ఒంటరి తనం ఆ తల్లికి భారమైంది, తల్లి ఒంటరి తనం ముక్కుపచ్చలారని పసి బిడ్డల పాలిట శాపమైంది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి తన చేతులతోనే పసి బిడ్డలను పరలోకానికి పంపించింది. ప్రాణం పోసిన చేతులతోనే ప్రాణం తీయటానికి ఆ క్షణంలో ఆ తల్లి ఎంత తల్లడిల్లి పోయిందో. ఎందుకు జన్మించామో, ఎందుకు చనిపోతున్నామో తెలియని పసి హృదయాలు పడిన వేదన తలచుకుంటేనే గుండె (Heart) పగిలి పోతుంది. గుండెలు పిండే ఈ సంఘటన ప్రతి ఒక్క హృదయాన్ని కలచి వేస్తోంది. తను లేకుంటే తన బిడ్డలు ఏమై పోతారో అని ఆ తల్లి తీసుకున్న కఠిన నిర్ణయం బండరాళ్లకు సైతం కన్నీరు( Tear) తెప్పిస్తుంది. క్షణికావేశంలో ఆ తల్లి తీసుకున్న నిర్ణయం విషాదాన్ని మిగిల్చింది.
ఆంధ్రప్రదేశ్ (AP) లోని విజయనగరం జిల్లాలో ఈ హృదయాలను కలచివేసే సంఘటన చోటు చేసుకుంది. కలెక్టరేట్ రెవిన్యూ( Revenue) విభాగంలో సబార్డినేటర్ గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని దారుణానికి పాల్పడింది. భర్త (Husband) దూరంగా ఉంటుండటంతో ఒంటరితనం తట్టుకోలేక తనతో పాటు ముక్కుపచ్చలారని తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు ఇచ్చి బలవన్మరణానికి పాల్పడింది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబరకు చెందిన మహిళకు నాలుగు సంవత్సరాల క్రిందట హైదరాబాదు (Hyderabad) కు చెందిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ తో వివాహం (Marriage) జరిగింది. వివాహం జరిగిన కొద్ది నెలలకు తండ్రి (Father) మరణిచడంతో కారుణ్య నియామకాల్లో ఆమెకు విజయనగరం జిల్లా రెవెన్యూ శాఖలో ఉద్యోగం (Job) వచ్చింది. ఉద్యోగ రీత్యా హైదరాబాదులో ఉన్న భర్తకు దూరంగా విజయనగరం (VIjaya Nagaram) జిల్లాకు ఆమె రావాల్సి వచ్చింది.
అయితే ఆ మహిళకు మూడు సంవత్సరాల లతిక్ష అనే కుమార్తె (Daughter), యోగాన్ష్ అనే ఏడాదిన్నర కుమారుడు (Son) ఉన్నారు. ఉద్యోగం కారణంగా ఆమె తన ఇద్దరు పిల్లలతో విజయనగరంలోనే నివాసం ఉంటుంది. రోజూ ఉదయం ఆమె ఆఫీసుకు (Office) వెళ్ళినప్పుడు పిల్లల బాగోగులు చూసేవారు ఎవరూ లేకపోవడంతో..ఎప్పుడూ ఇబ్బందులు పడుతుండేది. భర్త ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లోనే ఉండేవాడు. హైదరాబాద్ నుండి విజయనగరంకు ట్రాన్స్ ఫర్ (Transfer) అవడానికి తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కి రావడానికి స్థానికత అడ్డుగా మారింది. ఈ పరిస్థితులలో భర్త హైదరాబాదులో, ఆమె, పిల్లలు విజయనగరంలోనే ఉంటూ వస్తున్నారు. ఆమె కూడా తన ఉద్యోగం వదులుకొని హైదరాబాద్ వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఆఫీస్‌కి వెళ్ళిన తరువాత తన పిల్లల ఆహారంతో పాటు ఇతర అవసరాలు తీర్చే వారు ఎవరూ లేకపోవడంతో ఆమె గత కొంతకాలంగా మానసికంగా క్రుంగి పోతూ వచ్చింది.
Also Read : Nipah Vairus : కేరళను వణికిస్తున్న నిపా వైరస్, పలు ప్రాంతాలలో ఆంక్షలు
హ్యాంగోవర్‌తో ఇబ్బంది పడుతున్నారా, ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే..
అనేక అవస్థలు పడుతూ చేసేది లేక జీవితంపై విరక్తి చెంది జీవితాన్ని ముగించడానికి సిద్ధపడింది. కానీ తను మరణిస్తే ఇద్దరు పసి పిల్లల పరిస్థితి ఏంటి? వారిని చూసేవారు ఎవరున్నారు.? చిన్నారులు ఇద్దరూ రోడ్డున పడతారని భావించిన ఆ తల్లి తనతో పాటు ఇద్దరు పసి ప్రాణాలను కూడా హతమార్చే నిర్ణయానికి వచ్చి ఆఫీస్ (Office) నుండి ఇంటికి వచ్చే సమయంలో పురుగుల మందు కొని ఇంటికి వచ్చింది. ముందుగా ఇద్దరు చిన్నారులకు పురుగుల మందు త్రాగించి, తర్వాత తాను కూడా తాగి ఆత్మహత్య (Suicide) కు ప్రయత్నం చేసింది. అయితే కొంత సమయం తర్వాత చిన్నారుల ఏడుపులు విన్న చుట్టుపక్కల వారు వచ్చి పరిస్థితిని గమనించి వెంటనే ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి వెళ్లిన కొద్దిసేపటికే తల్లి మరణించిగా, కుమారుడు యోగాన్ష్ మరుసటి రోజు చికిత్స (Treatment) పొందుతూ మరణించాడు. ప్రస్తుతానికి కుమార్తె లక్షిత ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బాలిక పరిస్థితి కూడా విషమంగా మారింది. క్షణికావేశంలో ఆ తల్లి తీసుకున్న నిర్ణయానికి ఆమెతో పాటు కుమారుడు మరణించాడు. కాగా, కుమార్తె లక్షిత పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.