Telugu Mirror: టీఎస్ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ తొలి జాబితా: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (KCR) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం విడుదల చేశారు. కే చంద్రశేఖర రావు నాయకత్వంలోని అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వరుసగా మూడోసారి కూడా అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు చోట్ల పోటీలో ఉంటున్నట్లు తెలిపారు. తాను గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు.
Also Read:PM Vishwakarma Yojana : చేతి వృత్తుల వారికి మొదటి సారి కేంద్రం చేయూత..అర్హులు వీరే
పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ (BRS) అధ్యక్షుడు ముందుగా ఎంపిక చేసిన శుభ ముహూర్తంలో సోమవారం పంచమ తిథి నాడు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో BRS పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల మొదటి జాబితాను పోలింగ్ తేదీ ప్రకటన కంటే ముందుగానే ప్రకటించడం ద్వారా, ప్రచారాన్ని వేగవంతంగా స్టార్ట్ చేయడానికి BRS చీఫ్ అభ్యర్థుల లిస్ట్ ను ముందుగానే విడుదల చేసే పద్ధతిని కొనసాగించారు. గతంలో పోటీచేసిన అభ్యర్థులలో పెద్దగా మార్పులు చేయలేదని, కేవలం 7గురు అభ్యర్థులను మాత్రమే మార్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. నాలుగు స్థానాలకు ప్రస్తుతం అభ్యర్థులను ప్రకటించలేదు. నర్సాపూర్ (Narsapur), నాంపల్లి(Nampally), జనగామ(Janagon), గోషా మహల్ (Gosha Mahal) స్థానాలకు పోటీచేసే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదు. మెట్ పల్లి, ఉప్పల్, బోధ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, వేములవాడ లో గతంలోని అభ్యర్థులను మార్చారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితా:
Click Down to download list
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…