Rythu Runa mafi in andhra pradesh: రైతులకు అండగా రుణమాఫీ పథకం.. ప్రజల మనసుకు మరింత చేరువవుతున్న జగనన్న.

Telugu Mirror: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి(y.s jagan mohan reddy) రైతులకు అండగా మరో పథకాన్ని తెచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నారు . 2019 ఎన్నికల్లో అద్భుతమైన పథకాలను ప్రకటించి ప్రజలకు మరింత దగ్గరైన వై. యస్. జగన్ మోహన్ రెడ్డి(y.s. jagan mohan reddy) వచ్చే నెలలో రైతులకు శుభవార్త చెప్పే వివరాలను ప్రకటించడానికి ఆలోచనలు చేస్తున్నారు. రుణమాఫీ నేపథ్యం లో అధికారులు ఈ పథకాన్ని అమలు చేయడానికి ఉత్సాహంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు .

ఏ సమస్యలు రాకుండా అన్ని సహకరిస్తే ముఖ్యమైన ఈ రుణమాఫీని వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి దృష్టికి కి తీసుకెళ్లి ఈ విషయం గురించి క్లుప్తంగా చర్చించి, ఒప్పించే దిశగా ఉన్నత అధికారులు ముందడుగు అయితే వేస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికి వాద ప్రతివాదనలే జరుగుతున్నాయి. అన్నదాతలకు తోడునీడగా నిలిచే ఈ రుణమాఫీ పై ప్రభుత్వ చూపు పడింది.

ఈ పథకాన్ని ఎన్నికలకి ముందే అమలు చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నాయి. AP CM జగన్ ఇప్పటికే రైతుల కోసం వివిధ రకాల పథకాలను తీసుకువచ్చారు . రైతుభరోసా(rythu barosa), రైతుభీమా(rythu beema) లాంటి పథకాల్ని తీసుకొచ్చి రైతులకు ఎంతగానో సహాయం చేస్తున్నారు.ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో అన్ని రకాల పథకాలను అమలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు.

ఈ రుణమాఫీలో రైతులకు లక్ష రూపాయల వరకు మాఫీ చేయనున్నారు.గతంలో పట్టాదారు పాస్ బుక్(pattadhar pass book) పుస్తకాల పైనా బ్యాంకుల్లో ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ రుణమాఫీ చేసే అవకాశాన్ని AP ప్రభుత్వం కల్పించబోతుంది . అయితే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే మాఫీ అనేది జరుగుతుంది.విడతల వారీగా మాఫీ చేస్తారా లేక ఒకేసారి మాఫీ చేస్తారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది .

Also Read:Land Acquisition Act:భూ బాట సమస్యలతో బాధపడుతున్నారా? చట్టరీత్యా పరిష్కారం ఇప్పుడు మీ కోసం

    image credit:Telegraph india

బ్యాంకులలో ఎవరైతే లక్ష రూపాయల వరకు ఋణం కలిగి ఉన్న వారికీ సంబందించిన పత్రాలు వ్యవసాయ అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది.మెట్ట భూములు అయితే 7 ఎకరాలు మాగాణి అయితే 5 ఎకరాలు మొత్తం కలిపి 10 ఎకరాల లోపే భూములు ఉండాల్సి ఉంటుంది. ఏ పంట వేసిన కూడా ఈ పథకానికి అర్హులు గానే ఉంటారు . ప్రత్యేకంగా ఈ పంట వేయాలి అని స్పష్టత ఇవ్వలేదు కాబట్టి మీరు ఏ పంటనైనా వేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు పంట వివరాలను నమోదు చేసుకొని ఉండాలి.ఇక రైతు రేషన్ కార్డు(ration card) , ఆధార్ నెంబర్(Aadhar number) , పట్టాదారు పాసుబుక్, రైతు వివరాలు మీ దగ్గర ఉన్న రైతు సేవా కేంద్రం లో సమర్పించాల్సి ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.