DA Increase: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, డీఏ పెంపు, గ్రాట్యుటీ కూడా పెంపు!

ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం డీఏను 4% నుంచి 50%కి పెంచింది. వివరాల్లోకి వెళ్తే.

DA Increase: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్లకు గుడ్ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వారికి డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను క్రమంగా పెంచింది. ఇది వరుసగా 3 మరియు 4 శాతం పెరిగింది. మార్చిలో 50 శాతానికి చేరుకుంది. అయితే, డీఏ 50% వచ్చిన తర్వాత కొత్త నిబంధనలు అమలు అవుతాయి. ముందుగా, దీన్ని బేసిక్ పేలో కలిపి.  మళ్ళీ మొదటి నుండి DAని ప్రారంభిస్తారు. అలాగే, డీఏ 50%ని చేరుకున్నట్లయితే, ఉద్యోగులు వివిధ రకాల అదనపు ప్రయోజనాలు పొందేందుకు అర్హత సాధిస్తారు. ఇతర చెల్లింపులు, ముఖ్యంగా అద్దె భత్యం (HRA), ఇతర అలెవెన్సులు అధికంగా పెరుగుతాయి.

మరోసారి ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ ప్రకటించింది. ఉద్యోగుల రిటైర్మెంట్ గ్రాట్యుటీ (Retirement Gratuity) ని గణనీయంగా పెంచుతామని పేర్కొంది. రిటైర్‌మెంట్ మరియు డెత్ గ్రాట్యుటీ (Death Gratuity) లను 25% పెంచి.. మొత్తం రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షలు పెంచింది. ఇది జనవరి 1, 2024 నుండి అమల్లోకి వస్తుందని ఇప్పటికే స్పష్టం చేయగా.. మే 30, 2024న దీనిని ధృవీకరిస్తూ అధికారిక ప్రకటన విడుదల అయింది.

Govt Hikes Interest Rates : The central government has hiked interest rates on two small savings schemes for the January-March quarter of 2024.
Image Credit : Mint

కేంద్ర ప్రభుత్వం మార్చిలో డీఏను 4% నుంచి 50%కి పెంచింది. అయితే, దీని గురించి మార్చిలో ప్రకటించినప్పటికీ జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. కేంద్రం కనీసం ఏడాదికి రెండుసార్లు డీఏను సవరించాలి. ప్రతిసారీ జనవరి (January) మరియు జూలై (July) లలో మార్పు చేయవలసి ఉంటుంది, ఇది మార్చి మరియు సెప్టెంబర్లలో ప్రకటించడం జరుగుతుంది.

ప్రభుత్వ చట్టాల ప్రకారం ఏదైనా సంస్థలో ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులు గ్రాట్యుటీకి అర్హులు. వాస్తవానికి, ఒక ఉద్యోగి కంపెనీలో చేరినప్పుడు, కంపెనీకి వారి ఖర్చులో కొంత భాగం (CTC) వారి గ్రాట్యుటీకి యాడ్ అవుతుంది. ఇక ఆ ఉద్యోగులందరూ గ్రాట్యుటీలకు అర్హత సాధిస్తారు.

ప్రైవేట్ ఎంటర్‌ప్రైజెస్‌ (Private Enterprise) లోని ఉద్యోగులు 4.81 శాతం మూల వేతనం పొందుతారు. అంటే ఉద్యోగి సీటీసీ రూ. 5 లక్షలు ఉంటే రూ. 24,050 గ్రాట్యుటీగా వసూలు చేస్తారు. అంటే నెలకు రూ. 2,000 వరకు గ్రాట్యుటీ ఉంటుంది. ఉద్యోగి జీతం మరియు డీఏ ఆధారంగా గ్రాట్యుటీ లెక్కిస్తారు. ఒక ఉద్యోగి సంపాదించిన గ్రాట్యుటీ మొత్తం వారి సర్వీస్ కాలం మరియు చివరి వేతనంతో నిర్ణయిస్తారు. ప్రతి నెల 26 రోజులలో గ్రాట్యుటీ చెల్లిస్తారు.

Comments are closed.