ISRO : నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిసిన చంద్రయాన్-3..

Telugu Mirror : ఎంతో ఉత్కంఠ ముగిసింది. నాలుగు సంవత్సరాల క్రిందటి వైఫల్యాని నిద్రాహారాలు మాని అనుకున్న లక్ష్యాన్ని విజయం వైపుగా మళ్ళించినారు ఇస్రో శాస్త్రవేత్తలు. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమయింది. నిన్న మధ్య హానం 2:35 గంటలకు ప్రయోగించిన చంద్రయాన్ – 3 ప్రయోగం విజయవంతంగా ముగిసింది. కౌంట్ డౌన్ మొదలైన16నిమిషాలలో చంద్రయాన్-3 ప్రయోగం విజయ వంతం అయినట్లుప్రకటించారు. చంద్రునిపై అడుగుపెట్టిన 3 వ దేశంగా భారత్ నిలుస్తుందో లేదో తెలియాలంటే 40 రోజుల వరకు వేచి చూడాల్సిందే.

Make Up Tips : వర్షాకాలంలో తరచు మీ మేకప్ పాడవుతోందా అయితే వాటర్ ప్రూఫ్ మేకప్ ఉత్తమమైనది.

శ్రీహరికోట స్పేస్ పోర్ట్ నుండి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO )ద్వారా LVM-3 నిన్న మధ్యాహ్నం 2.35 గంటలకు 10 వేలమంది స్థిరమైన ప్రేక్షకులు మరియు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రయోగాన్ని వీక్షించిన లక్షలాదిమంది ప్రజల జేజేలు,కరతాళ ధ్వనుల మధ్య నింగిలోకి బయలుదేరింది. “మూన్ క్రాఫ్ట్” మధ్యహానం 3.01 గంటలకు 36,500కిమీ ×170కిమీల ఖచ్చితమైన బదిలీ కక్ష్యలో ఉందని.ఆగష్టు 23 సాయంత్రం 5.47 గంటలకు మూన్ ల్యాండింగ్ ప్లాన్ చేయబడిందని.ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాధ్ వెల్లడించారు.

ప్రయోగ సమయానికి ఫ్రాన్స్ లో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ “ఇది ప్రతి భారతీయుడి కలలు మరియు ఆశయాలను ఉన్నతంగా తీసుకెళ్ళింది. ఇంతటి అద్భుతమైన విజయం మన శాస్త్రవేత్తల అకుంఠితమైన అంకితభావానికి నిదర్శనం,వారి మేధస్సును,ప్రావీణ్యానికి నేను అభినందనలు తెలుపుతున్నాను!”అని ట్వీట్ చేసినారు.చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.వీరముత్తవేల్ వ్యోమనౌక యొక్క స్థితి గతులన్నీ సక్రమంగా ఉన్నాయని ధృవీకరించారు. కష్టమైన సాఫ్ట్-ల్యాండింగ్ కోసం ఇప్పుడు ప్రయాణం ప్రారంభమైందని పేర్కొన్నారు.

శుక్రవారం నుంచి చంద్రయాన్-3 జూలై 31 వరకు10 సార్లు భూమి కక్ష్యలో ప్రదక్షిణ చేస్తుంది. భూమినుంచి దాని సుదూర బిందువును (అపోజీ) పెంచేందుకు శాస్త్రవేత్తలు ప్రతిసారీ ఆపరేట్ చేస్తారు.శనివారం మధ్యహానం12.05 గంటలకు మొదటి ప్రదక్షిణ ఉంటుంది అని ఒక శాస్త్రవేత్త వెల్లడించారు. 1లక్ష కిలోమీటర్లకు అపోజీ చేరుకున్న తరువాత,శాస్త్రవేత్తలు అపోజీని చంద్రునికి (ట్రాన్స్ లూనార్ ఇన్సర్షన్) ఒక మార్గంలో పంపడానికి “స్లింగ్ షాట్ ” చేస్తారు.

ToDay Panchangam : తెలుగు మిర్రర్ న్యూస్ ఈ రోజు శనివారం, జూలై 15, 2023 తిథి ,పంచాంగం

ఐదున్నర రోజుల తరువాత వ్యోమనౌకను కీలకమైన చంద్రుని కక్ష్యలోకి ప్రవేశ పెట్టడానికి ఆన్ బోర్డ్ ప్రొపల్షన్ సిస్టమ్ లను బర్న్ చేయడం ద్వారా కక్ష్య లోకి పంపబడుతుంది.క్రాఫ్ట్ యొక్క ఎత్తు 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యకు తగ్గిస్తారు,వ్యోమనౌక ల్యాండింగ్ మాడ్యూల్ ఆగస్ట్ 17 న వేరు చేయబడుతుందిఅని సోమనాధ్ ప్రకటించారు.చంద్రయాన్-3 అంతరిక్ష నౌక ప్రొపల్షన్ మాడ్యూల్ (2,148 కిలోలు), ల్యాండర్ విక్రమ్ (1,723.89 కిలోలు) అలాగే రోవర్ ప్రజ్నాన్ (26కిలోలు) లతో కలసి ఏడు శాస్త్రీయ పరికరాలను మోస్తుందని స్వామినాధ్ తెలిపారు.

వేరెవ్వరూ చేయని పనులను చేయడానికి పేలోడ్ సెలెక్ట్ చేయబడినవని సోమనాధ్ తెలిపారు.చంద్రుని ఉపరితలం అలానే చంద్రుని పై ఉన్న ప్లాస్మా వాతావరణం నుంచి ఉష్ణం ఎలా వెళుతుంది,చంద్రుని ఉపరితల వాతావరణ పరిస్థితులు,భూమి జీవితం ఇతరపరిస్తితులులాంటివి అర్ధం చేసుకోవడానికి చంద్రయాన్-3 ప్రయత్నం చేస్తుంది.

Leave A Reply

Your email address will not be published.