Telugu Mirror : మానవ జీవితంలో ‘నిద్ర'(sleep) ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రశాంతమైన నిద్ర కూడా అనేది ఒక వరం లాంటిది. ఇంట్లో ఉండే అనేక సమస్యల వల్ల ,వ్యాపారంలో, చేసే పేని ఒత్తిడి వలన సరియైన నిద్రకు మరియు ప్రశాంతవంతమైన నిద్రకు దూరం అవుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం, నిద్ర అనేది మూడు స్తంభాలలో ఒకటి గా పరిగణిస్తారు.జీవితం లో ఉండే బాధ, దుఃఖం, బలం ,బలహీనత, ఒత్తిడి,అలసిపోవడం జ్ఞాన ,అజ్ఞానాల లాంటి అంశాలపై ఆధారాపడి ఉంటుంది. నిద్ర సరియైన పరిమాణం లో లేకపోయినా, అతిగా గా నిద్ర పోయినా అనారోగ్యానికి గురవుతారు.
బయట ప్రపంచంలో శారీరకంగా మరియు మానసికం(mentally)గా పనిచేసి తాత్కాలికంగా ఉపసంహరణ పొందడం కోసం ‘నిద్ర’ అనేది ఉపయోగపడుతుంది. నిద్ర సరిగా లేకపోతే కళ్ళు సాధారణ వస్తువులను గ్రహించడం మానేస్తాయి. శరీరం అలసటకు గురయినప్ప్పుడు ,మెదడు అలసిపోయినప్పుడు మరియు కళ్ళు అలసిపోయినప్పుడు నిద్ర ప్రధానంగా ప్రభావితం చేయబడుతుంది. వాటి నుండి విముక్తి పొంది దినచర్యలకు మరల ఉత్తేజపరుస్తుంది. నిద్ర మన శరీరానికి విశ్రాంతిని కలుగజేసి మరల చైతన్యంగా పని చేసేందుకు దోహదపడుతుంది. నిద్ర హృదయనాళ మరియు న్యూరోఎండోక్రిన్ ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తుంది.
Parota Recipe : పరిపూర్ణమైన పరోటా తయారీ విధానంతో తృప్తిగా ఆరగించండి ఇలా.
నిద్ర ఎన్ని రకాలు ?
చరక సంహిత నిద్ర ఆరు రకాలు : బాహ్యంగా ఉండే కొన్ని కారకాలు ఏంటంటే ,శ్లేష్మసముద్భవ (కఫ దోషం పెరగడం వల్ల),మన శరీరస్రంసంభవ (శరీరం మరియు మనస్సుపై ఆందోళకు గురి చేస్తుంది),తమోభవ (జడత్వ సూత్రం వల్ల కలుగుతుంది),అగంతుక (వాతావరణ కారణంగా వచ్చే ఇబ్బందులు),రాత్రిస్వభావ సముద్భవ (రాత్రి స్వభావం ద్వారా దారి తీస్తుంది ) మరియు వ్యాధి అనువర్తిని (వివిధ రోగాల వల్ల కలుగుతుంది).ఈ భూమిపై నివసించే ప్రతి జీవరాశికి నిద్ర అనేది అవసరం కాబట్టి రాత్రిస్వభావ సముద్భవ ని అన్ని జీవులకి తల్లి అని భావిస్తారు.
నిద్రించే సమయం :
నిద్ర విషయం లో మనం సూర్యునికి అనుగుణంగా నడుచుకోవాలి. రాత్రి వేళా తొందరగా అంటే 7 నుండి 7:30 మధ్యలో భోజనం చేసి 3 గంటల వ్యవధిలో నిద్రించి తెల్లవారుజామున లేవడం అనేది ఒక మంచి దినచర్య.సరికాని సమయంలో నిద్రించడం వలన దీర్ఘకాల నీరసం, రినిటిస్,ఎడెమా మరియు జీవక్రియలు ఆటంకం కలుగుతుంది.
పగటిపూట నిద్రించడం :
ఎండా కాలం లో పొడిగా ,వేడిగా ఉండడం మరియు రాత్రి సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి సియస్టా సమంజసంగా ఉంటుంది.కానీ ఇది వేరే ఋతువుల్లో విరుద్దంగా ఉంటుంది. కఫ దోషాన్ని తీవ్రతరం చేసి ఛాతిలో రక్త చలన దోషం ,అజీర్ణం మరియు జ్వరం లాంటి కొన్నిపెరిస్థితులని కలుగజేస్తుంది.మరి కొన్ని సందర్భాలలో అతిగా మాట్లాడడం, తీవ్రమైన ఒత్తిడి , భారీ బరువులు మోయడం ,కోపం ,దుఃఖం ,భయం లాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు పగటి పూత నిద్రించడం మంచిది. ఆరు నుండి ఎనిమిది గంటల నిద్ర లేకపోతే పగటిపూట నిద్రించడం వలన నిద్ర నిద్ర లోటును భర్తీ చేయవచ్చు.
Effects of Tea : ‘టీ’ వల్ల వచ్చే దుష్ప్రయోజనాలు మరియు నియంత్రణకై నిపుణుల మాటలు.
ప్రశాంతంగా నిద్రించండి :
తరచూ వ్యాయామం చేయడం, శారీరకంగా చురుకుగా ఉండడం వల్ల ,మంచి నిద్రకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. గోరువెచ్చని నీళ్లలో స్నానం చేయడం మరియు తలంటుకుని సమయంలో తలకి మర్దన చేసుకోవడం మంచిది.బొడ్డు చుట్టూ నూనె రాసి స్వీయ మర్దన చేయడం కూడా మంచి ప్రయోజకరంగా ఉంటుంది.వ్యక్తిగతంగా బలగుదుచ్యాది, క్షీరబలము,చందనాది లాంటి నూనెలను వాడడం మంచిది.
సరిపడా నిద్ర విశ్రాంతి తీసుకోకపోవడం వలన గుండె లయ, బ్లడ్ ప్రెషర్ (రక్తపోటు) మరియు తీవ్ర ఎసిడిటీ(Acidity) లాంటి రకరకాలైన ఆరోగ్య సమస్యలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇది భావోద్వేగ శ్రేయస్సుపై అధిక ప్రభావాన్ని చూపుతుంది. ఎప్పుడూ నిరుత్సాహపడుతూ దిగులు చెందుతూ ఉన్న సందర్భాల్లో నిద్రలేమి సమస్యలను ఎదురుకున్నప్పుడు వైద్యడిని సంప్రదించడం మంచిది. అంతర్గతంగా ఏదైనా సమస్యలు ఉంటె అసమతుల్యతలను పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది.