Tirumala Darshan : వేంకటేష కరుణించవయ్యా..స్వామి వారి సర్వదర్శనానికి 35 గంటలు.

శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో కంపార్ట్‌మెంట్లన్నీ కిక్కిరిసిపోయాయి. నారాయణగిరి షెడ్లు కూడా నిండిపోయి, కల్యాణ వేదిక వరకు భక్తులతో క్యూ లైన్ కిటకిటలాడాయి.

Tirumala Darshan : తిరుమలలో కలియుగ వైకుంఠం భక్తులతో నిండిపోయింది. భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. తిరుమల భక్తులతో మరింత రద్దీగా మారింది. వేసవి సెలవులు (Summer Holidays)ముగిసి, స్కూళ్ళు, కాలేజీలు ఓపెన్ అయిన కూడా భక్తుల రద్దీ మారం ఏ మాత్రం తగ్గడం లేదు. శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూలు కడుతున్నారు. తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతుంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నెల 17వ తేదీ వరకు వీకెండ్ సెలవులు ఉండడంతో భక్తులు శ్రీవారి దర్శనానికి వెళుతున్నారు.

కలియుగ దైవం అయిన శ్రీనివాసుని జన్మస్థలమైన తిరుమలకు వేలాది మంది భక్తులు తీర్థయాత్రలు చేస్తారు. శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. కొంతమంది తిరమల (Tirumala) కు కాలినడకన వెళ్తే, మరికొందరు బస్సులో లేదా ప్రైవేట్ వాహనాల్లో స్వామిని దర్శించుకుంటారు. సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. వెంకన్న దర్శనానంతరం శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు.

Tirumala Darshan

శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో కంపార్ట్‌మెంట్లన్నీ కిక్కిరిసిపోయాయి. నారాయణగిరి షెడ్లు కూడా నిండిపోయి, కల్యాణ వేదిక వరకు భక్తులతో క్యూ లైన్ కిటకిటలాడాయి. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి.

భక్తుల రద్దీ పెరగడంతో తిరుమల రద్దీగా మారింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూ లు కడుతున్నారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులు 35 గంటలపాటు వేచి ఉండక తప్పదు. రూ.300 ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.

కోనేటి రాయుని దర్శనం కోసం గంటల తరబడి క్యూలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ తగిన సౌకర్యాలు కల్పిస్తోంది. శ్రీవారి సేవక్ ద్వారా నిత్యం అన్నప్రసాదం, తాగునీరు అందిస్తున్నారు. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ప్రత్యక్ష పర్యవేక్షణలో టీటీడీ ఉన్నతాధికారులు, విజిలెన్స్, భద్రతా సిబ్బంది నిరంతరం భక్తులకు సేవలు అందిస్తున్నారు.

శుక్రవారం 66,782 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 36,229 మంది భక్తులు తలనీలాలు స్వామి వారికి ఇచ్చారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Tirumala Darshan

Comments are closed.