తీరొక్క పువ్వులతో బతుకమ్మ, నేటి నుంచే తెలంగాణలో బతుకమ్మ వేడుకలు

తెలంగాణ సాంప్రదాయానికి ఈ బతుకమ్మ పండగ ముఖ్యమైన ప్రతీక. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచే బతుకమ్మ పండగ సంబరాలు ప్రారంభం.

Telugu Mirror : తెలంగాణలో అతిపెద్ద మహిళల పండుగ ఈరోజు ప్రారంభమవుతుంది. తెలంగాణ రాష్ట్ర గ్రామాల్లో మరియు పట్టణాల్లో ఇప్పటికే బతుకమ్మ మొదటి రోజు మొదలయింది. వీధుల్లో వాడల్లో బతుకమ్మ ఆటలకు బాలికలు మరియు మహిళలు సిద్ధమయ్యారు. తొమ్మిది రోజులపాటు జరిగే బతుకమ్మ వేడుకల్లో ప్రతివీధి, ప్రతి వాడా మెరిసిపోతుంది. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో బతుకమ్మను పేర్చి అలంకరించి స్త్రీలు ,యువతులు అందమైన వస్త్రాలు ధరించి రంగు రంగుల గాజులను చేతికి ధరించి బతుకమ్మ చుట్టూ చప్పట్లు కొడుతూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు.

బతుకమ్మ పండుగ చరిత్ర :

బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలగా పాడుతూ బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పురాణాల ప్రకారం ఒక గ్రామంలో సరిగ్గా వర్షాలు పడక కరువులో మిట్టాడుతున్న సమయంలో తంగేడు పూల చెట్ల పొదల్లో నవజాత శిశువును చూశారట. ఆ గ్రామ ప్రజలు ఆ పాపను ఆదరించి చూసుకున్నప్పటి నుంచి ఆ గ్రామంలో వాన కురిసిందని పంటలు బాగా పండాయని, ప్రతి ఇల్లు సిరి సంపదలతో కలకలలాడిందని చరిత్ర చెబుతోంది.

Also Read : Vaastu Tips : అన్నపూర్ణా దేవి అనుగ్రహం పొందాలంటే, వంట గదిలో ఈ వస్తువులను ఉంచకండి

మొదటి రోజు ఎంగిలి పువ్వు  బతుకమ్మ :

బతుకమ్మ ప్రారంభమయ్యే ముందు రోజు రాత్రి పూలన్నింటిని సేకరించి మరుసటి రోజు బతుకమ్మను పేర్చడం వల్ల మొదటి రోజుని ఎంగిలి పువ్వు బతుకమ్మ అని పిలుస్తారు. మరికొందరు భోజనం చేసాక బతుకమ్మను సిద్ధం చేస్తారు కాబట్టి ఎంగిలి బతుకమ్మ అని పిలుస్తారు. మొదటిరోజు బియ్యపు పిండి , నువ్వులు , నూకలతో కూడిన నైవేద్యాన్ని దేవతకి సమర్పిస్తారు.

bathukamma-is-celebrated-for-nine-days-and-corresponds-to-the-festivals-of-dasara-navratri-and-durga-puja
Image Credit : The Hans India

బతుకమ్మ పాటలతో సంబరాలు :

ఒకటేసి రెండేసి చందమామ ఒక్క పొద్దులాయె చందమామ మరియు  రామ రామ ఉయ్యాలో అంటూ  తెలంగాణ జానపద పాటలతో  రాష్ట్రంలో అన్ని వీధులు మారుమోగిపోతున్నాయి. మహిళల కోసం తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ సంబరం ఈరోజు నుండి వైభవంగా ప్రారంభమయింది. గోరింటాకు, తంగేడు, బంతి, గునుగు, తామర వంటి పూలతో అమ్మవారిని అలంకరించిన తర్వాత స్త్రీ పురుషులందరూ సమావేశమై తొమ్మిది రోజుల పాటు పాటలు, జానపద నృత్యాలు, కోలాటాలతో అమ్మవారిని పూజిస్తారు. తొమ్మిదో రోజు మహిళలంతా కోలాటాలు ఆడుతూ  స్థానిక చెరువులో పెద్ద బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

Also Read : To Day Panchangam October 14, 2023 భాద్రపద మాసంలో అమావాస్య తిధి నాడు శుభ, అశుభ సమయాలు

చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి  గల కారణం :

వివిధ పూలతో అలంకరించిన పూల బతుకమ్మలను గ్రామ చెరువులో నిమజ్జనం చేస్తారు. వర్షాకాలం నుండి వచ్చే నీటిలో ప్రజలకు హాని కలిగించే సూక్ష్మజీవులు ఉండవచ్చు. ఆ సమయంలో బతుకమ్మ పూలను వేస్తే అందులోని క్రిములు నశిస్తాయని మరియు మలేరియా, కలరా వంటి వ్యాధులు సోకకుండా ఉండేందుకు సహాయపడతాయని నమ్ముతారు.

Comments are closed.