుకుని పధకం యొక్క దరఖాస్తును తీసుకుని పూర్తి చేసి ఇవ్వాలి. వారు మీకు పాస్ బుక్ ను ఇస్తారు. అందులో మీరు డిపాజిట్ చేసిన మొత్తం చూపెడుతుంది.

ఈ భీమా క్రింద కొంత మొత్తం డిపాజిట్ చేస్తే పిల్లలకు సంతోషకరమైన గొప్ప జీవితాన్ని అందించవచ్చు. వారికి కావలసిన మెరుగైన జీవితాన్ని ఏర్పరచవచ్చు. కనుక నేడే మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ ను సందర్శించి బాల్ జీవన్ భీమా యోజన గురించి తెలుసుకోండి.

Comments are closed.